అట్టహాసంగా తొలి అవతరణ వేడుకలు | Sakshi
Sakshi News home page

అట్టహాసంగా తొలి అవతరణ వేడుకలు

Published Tue, Jun 2 2015 10:24 AM

అట్టహాసంగా తొలి అవతరణ వేడుకలు

ఆరవై ఏళ్ల తండ్లాటను తెరదించుతూ.. గత సంవత్సరం ఇదే రోజు భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ రాష్ట్రం మొదటి అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటోంది. డప్పుల చప్పుళ్లతో.. ధూంధాం ఆట పాటలతో.. రాష్ట్రం మొత్తం పండగ వాతావరణం నెలకొంది.

  • ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఉదయం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా జాతీయ జెండా ఎగురవేసి, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు.
  • హైదరాబాద్: కేంద్రమంత్రి దత్తాత్రేయతోపాటు డీజీపీ అనురాగ్ శర్మ , పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు.
  •  రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా తెలంగాణ భవన్లో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు.
  • రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా స్పీకర్ మధుసూదనాచారి అసెంబ్లీలో జాతీయ జెండాను ఎగుర వేశారు.
  • మెదక్: మంత్రి హరీశ్ రావు సంగారెడ్డిలో అమరవీరుల స్థూపాన్ని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
  • నిజామాబాద్: అమరవీరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం, అమరవీరులను స్మరించుకుంటూ వారి ఆశయసాధనకు కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న మంత్రి పోచారం శ్రీనివాస్ తెలిపారు.
  • ఆదిలాబాద్: తెలంగాణ చౌక్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలవేసిన మంత్రి జోగురామన్న అనంతరం అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి, పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఎగురవేశారు.
  • మహబూబ్ నగర్: అమరవీరుల స్తూపానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, పార్లమెంటరీ సెక్రటరీ శ్రీనివాసగౌడ్, కలెక్టర్ శ్రీదేవి నివాళులు అర్పించారు.
  • కరీంనగర్: జిల్లాలో అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు.
  • ఖమ్మం: అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
     

Advertisement
Advertisement