Sakshi News home page

అభివృద్ధిపై ‘పెద్దనోట్ల’ పిడుగు

Published Wed, Nov 30 2016 4:05 AM

సిద్దిపేటలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు
పెట్టుబడులు వచ్చే సమయంలో ఈ పరిణామం శరాఘాతం
కేసీఆర్ దీక్ష చేయకుంటే తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్న

 సాక్షి, సిద్దిపేట: రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చే సమయంలో మనమీద పెద్దనోట్ల రద్దు పిడుగు పడిందని, ఇది రాష్ట్ర పురోగతికి అడ్డుగా నిలిచిందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం ఆయన సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాత బస్టాండ్ వద్ద ఉన్న 1,564 రోజుల దీక్షా పైలాన్‌కు పుష్పాంజలి ఘటించారు. టీఎన్జీవో భవనంలో ఛాయా చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఊపందుకునే సమయంలోనే పెద్దనోట్లు రద్దు కావడం మనకు ఇబ్బందే అని వ్యాఖ్యానించారు. దేశంలోని పారిశ్రామిక వేత్తలు, ప్రపంచంలోని ఐటీ కంపెనీలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయని, ఇక్కడి యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు వస్తాయని చెప్పారు.

రాష్ట్ర ఆదాయం పెరుగుతోందని అంచనా వేశాం కానీ ఆకస్మికంగా పెద్దనోట్ల రద్దు మనకు దురదృష్టంగా మారిందని వ్యాఖ్యానించారు. అరుుతే దీర్ఘకాలంలో మంచి ఫలితాలు వస్తాయనే ఆశిస్తున్నామని చెప్పారు. కేసీఆర్ చేపట్టిన నవంబర్ 29 దీక్ష ఢిల్లీ పునాదులు కదిలించిందని పేర్కొన్నారు. నాడు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన విద్యార్థులు ఇకపై ఆకుపచ్చ తెలంగాణ కోసం పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. కోటి ఎకరాల మాగాణి తెచ్చుకునేందుకు సిద్ధం కావాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను గుండెల్లో పెట్టుకుంటామని.. 1969 నాటి ఉద్యమకారులకు కూడా ప్రభుత్వం అండగా నిలబడిందని తెలిపారు. కేసీఆర్ ఒక్కడే తెలంగాణ తెచ్చిండా అని ఇవాళ కాంగ్రెస్, టీడీపీ నాయకులు అంటున్నారన్నారు.

వాళ్లను తాను ఒకటే  ప్రశ్న అడుగుతున్నానని.. కేసీఆర్ ఆనాడు ఆమరణ దీక్షకు కూర్చోకపోతే తెలంగాణ వచ్చేదా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ కోసం పదవులకు రాజీనామాలు చేద్దాం అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖం చాటేయలేదా అని నిలదీశారు. టీడీపీ వాళ్లు రాజీనామా జిరాక్స్ కాపీలు స్పీకర్‌కు ఇచ్చి ఒరిజినల్ కాగిరుుతాలు వాళ్ల దగ్గరే పెట్టుకొని వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. ఇటువంటి వాళ్లతో తెలం గాణ వచ్చేదా? అని మంత్రి ప్రశ్నించారు.

Advertisement
Advertisement