ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల | Sakshi
Sakshi News home page

Published Fri, Jun 8 2018 10:46 AM

Telangana Intermediate Advanced Supplementary Results Released - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్మీడియెట్‌ మొదటి, రెండవ సంవత్సర అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య ఈ ఫలితాలను విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన ఫలితాలతో ఫస్టియర్‌ ఉత్తీర్ణత శాతం 72.2 శాతం, సెకండియర్‌ ఉత్తీర్ణత శాతం 78.7 శాతానికి చేరింది. ఈ నెల 18 వరకు రీవాల్యుయేషన్‌, కౌంటింగ్‌కు అవకాశముంది. www.sakshieducation.com వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు.

Advertisement
 
Advertisement
 
Advertisement