25 నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు | Sakshi
Sakshi News home page

25 నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు

Published Wed, Mar 11 2015 12:44 AM

Telangana 10th Class Time Table, Final Exam Dates 2015

 నల్లగొండ అర్బన్ : మార్చి 25 నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు  10వ తరగతి పబ్లిక్ పరీక్షలు సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఉదయం 9-30 గంటల నుంచి మధ్యాహ్నం 12-15 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 25న ఫస్ట్‌లాంగ్వేజ్ పేపర్-1, 26న ఫస్ట్‌లాంగ్వేజ్ పేపర్-2, 27న సెకండ్ లాంగ్వేజ్, 30న ఇంగ్లీష పేపర్-1, 31న ఇంగ్లీష్ పేపర్-2, ఏప్రిల్-1న మ్యాథమెటిక్స్ పేపర్-1, 2న మ్యాథమెటిక్స్ పేపర్-2, 4వ తేదిన జనరల్ సైన్స్ పేపర్-1, 6న జనరల్ సైన్స్ పేపర్-2 ఉంటుందని వివరించారు. అదే విధంగా 7వ తేదీన సోషల్ స్టడీస్ పేపర్-1, 8న సోషల్ స్టడీస్ పేపర్-2, 9న ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 (సంస్కృతం, అరబిక్, పర్షియా ), 10న ఓఎస్‌ఎస్‌సీ మొయిన్ లాంగ్వేజ్ పేపర్-2 (సంస్కృతం, అరబిక్, పర్షియా), 11న ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్ కోర్సు (థియరీ) ఉంటాయని తెలిపారు.
 
 ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన సంబంధిత అధికారులను కోరారు. పరీక్షలకు ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేయడానికి తహసీల్దార్ కేడర్ అధికారులను కేటాయించామని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద విధిగా 144 సెక్షన్ అమలు చేయాలని, కేంద్రాల వద్ద ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12-30 గంటల వరకు అన్ని జీరాక్స్ షాపులను మూసి ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖకు సూచించారు. సెక్యూరిటీ, ఎస్కార్టు ఏర్పాటుతోపాటు పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు.
 
 పరీక్షల నిర్వహణకు అవసరమైన చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లను సిదం్ధ చేయాలని సూచిం చారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్‌ఎయిడ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని, మంచినీటి సౌకర్యంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉం చేందుకు మున్సిపల్, పంచాయతీశాఖ అధికారులు చర్య లు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పరీ క్షలు నిర్వహించే సమయంలో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12-30 గంటల వరకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు.

Advertisement
Advertisement