716 కొలువుల భర్తీకి ఆమోదం

26 Aug, 2018 01:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఖాళీగా ఉన్న 716 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళ, శిశు, వికలాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖలో 325 పోస్టులను, అగ్నిమాపక శాఖలో 391 పోస్టులను భర్తీ చేసేందుకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్నిమాపక శాఖలోని వివిధ కేటగిరీల్లోని పోస్టులను పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు, శాఖాపరమైన ఎంపిక కమిటీ, టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో భర్తీ చేయాలని పేర్కొంది. మహిళా, శిశు, వికలాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖలోని 325 గ్రేడ్‌ 2 విస్తరణ అధికారి పోస్టులను శాఖాపరమైన ఎంపిక కమిటీతో భర్తీ చేయాలని సూచించింది.

మరిన్ని వార్తలు