ప్రతిష్టాత్మకంగా ‘ఆసరా’ | Sakshi
Sakshi News home page

ప్రతిష్టాత్మకంగా ‘ఆసరా’

Published Sun, Nov 9 2014 11:34 PM

ప్రతిష్టాత్మకంగా ‘ఆసరా’ - Sakshi

మంత్రి మహేందర్‌రెడ్డి
ఆదిబట్ల : ఆసరా పథకాన్ని  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని , అర్హులందరకీ పింఛన్లు అందించటంమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటోందని రోడ్డు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని  ఎంపీ పటేల్‌గూడలో జిల్లా సంయుక్త పాలనాధికారి చంపాలాల్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి ఆసరా పథకాన్ని  లాంఛనంగా ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ జిల్లాలో గతంలో రూ.7 కోట్ల రూపాయలు మేరకు పింఛన్‌లు అందించేవారని, ఇప్పుడు ఆసరా పథకంలో భాగంగా  రూ.27 కోట్ల  పింఛన్లు ఇవ్వడం జరుగుతోందని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం  రైతుల రుణమాఫీలో భాగంగా మొదటి విడతగా ఐదు వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసిందని  తెలిపారు.  

బడ్జెట్‌లో ఆర్‌అండ్‌బీకి రూ.10 వేల కోట్లు, పంచాయతీ రాజ్ రోడ్లకు రూ. 5 వేల కోట్లను కేటాయించామని తెలిపారు. మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పునరుద్ధరణకు బడ్జెట్‌ను కేటాయించటం జరిగిందన్నారు. ఇళ్లు లేని నిరుపేదలకు మూడు ల క్షల మూపై వేల రూపాయలతో ఇళ్లు నిర్మించి ఇస్తామని, దళిత ఎస్‌సీ, ఎస్‌టీ, మైనార్టీ అమ్మాయిలకు 51 వేల రూపాయలు ఇచ్చి వివాహలు జరిపిస్తామని తెలిపారు. జంట నగరాలలో కోటీ 20 ల క్షల జనాభాకు మంచి నీరుకు 4000 నుంచి 5000 కోట్ల రూపాయల ఖర్చు అవుతున్నాయన్నారు.

మల్కాజ్‌గిరిలో రూ,240 కోట్లతో మంచి నీటి కార్యక్రమం చేపట్టామని తెలిపారు.  రూ.150 కోట్లతో 540 కొత్త బస్సులు కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. అలాగే నిరుద్యోగ సమస్యపై మాట్లాడుతూ.. జిల్లాపై  అత్యధిక కంపెనీలు మొగ్గు చూపుతున్నాయని తెలిపారు. వాటితో చర్చలు జరిపి నిరుద్యోగులకు ఉపాధిని చూపిస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు ఐలయ్య, ఎంపీపీ, వైస్ ఎంపీపీ వెంకట్రారాంరెడ్డి, కొత్త అశోక్‌గౌడ్, సర్పంచ్ పొట్టి రాములు, ఎంపీటీ సీ సభ్యులు గౌని అండాలు బాలరాజ్‌గౌ డ్, ఆర్డీవో యాదగిరి రెడ్డి, తహసీల్దార్ ఉపేందర్‌రెడ్డి, ఎంపీడీవో అనిల్‌కుమార్, నాయకులు కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, ఈసీ శేఖర్‌గౌడ్, లచ్చిరెడ్డి  పాల్గొన్నారు.

Advertisement
Advertisement