పేదల పథకం పడకేసింది | Sakshi
Sakshi News home page

పేదల పథకం పడకేసింది

Published Tue, Jul 22 2014 3:19 AM

పేదల పథకం  పడకేసింది - Sakshi

ఇందూరు: ‘దేవుడు వరమిచ్చినా, పూజారి కరుణించలేదన్న’ చందం గా తయారైంది ఉచిత కార్పొరేట్ విద్యా పథకం పరిస్థితి. దరఖాస్తు లవరకు వచ్చిన ప్రక్రియ కాస్త ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో నిలిచి పోయింది. పేద విద్యార్థులకు మేలు కలిగించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఏడాది కూడా పథకం కొనసాగేలా ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
 
కళాశాలలు మొదలై రెండు నెల లు గడుస్తున్నప్పటికీ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు సీట్ల భర్తీ విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. అసలే నెల రోజు లు ఆలస్యంగా నోటిఫికేషన్ జారీ చేశారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకుని నెల రోజులవుతున్నా సీట్ల భర్తీ ఊసెత్తడం లేదు. ఫలితంగా ప్రతిభ గల నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ కళాశాల (ఇంటర్) విద్య ఉచితంగా అందకుండాపోతుందనే భయం పట్టుకుంది. ఫీజులు కట్టి ఉన్నత చదువులు చదవలేని పేద పిల్లలకు ఆసరాగా ఉన్న పథకం ఇక ఉండదేమోననే ప్రచారం జరుగుతుండడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌ను సైతం మూసివేయడంతో విద్యార్థులకు, వారి తల్లి దండ్రులకు ఏం సమాధానం చెప్పాలో అధికారులకు పాలు పోవడంలేదు.
 
జిల్లాలో ఇదీ పరిస్థితి
పదవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలలలో ఉచిత వసతితోపాటు ఐఐటీ, జేఈఈ, ఏఐఈఈ ఈ, ఎంసెట్‌లలో కోచింగ్‌తో కూడిన ఉచిత ఇంటర్ విద్యను అందించడానికి గత కొన్ని సంవత్సరాలుగా ఈ పథకం కొనసాగుతోంది. దీని ద్వారా జిల్లాలోని పేద విద్యా ర్థులకు నాణ్యమైన విద్య అందడమే కాకుండా, వారి కుటంబాలకు ఆర్థిక భారం తగ్గింది. 2014-15 విద్యా సంవత్సరానికిగాను జిల్లాలో శ్రీ కాకతీయ, న్యూ కాకతీయ, శాంకరీ, నిర్మల హృదయ, క్షత్రియ మొత్తం ఐదు జూనియర్ కళాశాలలను ఎంపిక చేశారు.
 
జిల్లాకు 183 సీట్లను కేటాయించిన ప్రభుత్వం, ఎస్సీలకు-75, ఎస్టీలకు 32, బీసీలకు 42, బీసీ(సీ)కి 14, ఈబీసీలకు 10, మైనార్టీలకు 10 సీట్లుగా కేటాయించారు. ఈ పథకానికి దరఖాస్తులు చేసుకోవాలంటే విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో 8,9,10 తరగతులు ఖచ్చితంగా చదివి ఉండాలి. పదవ తరగతిలో 7.0 గ్రేడ్ మార్కులు దాటి ఉండాలి. ఈ నిబంధనలతో సాంఘిక సంక్షేమాధికారులు జూన్ 24న నోటిఫికేషన్ జారీ చేశారు.
 
నిజానికి దీనిని జూన్ మొదటి వారంలోనే జారీ చేయాలి. కానీ, ఒక నెల ఆలస్యమైంది. ఆలస్యమైనప్పటికీ తొందరగానే సీట్లను భర్తీ చేస్తారనే ఉద్దేశంతో విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నారు. జూన్ 30తో దరఖాస్తుల తేదీ కూడా ముగిసింది. వందల సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో సీటుకు 10 నుంచి 15మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. నెల రోజులు గడుస్తున్నా సీట్లను భర్తీ చేయలేదు.
 
మరో మార్గం లేక చదువు‘కొంటున్నారు’

సీట్ల భర్తీ విషయంలో ప్రభుత్వం నిర్ణయానికి రాకపోవడం, ఒక వేళ వచ్చినా విద్యార్థుల ఎంపిక హైదరాబాద్ కమిషనరేట్‌లో జరగుతుందని, తద్వారా ఆలస్యం జరి గి తమ పిల్లలు చదువును నష్టపోతారనే ఉద్దేశంతో పేద కుటుంబాలకు చెందినవారు ఫీజులు చెల్లించి ప్రయివేటు కళాశాలలలో చేరుస్తున్నారు. వసతి, విద్య మొత్తం కలి పి సూమారు రూ.30 నుంచి 35వేల వరకు ఖర్చు అవుతోంది. అదే ఈ పథకం ద్వారా చదవితే డబ్బులు వెచ్చించే పని ఉండేది కాదు. ఇటు మరి కొందరేమో ప్రతిభ కలి గిన విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వ కళాశాలలో చేరుతున్నారు. ఇంకొందరు ఇంకా ఈ పథకంలో సీట్ల కోసం ఎదురు చూస్తున్నారు.  
 
ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే ఆలస్యం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన నేపథ్యంలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ) విభజన కూడా జరిగింది. విద్యార్థుల ఎంపికను సీజీజీవారే చేస్తారు. రాష్ర్టంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుని ఆదేశాలు ఇస్తే తప్ప విద్యార్థుల ఎంపిక జరగదు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని భా విస్తున్నాం.

Advertisement
Advertisement