పన్నుల వసూళ్లతోనే సంక్షేమం | Sakshi
Sakshi News home page

పన్నుల వసూళ్లతోనే సంక్షేమం

Published Tue, Apr 26 2016 2:28 AM

పన్నుల వసూళ్లతోనే సంక్షేమం

కలెక్టర్ వాకాటి కరుణ
వాణిజ్య పన్నుల శాఖ
అధికారులకు అభినందనలు



వరంగల్ బిజినెస్ : వాణిజ్య శాఖ ద్వారా వసూలు చేసే పన్నులతోనే ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు ముందుకు సాగుతున్నాయని కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు. 2015-16 సంవత్సరానికి రాష్ట్రంలోనే పన్నుల వసూళ్లలో జిల్లా మొదటిస్థానం లో నిలిచినందుకు వరంగల్‌లోని సునీల్ గార్డెన్స్‌లో వాణిజ్య పన్నుల శాఖ సక్సెస్ మీట్‌ను సోమవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ డివి జన్ పరిధిలోని 11 సర్కిళ్ల సిబ్బందికి కలెక్టర్ ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్ కరుణ మాట్లాడుతూ వచ్చే ఏడాది కూడా పన్నులు బాగా వసూలు చేసి జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని అధికారులకు సూచించారు.

వాణిజ్యపన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ హరిత మాట్లాడుతూ అధికారులు, ఉద్యోగుల సమష్టి కృషితోనే రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచామన్నారు. వాణిజ్య పన్నుల శాఖ రీజినల్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ అందరి కృషితోనే పన్నుల వసూళ్లలో మొదటి స్థానం సాధించామన్నారు. అనంతరం కలెక్టర్‌ను యూనియన్ నాయకులు అభినందించారు. సమావేశంలో సీటీఓలు స్నేహ, అంజయ్య, వసంత, శ్రీలక్ష్మి, సాగర్, రామాంజనేయులు, రత్తయ్య, సీపీటీఓలు రాజన్న, పుష్పలత, జ్యోతి, యూనియన్ నా యకులు గోపికిషోర్, ప్రవీణ్, మసూద్, ఎలిజ, సునీ ల్‌రెడ్డి, శ్రీనివాస్, వినయ్, రమేష్ పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement