వైద్య పరికరాల తయారీ కేంద్రంగా తెలంగాణ | Sakshi
Sakshi News home page

వైద్య పరికరాల తయారీ కేంద్రంగా తెలంగాణ

Published Thu, Feb 11 2016 12:31 AM

Telangana as a manufacturing center for medical equipment

రాష్ట్రంలో పెట్టుబడులకు అమ్‌చామ్ సుముఖత
 
 సాక్షి, హైదరాబాద్: వైద్య పరికరాల తయారీ కేంద్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ (అమ్‌చామ్) స్వాగతించింది. తెలంగాణలో అమెరికన్ కంపెనీలకు పెట్టుబడి అవకాశాలపై బుధవారం హైదరాబాద్‌లో అమ్‌చామ్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, పరిశ్రమల కార్యదర్శి అరవింద్ కుమార్‌తో సమావేశమయ్యారు.

అమెరికాకు చెందిన 75 కంపెనీలకు అమ్‌చామ్ ప్రాతినిధ్యం వహిస్తోందని..తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా వున్నట్లు అమ్‌చామ్ ప్రతినిధులు ఈ సమావేశంలో ప్రకటించారు. వైద్య సాంకేతిక అంశాలతో పాటు.. తెలంగాణలో వైద్య ఉపకరణాల తయారీకి అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పన, ప్రస్తుత సౌకర్యాలపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానం అత్యుత్తమంగా వుంద ని అమ్‌చామ్ బృందం కితాబునిచ్చింది. ఈ సమావేశంలో అమ్‌చామ్ మెడికల్ డివెజైస్ కమిటీ ైచైర్మన్ ప్రబల్ చక్రవర్తితో పాటు స్ట్రైకర్ ఎండీ మోహిత్ మల్హోత్రా, రాకేశ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement