డ్యూటీకి ఎగనామం.. ఆపై వీవీతో విధులు | Sakshi
Sakshi News home page

డ్యూటీకి ఎగనామం.. ఆపై వీవీతో విధులు

Published Wed, Aug 29 2018 11:31 AM

Teacher Absent To Duty - Sakshi

తూప్రాన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయురాలు విధులకు గైర్హాజరవడమే కాకుండా విద్యావలంటీర్‌ను ఏర్పాటుచేసుకున్న ఘటన తూప్రాన్‌ మండలం వట్టూర్‌లో వెలుగుచూసింది. దీంతో గ్రామస్తుల ఫిర్యాదు మేరకు జిల్లా విద్యాధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలు.. వట్టూర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచర్‌ శాంతి కవిత కొన్ని రోజులుగా విధులకు గైర్హాజవుతోంది.

ఈక్రమంలో గ్రామానికి చెందిన సంధ్యను విద్యావలంటరీగా నియమించి.. తన పనులు చేసుకుంటోంది. ఈక్రమంలో ఆమె రూ.8 వేలు చెల్లింస్తోంది. కవిత విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని కలెక్టర్‌కు గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు విద్యాశాఖ ఏడీ భాస్కర్‌రావు, నోడల్‌ ఆఫీసర్‌ మధుమోహన్‌ వట్టూర్‌ పాఠశాలలో విచారణ చేపట్టారు.

పాఠశాల విద్యార్థులతో, గ్రామస్తులతో మాట్లాడారు. అయితే, విచారణ సమయంలో ఉపాధ్యాయులు పాఠశాలలో లేకపోవడం గమనార్హం. తేదీ లేకుండా కేవలం లీవ్‌ లెటర్‌ను ఉంచినట్టు అధికారులు గుర్తించారు. వెంటనే విచారణ చేపట్టి పూర్తి సమాచారంతో నివేదిక అందించాలని ఎంఈఓ నర్సింలుకు అధికారులు సూచించారు.

Advertisement
Advertisement