‘మద్దతు' గగనమే.. | Sakshi
Sakshi News home page

‘మద్దతు' గగనమే..

Published Sun, Oct 12 2014 3:28 AM

‘మద్దతు' గగనమే..

జమ్మికుంట:
 అంతర్జాతీయ మార్కెట్లో పత్తి ధరల హెచ్చుతగ్గులు జిల్లా రైతులపై ప్రభావం చూపుతున్నాయి. సీజన్ ఆరంభం కాకముందే పత్తి ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత సీజన్ చివరలో జమ్మికుంట మార్కెట్‌లో పత్తి ధర క్విం టాలుకు రూ.5000 పలికింది. ఈసారి మద్దతు ధర లభించటం కూడా గగనంగా కనిపిస్తోంది. జిల్లాలో తొలకరి జల్లులకు విత్తనాలు వేసిన రైతులు ప్రస్తుతం పూతకొచ్చిన పత్తిని ఏరుతున్నారు. గతేడాది మిగిలిన పత్తితో పాటు.. కొత్త పత్తిని రైతులు మార్కెట్లకు తరలిస్తున్నారు.

ప్ర స్తుతం జమ్మికుంట మార్కెట్‌లో క్వింటాల్ రూ.3100 నుంచి గరిష్ఠంగా రూ.3300 ధర పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ సీజన్లో పత్తికి డిమాండ్ లేదని వ్యాపారులు కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నారు. జిన్నింగ్ మిల్లుల్లో యంత్రాలు రిపేర్లు ఉన్నాయంటూ కొనుగోళ్లకు దూరంగా ఉంటున్నారు. దీపావళి వరకు మిల్లులు నడిచే పరిస్థితి లేదని వ్యాపారులు చేతులెత్తేస్తున్నారు.

సీసీఐ కొనుగోళ్లు చేస్తే తప్ప తాము రైతుల నుంచి పత్తి సేకరించలేమ ని స్పష్టం చేస్తున్నారు. జమ్మికుంట మార్కెట్ కార్యాలయంలో పత్తి కొనుగోళ్లపై అధికారులు, వ్యాపారులు శనివారం సమావేశమయ్యూరు. వ్యాపారుల వ్యాఖ్యల వెనుక ఉన్న మర్మమేమి టో అర్థం కావడం లేదు. సీజన్ ప్రారంభంలో సీసీఐ కొనుగోలు చేయదనే ఉద్దేశంతో ఈ మెలి క పెడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. దసరా పండగకు ముందు మూతపడ్డ జమ్మికుంట మార్కెట్ ఇంకా తెరుచుకోలేదు.

 సీజన్ అరంభంలోనే చిక్కులు
 తెలంగాణలో వరంగల్ మార్కెట్ తర్వాత జమ్మికుంట మార్కెట్ రెండవ పెద్ద మార్కెట్‌గా పేరుంది. ప్రతి సీజన్‌లో అక్టోబర్ నుంచే కరీంనగర్  జిల్లాతో పాటు వరంగల్ జిల్లా సమీప ప్రాంతాల నుంచి రైతులు పత్తిని అమ్ముకునేందుకు వస్తుంటారు. ఈసారి అక్టోబర్ 12వ తేదీ వచ్చినా పత్తి మార్కెట్ గేటు తెరుచుకోలేదు. దీంతో ఈ సీజన్‌లో పత్తి ఏరుతున్న రైతులు చేతికి వచ్చిన పంటను అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.

కొందరు రైతులు ఏరిన పత్తిని ఇళ్లల్లో నిల్వ చేయగా, మరి కొందరు రైతులు డబ్బులు అవసరాల కోసం వరంగల్ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారు. ఇప్పటికే జమ్మికుంట మార్కెట్ కొత్త పత్తితో కలకలాడాల్సి ఉండగా బోసిపోతోంది. సీజన్ ప్రారంభంలో రోజుకు దాదాపు నాలుగు వేల క్వింటాళ్ల పత్తి వస్తుంది. ధరలు పెరుగుతున్న క్రమంలో పదివేల క్వింటాళ్లకు పైగానే ముంచెత్తుంది. గతంలో ఒక్కరోజు లక్ష బస్తాలు అమ్మకానికి వచ్చిన సందర్భాలున్నారుు. కానీ.. ఈసారి ఎలాంటి కారణాలు లేకుండా నిరవధికంగా బంద్ కొనసాగుతుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.

 కుమ్మక్కు కుట్రలు..?
 ఇప్పటికే కరీంనగర్ మార్కెట్‌లో సీసీఐ కొనుగోలు తెరిచినా ఒక్క బస్తా కూడా కొనలేదు. జమ్మికుంట మార్కెట్‌లో సోమవారం నుంచి రంగంలోకి దిగనున్నట్టు ఆ సంస్థ వర్గాల ద్వారా తెలిసింది. అరుుతే ఈ విషయూన్ని ఇంకా అధికారికంగా ప్రకటించకపోవడంతో రైతుల్లో అనుమానాలు నెలకొన్నారుు. రైతులు ఎనిమిది శాతం తేమ మించకుండా నాణ్యమైన పత్తిని తీసుకువస్తేనే మద్దతు ధర లభిస్తుందని ప్రచారం చేస్తోంది. నీళ్లు చల్లిన పత్తిని తేస్తే ఎట్టి పరిస్థితుల్లో కొనేది లేదని సీసీఐ హెచ్చరిస్తోంది.

సీసీఐ తేమ సాకుతో నిరాకరించే పత్తిని వ్యాపారులు తక్కువ ధరలతో కొనుగోళ్లు చేసి సొమ్ము చేసుకునే పరిస్థితులు కన్పిస్తున్నాయి. గత సీజన్‌లో జమ్మికుంట మార్కెట్‌లో సీసీఐ అదే తీరును కనబరిచింది. కేవలం 125 క్వింటాళ్ల పత్తినే కొనుగోళ్లు చేసింది. వ్యాపారులు రికార్డు స్థారుులో 1.24 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేశారు. ఇటు సీసీఐ, అటు వ్యాపారులు అనేక కొర్రీలు పెట్టి పత్తి రైతులను చిత్తు చేసే అవకాశాలు కనిపిస్తున్నారుు. ప్రభుత్వం స్పందించి రైతులకు మద్దతు ధర లభించేలా చర్యలు చేపట్టాల్సి అవసరముంది.  

Advertisement
Advertisement