రాష్ట్రంలో సీఎం దుష్టపాలన | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో సీఎం దుష్టపాలన

Published Thu, Feb 25 2016 4:55 AM

రాష్ట్రంలో సీఎం దుష్టపాలన - Sakshi

ప్రభుత్వానికి ప్రతిపక్షాలు
ఉండకూడదన్న దురుద్దేశం
ప్రభుత్వ తీరుపై
ధ్వజమెత్తిన టీడీపీ నేతలు
జిల్లా ప్రాజెక్టులను సందర్శించిన మాజీ ఎమ్మెల్యేల బృందం

  
ఆత్మకూర్/కొత్తకోట రూరల్/మాగనూర్: రా ష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దుష్టపాలన సాగిస్తున్నారని టీడీపీ సీనియర్ నేతలు ధ్వజమెత్తారు. ఇతర పార్టీల నాయకులను తమ టీఆర్‌ఎస్‌లోకి తీసుకొచ్చే విధంగా ప్రలోభాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల నాటికి వారంతా పార్టీకి తిరిగిరావడం ఖాయమని, వారి మధ్య కుమ్ములాటలు ఏర్పడక తప్పవని హెచ్చరించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు సీతమ్మ, కె.దయాకర్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బక్క ని నర్సింహులు జిల్లాలోని రా మన్‌పాడు ప్రాజెక్టుతో పాటు దిగువ జూరాల జలవిద్యుత్ ఉత్పత్తికేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. రాష్ట్రంలో ప్రజాసమస్యలను ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు. కేంద్ర ప్ర భుత్వం రూ.790కోట్ల కరువునష్టం ప్రకటిం చినా నేటికీ సహాయక చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరమన్నారు. జిల్లాకు రూ.75 కోట్లు కావాలని నివేదికలు పంపిస్తే కేవలం రూ.15కోట్లు మాత్రమే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 39టీఎంసీలు వాడుకునేందుకు వాటా ఉం దని అన్ని ప్రాజెక్టులకు కలిపి 140టీఎంసీ లు కేటాయించాలని కోరారు.  

దిగువ జూరాలలో చేతి కొచ్చిన పవర్ ప్లాంట్‌ను నీటముంచారని, అం దుకు సంబంధించిన కారణాలు, బాధ్యులను నేటికీ తేల్చలేదని ఎంతో విలువైన విద్యుత్‌ను, రూ.వందల కోట్ల నష్టాన్ని భరించాల్సి వచ్చిం దన్నారు.  దిగువ జూరాల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ జెన్‌కో పవర్‌హౌజ్ నీట మునిగిన నేపథ్యంలో తమ బృందం గతంలోనే పర్యటించి.. ఈ సంఘటన మానవ తప్పిదం వల్లనే జరిగిందని, వెంటనే న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో విచారణ కమిటీ వేశారని, కానీ ఆ కమిటీ నివేదిక నేటికీ బహిర్గతం చేయకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
 
ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే నీటిగండం
రామన్‌పాడు ప్రాజెక్ట్ డెడ్‌స్టోరేజీకి చేరిందని, వేసవిలో జిల్లా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని టీడీపీ నేతలు హెచ్చరించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. మునుపెన్నడూ లేని విధంగా రామన్‌పాడు ప్రాజెక్టు ఇంత దయనీయస్థితికి చేరిందన్నారు. పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజలకు మౌలిక వసతుల కల్పనపై చూపాలని ప్రభుత్వానికి హితవుపలికారు. అంతకుముందు రామన్‌పాడ్ ప్రాజెక్టులో మిగిలి ఉన్న నీటిలో వారంతా పడవలో ప్రయాణించి పరసరప్రాంతాలను పరిశీలించారు. వారి వెంట టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మేస్త్రీ శ్రీనువాసులు, టీడీపీ మండల అధ్యక్ష కార్యదర్శులు నాగ న్నయాదవ్, కొమ్ము భరత్‌భూషణ్ ఉన్నారు.
 
రైతుల ప్రయోజనాలు కాపాడాలి: రావుల
మాగనూర్: రాష్ట్రంలో రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతుంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏ ప్రయత్నం చేయకపోవడం దారుణమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి ప్రశ్నించారు. రైతుల ప్రయోజనాలను కాపాడకపోతే మీకు అధికారం ఎందుకని ప్రశ్నించారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యేలు కె.దయాకర్‌రెడ్డి, కె.సీతమ్మ, బక్కని నర్సిములు, ఎంపీపీ అంజనమ్మ ఆధ్వర్యంలో కృష్ణానదిలో నీళ్ల పరిస్థితిని పరిశీలించారు. నిల్వ ఉన్న నీటిని కూడా వదలకుండా కర్ణాటక రైతులు నీటిచౌర్యానికి పాల్పడితే ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. కృష్ణానదిలో సగం నీటివాటా సాధించాలని కోరారు. వారి వెంట టీడీపీ నాయకులు ఎల్లాగౌడ్, రవిందర్, లక్ష్మినారాయణ, కృష్ణమూర్తి, శేఖర్‌గౌడ్ ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement