Sakshi News home page

అధిక వినియోగ వాటాలపై తేల్చేదెన్నడు?

Published Sat, Dec 24 2016 2:11 AM

అధిక వినియోగ వాటాలపై తేల్చేదెన్నడు?

కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ
ఏపీ అదనంగా వాడుకున్న నీటి వాటా సర్దుబాటు చేయాలని వినతి
సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా జలాల్లో గడచిన రెండున్నరేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ చేసిన అదనపు నీటి వినియోగాన్ని సర్దుబాటు చేసే అంశాన్ని త్వరగా తేల్చి రాష్ట్రానికి న్యాయం చేయాలని తెలంగాణ మరోసారి కృష్ణాబోర్డును కోరిం ది. గతంలో రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన అవగాహన మేరకు అదనంగా ఏ రాష్ట్ర్టమై నా నీటిని వినియోగిస్తే, తర్వాత నీటి లభ్యత పుష్కలంగా ఉన్న సమయాల్లో వాటిని సర్దు బాటు చేయాల్సి ఉంటుందని, దాన్ని దృష్టి లో పెట్టుకొని రాష్ట్ర రబీ అవసరాలకు నీటి కేటాయింపులు చేయాలని విన్నవించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కృష్ణా బోర్డుకు లేఖ రాసింది.

2014–15 వాటర్‌ ఇయర్‌లో తన వాటాలకు మించి ఏపీ 45 టీఎంసీలు అధికంగా వినియోగించిందని, పోతిరెడ్డిపాడు కింద 11.24 టీఎంసీలు అధిక వినియోగం చేసి, లెక్కల్లో చూపలేదని లేఖలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కృష్ణా డెల్టా వ్యవస్థ(కేడీఎస్‌) కింద లెక్కల్లో చూపుతున్న దానికి వాస్తవ వినియోగానికి 23 టీఎంసీల మేర వ్యత్యాసం ఉందని వివ రించింది. దీంతో పాటే తెలంగాణ మైనర్‌ ఇరిగేషన్‌ కింద 24 టీఎంసీలకు మించి వినియోగం చేయలేదని, గడచిన పదేళ్ల లెక్కలు తీసుకున్నా 30 టీఎంసీలు మించి వినియోగం లేదన్న విషయం అవగతమవు తుందని వెల్లడించింది.

2015–16లో తీవ్ర నీటి కరువుతో నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ కింద పంటలకు నీరివ్వలేదని, 2016–17 ఖరీఫ్‌లో నీటి రాక ఆలస్యం, పంపకాలపై నిర్ణయంలో జాప్యంతో సరైన విధంగా నీటి విడుదల జరగలేదని పేర్కొంది. ఈ దృష్ట్యా తాము ప్రస్తావించిన అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని, ప్రస్తుత రబీలో అయినా సాగర్‌ ఎడమ కాల్వ కింది పంటలకు వాటాల మేరకు నీటిని ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.

కాగితపు లెక్కల ఆధారంగానే వాటాలు..
కాగా నీటి వాటాల విషయంలో తెలంగా ణ నుంచి వస్తున్న అభ్యంతరాలపై బోర్డు స్పందించినట్లు తెలిసింది. తాము కేవ లం అధికారులు అందిస్తున్న కాగితపు లెక్కల ఆధారంగానే నీటి వాటాలు తేల్చుతున్నామని, అంతకుమించి తమ ముందు వేరే దారి లేదని తెలుపుతూ బోర్డు లేఖ రాసినట్లుగా సమాచారం. సాగర్, శ్రీశైలం, జూరాల వద్ద సంయుక్త కమిటీలను ఏర్పాటు చేసి, రోజువారి నీటి ప్రవాహపు వివరాలు తెలపాలని కోరినా చాలా చోట్ల అది జరగడం లేదని వివరించినట్లు తెలిసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement