పీజీ మెడికల్‌ సీట్ల ఫీజుల పెంపు | Sakshi
Sakshi News home page

పీజీ మెడికల్‌ సీట్ల ఫీజుల పెంపు

Published Tue, May 5 2020 2:01 PM

Telangana Hikes PG Medical Fees in Private Colleges - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పీజీ మెడికల్‌ సీట్ల ఫీజును తెలంగాణ సర్కారు పెంచింది. కన్వీనర్‌ కోటా సీటు ఫీజును ఆయా కాలేజీల ప్రకారం రూ.7 లక్షల నుంచి రూ.7.75 లక్షలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బీ కేటగిరీ సీటు ఫీజు గతంలో రూ. 24.20 లక్షలు ఉండగా, కొన్నిచోట్ల అదే ఫీజు ఖరారు చేసింది. కొన్ని కాలేజీల్లో రూ.23 లక్షలకు తగ్గించింది. సీ కేటగిరీ సీటుకు గరిష్టంగా రూ.72 లక్షల వరకూ వసూలు చేసుకోవడానికి ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు అనుమతినిచ్చింది. (వైరస్‌ను అంతం చేసే యూవీ బ్లాస్టర్‌...)

ఇక డెంటల్‌ పీజీ ఏ కేటగిరీ ఫీజును రూ.5.15 లక్షలుగా, బీ కేటగిరీ సీటు ఫీజును రూ.8 లక్షలుగా నిర్ణయించారు. సీ కేటగిరీ సీటుకు రూ.12 లక్షల వరకూ వసూలు చేసుకోవచ్చు. వాస్తవానికి 2017లోనే మెడికల్‌ పీజీ సీటు ఫీజును రూ.6.90 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ పెంపుపై జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్, హెల్త్‌ రిఫార్మర్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌లు కోర్టుకు వెళ్లాయి. దీంతో ఫీజుల పెంపును తాత్కాలికంగా నిలిపివేస్తూ, తుది తీర్పు వచ్చే వరకు సగం ఫీజును వసూలు చేయాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. (తెలంగాణ నుంచి బయలుదేరిన రెండో రైలు)

Advertisement
Advertisement