మండల కోటా ఖరారు | Sakshi
Sakshi News home page

మండల కోటా ఖరారు

Published Wed, Dec 26 2018 11:11 AM

Telangana Panchayat Elections BC Reservations Nalgonda - Sakshi

నల్లగొండ : పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మండల రిజరేషన్లను మంగళవారం రాత్రి ప్రకటించారు.  ఇప్పటికే పంచాయతీరాజ్‌ రాష్ట్ర శాఖ జిల్లాల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేసిన విషయం తెలిసిందే.జిల్లాకు కేటాయించిన రిజర్వేషన్ల ఆధారంగా కలెక్టర్‌ డాక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్, జాయింట్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి, డీపీఓ శ్రీకాంత్‌లు మంగళవారం రాత్రి జిల్లాలోని 31 మండలాలకు గ్రామ పంచాయతీ రిజర్వేషన్లు కేటాయించారు.

మండలానికి ఎంతమంది ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, జనరల్‌ కేటగిరీకి సంబంధించిన వారు ఉన్నారనేది తేల్చారు. బుధవారం నుంచి గ్రామాల వారీగా ఆయా పంచాయతీల రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. రెండు మూ డు రోజుల్లో గ్రామాల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.జిల్లాలో మొత్తం 844 పంచాయతీలకు 100 శాతం ఎస్టీలు ఉన్న 104 గ్రామాలను వారికే రిజర్వ్‌ చేయగా మరో 69 పంచాయతీలు ఎస్టీ కోటాకింద కేటాయించారు. ఎస్సీలకు 136, బీసీలకు 165, జనరల్‌ కేటగిరీలో 370 స్థానాలను కేటాయించారు.

మండలాలకు కేటాయించిన రిజర్వేషన్లు ఇలా..

అడవిదేవులపల్లి మండలంలో మొత్తం 13 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో ఎస్టీ కేటగిరీలో 5 కేటాయించగా అందులో మహిళలకు 2, జనరల్‌ కేటగిరీలో 3 కేటాయించారు. ఎస్సీలకు ఒకటి రిజర్వ్‌ కాగా అది జనరల్‌ కేటగిరీకి రిజర్వ్‌ చేశారు. బీసీలో కేటగిరీలో ఒక్కటి కూడా కేటాయించలేదు. అన్‌ రిజర్వ్‌డ్‌ కేటగిరీలో 7 స్థానాలు కేటాయించగా మహిళలకు 3, జనరల్‌లో 4 స్థానాలు కేటాయించారు.

అనుముల(హాలియా) మండలంలో పంచాయతీలు 21, ఎస్టీ 2, ఎస్సీ 4, అందులో మహిళలు 2, జనరల్‌ 2 రిజర్వ్‌చేశారు. బీసీ 5 స్థానాలకు గాను మహిళలు 3, జనరల్‌ 2, అన్‌ రిజర్వ్‌డ్‌లో మొత్తం 10 స్థానాలకు మహిళలు 5, జనరల్‌కు 5 కేటాయించారు.

చందంపేటలో 28 పంచాయతీలలో 100 శాతం ఎస్టీ పంచాయతీల్లో 9కి 4 మహిళలు, 5 జనరల్, ఎస్టీ కోటా కింద నాలుగు సీట్లు కేటాయించారు. అందులో 2మహిళ, 2 జనరల్‌ రిజర్వ్‌చేశారు. ఎస్సీ కోటాలో మూడు స్థానాలు కేటాయించగా 1 మహిళ, 2 జనరల్, బీసీలో 2 స్థానాలకు ఒకటి మహిళ, ఒకటి జనరల్, అన్‌ రిజర్వ్‌డ్‌లో 10 స్థానాలకు 5 మహిళ, 5 జనరల్‌ కేటాయించారు.

చండూరులో 23 పంచాయతీలు ఉన్నాయి. అందులో ఎస్సీలకు నాలుగు కేటాయించగా 2 మహిళ, 2 జనరల్, బీసీలో 8 కేటాయించగా 4 మహిళ, 4 జనరల్, అన్‌ రిజర్వ్‌డ్‌లో 11 స్థానాలకు 5 మహిళ, 6 జనరల్‌కు కేటాయించారు.

చింతపల్లిలో 34 పంచాయతీలకు 100 శాతం ఎస్టీ పంచాయతీలు 7 ఉన్నాయి. అందులో  4 మహిళ, 3 జనరల్, ఎస్టీ రిజర్వేషన్‌లో 1 స్థానం జనరల్‌కు కేటాయించారు. ఎస్సీ కోటాలో 5 పంచాయతీలు రిజర్వ్‌ కాగా 3 మహిళలు, 2 జనరల్, బీసీలో 7 కేటాయించగా, 3 మహిళ, 4 జనరల్, అన్‌ రిజర్వ్‌డ్‌లో 14 స్థానాలకు 7 మహిళ, 7 జనరల్‌కు కేటాయించారు.

చిట్యాలలో 18 పంచాయతీలు ఉండగా ఎస్సీ కోటాలో 4 పంచాయతీలు రిజర్వ్‌ అయ్యాయ. వీటిలో 2 మహిళలు, 2 జనరల్, బీసీలో 5 కేటాయించగా 2 మహిళ, 3 జనరల్, అన్‌ రిజర్వ్‌డ్‌లో 9 స్థానాలకు 4 మహిళ, 5 జనరల్‌కు కేటాయించారు.

దామరచర్లలో 35 పంచాయతీలున్నాయి. వాటిలో 100 శాతం ఎస్టీ పంచాయతీలు 4 ఉన్నాయి. అందులో  2మహిళ, 2 జనరల్‌ కేటాయించారు. ఎస్టీ రిజర్వేషన్‌లో 10 స్థానాలు కేటాయించగా మహిళలు 5, జనరల్‌కు 5 రిజర్వ్‌ చేశారు. ఎస్సీ కోటాలో 3 పంచాయతీలు రిజర్వ్‌ కాగా 2 మహిళలు, 1 జనరల్, బీసీలో 2 కేటాయించగా 1 మహిళ, 1 జనరల్, అన్‌ రిజర్వ్‌డ్‌లో 16 స్థానాలకు 8 మహిళ, 8 జనరల్‌కు కేటాయించారు.

దేవరకొండలో 39 పంచాయతీలకు 100 శాతం ఎస్టీ పంచాయతీలు 15 ఉన్నాయి. అందులో  7మహిళ, 8 జనరల్, ఎస్టీ రిజర్వేషన్‌లో 4 స్థానాలు కేటాయించగా మహిళలు 2, జనరల్‌కు 2 రిజర్వ్‌ చేశారు. ఎస్సీ కోటాలో 3 పంచాయతీలు రిజర్వ్‌ కాగా 1 మహిళ, 2 జనరల్, బీసీలో 5 కేటాయించగా 2 మహిళ, 3 జనరల్, అన్‌ రిజర్వ్‌డ్‌లో 12 స్థానాలకు 6 మహిళ, 6 జనరల్‌కు కేటాయించారు.

గుండ్రపల్లిలో 38 పంచాయతీలున్నాయి. 100 శాతం ఎస్టీ పంచాయతీలు 11 ఉండగా అందులో  6 మహిళ, 5 జనరల్, ఎస్టీ రిజర్వేషన్‌లో 3 స్థానాలు కేటాయించగా మహిళలు 2, జనరల్‌కు 1 రిజర్వ్‌ చేశారు. ఎస్సీ కోటాలో 5 పంచాయతీలు రిజర్వ్‌ కాగా 3 మహిళ, 2 జనరల్, బీసీలో 5 కేటాయించగా 3 మహిళ, 2 జనరల్, అన్‌ రిజర్వ్‌డ్‌లో 14 స్థానాలకు 7 మహిళ, 7 జనరల్‌కు కేటాయించారు.

గుర్రంపోడు మండలంలో 37 పంచాయతీలకు 100 శాతం ఎస్టీ పంచాయతీలు 2 ఉన్నాయి. అందులో  1మహిళ, 1 జనరల్‌ రిజర్వ్‌ చేశారు. ఎస్సీ కోటాలో 5 పంచాయతీలు రిజర్వ్‌ కాగా 3 మహిళ, 2 జనరల్, బీసీలో 13 కేటాయించగా 7 మహిళ, 6 జనరల్, అన్‌ రిజర్వ్‌డ్‌లో 17 స్థానాలకు 9 మహిళ, 8 జనరల్‌కు కేటాయింయించారు.

కనగల్‌లో 31 పంచాయతీలు ఉన్నాయి. ఎస్సీ కోటాలో 5 పంచాయతీలు రిజర్వ్‌ కాగా 2 మహిళ, 3 జనరల్, బీసీలో 10 కేటాయించగా 5 మహిళ, 5 జనరల్, అన్‌ రిజర్వ్‌డ్‌లో 15 స్థానాలకు 7 మహిళ, 8 జనరల్‌కు కేటాయించారు.

కట్టంగూర్‌ మండలంలో 22 పంచాయతీలకు ఎస్టీ రిజర్వేషన్‌లో 1 స్థానం మహిళలకు కేటాయించారు. ఎస్సీ కోటాలో 6 పంచాయతీలు రిజర్వ్‌ కాగా 3 మహిళ, 3 జనరల్, బీసీలో 4 కేటాయించగా 2 మహిళ, 2 జనరల్, అన్‌ రిజర్వ్‌డ్‌లో 11 స్థానాలకు 6 మహిళ, 5 జనరల్‌ రిజర్వ్‌ చేశారు.

కేతేపల్లిలో 16 పంచాయతీలున్నాయి. ఎస్సీ కోటాలో 6 పంచాయతీలు రిజర్వ్‌ కాగా 3 మహిళ, 3 జనరల్, బీసీలో 2 కేటాయించగా 1 మహిళ, 1 జనరల్, అన్‌ రిజర్వ్‌డ్‌లో 8 స్థానాలకు 4మహిళ, 4 జనరల్‌ కేటాయించారు.

కొండమల్లేపల్లిలో 26 పంచాయతీలు ఉండగా 100 శాతం ఎస్టీలు 13 స్థానాలున్నాయి. వీటిలో 6 మహిళ, 7 జనరల్‌ రిజర్వ్‌ చేశారు. ఎస్టీ రిజర్వేషన్‌లో 2 స్థానాలు, 1 మహిళలకు, 1 జనరల్‌ కేటాయించారు, ఎస్సీ కోటాలో 3 పంచాయతీలు రిజర్వ్‌ కాగా 2 మహిళ, 1 జనరల్, బీసీలో 1 జనరల్‌కు కేటాయించారు. అన్‌ రిజర్వ్‌డ్‌లో 7 స్థానాలకు 3 మహిళ, 4 జనరల్‌ కేటాయించారు.

మాడుగులపల్లిలో 28 పంచాయతీలకు ఎస్టీకి 2 స్థానాలు రిజర్వ్‌ చేశారు. 1 మహిళ, 1జనరల్‌ కేటాయించారు, ఎస్సీ కోటాలో 3 పంచాయతీలు రిజర్వ్‌ కాగా 2 మహిళ, 1 జనరల్, బీసీలో 9 స్థానాలు, 5 మహిళ, 4 జనరల్‌కు కేటాయించారు. అన్‌ రిజర్వ్‌డ్‌లో 14 స్థానాలకు 7 మహిళ, 7 జనరల్‌ రిజర్వ్‌ చేశారు.

మర్రిగూడలోని 20 పంచాయతీల్లో ఎస్టీ రిజర్వేషన్‌లో 2 స్థానాలకు 1 మహిళలకు, 1జనరల్‌ కేటాయించారు, ఎస్సీ కోటాలో 4 పంచాయతీలు రిజర్వ్‌ కాగా  2 మహిళ, 2 జనరల్, బీసీలో 4 స్థానాలు, 2 మహిళ, 2 జనరల్‌కు కేటాయించారు. అన్‌ రిజర్వ్‌డ్‌లో 10 స్థానాలకు 5 మహిళ, 5 జనరల్‌ రిజర్వ్‌ చేశారు.

మిర్యాలగూడ మండలంలో  64 పంచాయతీలు ఉన్నాయి. 100శాతం ఎస్టీ రిజర్వేషన్‌ 7 కాగా 3 మహిళ, 4 జనరల్,  ఎస్టీ రిజర్వేషన్‌లో 8 స్థానాలు, 4 మహిళలకు, 4జనరల్‌ కేటాయించారు, ఎస్సీ కోటాలో 8 పంచాయతీలు రిజర్వ్‌ కాగా  4మహిళ, 4 జనరల్, బీసీలో 3 స్థానాలకు 1 మహిళ, 2 జనరల్‌కు కేటాయించారు. అన్‌ రిజర్వ్‌డ్‌లో 20 స్థానాలకు 10 మహిళ, 10 జనరల్‌ రిజర్వ్‌ చేశారు.

మునుగోడులో 27 పంచాయతీలకు ఎస్సీ కోటాలో 6 పంచాయతీలు రిజర్వ్‌ కాగా  3 మహిళ, 3 జనరల్, బీసీలో 8 స్థానాలకు 4 మహిళ, 4 జనరల్‌కు కేటాయించారు. అన్‌ రిజర్వ్‌డ్‌లో 13 స్థానాలకు 6 మహిళ, 7 జనరల్‌ రిజర్వ్‌ చేశారు.

నకిరేకల్‌లో 17 పంచాయతీలకు ఎస్సీ కోటాలో 4 పంచాయతీలు రిజర్వ్‌ అయ్యాయి. 2 మహిళ, 2 జనరల్, బీసీలో 5 స్థానాలు, 2 మహిళ, 3 జనరల్‌కు కేటాయించారు. అన్‌ రిజర్వ్‌డ్‌లో 8 స్థానాలకు 4 మహిళ, 4 జనరల్‌.

నల్లగొండలో 31 పంచాయతీలు ఉండగా ఎస్సీ కోటాలో 6 పంచాయతీలు రిజర్వ్‌ కాగా 3 మహిళ, 3 జనరల్, బీసీలో 10 స్థానాలు, 5 మహిళ, 5 జనరల్‌కు కేటాయించారు. అన్‌ రిజర్వ్‌డ్‌లో 15 స్థానాలకు 8 మహిళ, 7 జనరల్‌.

నాంపల్లిలో 32 పంచాయతీలు, 100 శాతం ఎస్టీలున్నవి 4 కాగా 2 మహిళ, 2 జనరల్, ఎస్టీ కేటగిరీలో 1 జనరల్, ఎస్సీ కోటాలో 5 పంచాయతీలు రిజర్వ్‌ కాగా 2మహిళ, 3 జనరల్, బీసీలో 8 స్థానాలు, 4 మహిళ, 4 జనరల్‌కు కేటాయించారు. అన్‌ రిజర్వ్‌డ్‌లో 14 స్థానాలకు 7 మహిళ, 7 జనరల్‌ రిజర్వ్‌ చేశారు.

నార్కట్‌పల్లి 29 పంచాయతీలు, ఎస్సీ కోటాలో 7 పంచాయతీలు రిజర్వ్‌ కాగా  3మహిళ, 4 జనరల్, బీసీలో 7 స్థానాలు, 3 మహిళ, 4 జనరల్‌కు కేటాయించారు. అన్‌ రిజర్వ్‌డ్‌లో 15 స్థానాలకు 7 మహిళ, 8 జనరల్‌ రిజర్వ్‌ చేశారు.

నేరేడుగొమ్ములో 19 పంచాయతీలకు, 100 శాతం ఎస్టీలు 9 కాగా, 4 మహిళ, 5 జనరల్‌ కేటాయించాఉఉ. ఎస్టీ కేటగిరీలో 3 స్థానాలకు గాను 1 మహిళ, 2 జనరల్, ఎస్సీ కోటాలో జనరల్‌ 1, బీసీలో 1 స్థానాన్ని జనరల్‌కు కేటాయించారు. అన్‌ రిజర్వ్‌డ్‌లో 5 స్థానాలకు 2 మహిళ, 3 జనరల్‌కు కేటాయించారు.

తిప్పర్తిలో 26 పంచాయతీలు,  ఎస్సీ కోటాలో 4 పంచాయతీలు రిజర్వ్‌ కాగా  2మహిళ, 2 జనరల్, బీసీలో 9 స్థానాలు, 5 మహిళ, 4 జనరల్‌కు కేటాయించారు. అన్‌ రిజర్వ్‌డ్‌లో 13 స్థానాలకు 7 మహిళ, 6 జనరల్‌కు కేటాయించారు.

నిడమనూర్‌లో 29 పంచాయతీలకు ఎస్టీ కేటగిరీలో 1 మహిళకు, ఎస్సీ కోటాలో 6 పంచాయతీలు రిజర్వ్‌ కాగా  3మహిళ, 3 జనరల్, బీసీలో 8 స్థానాలకు 4 మహిళ, 4 జనరల్‌కు కేటాయించారు. అన్‌ రిజర్వ్‌డ్‌లో 14 స్థానాలకు 7 మహిళ, 7 జనరల్‌ రిజర్వ్‌ చేశారు.

పెద్దఅడిశర్లపల్లిలో 31 పంచాయతీలకు 100 శాతం ఎస్టీలున్నవి 5 కాగా 3 మహిళ, 2 జనరల్‌ కేటాయించారు. ఎస్టీ కేటగిరీలో 5 స్థానాలు కేటాయించగా 2మహిళ, 3 జనరల్, ఎస్సీ కోటాలో 4 పంచాయతీలు రిజర్వ్‌ కాగా  2మహిళ, 2 జనరల్, బీసీలో 5 స్థానాలు, 3 మహిళ, 2 జనరల్‌కు కేటాయించారు. అన్‌ రిజర్వ్‌డ్‌లో 13 స్థానాలకు 7 మహిళ, 6 జనరల్‌ కేటాయించారు.

పెద్దవూరలో 26పంచాయతీలున్నాయి. 100 శాతం ఎస్టీలున్నవి 3 కాగా, 2 మహిళ, 1 జనరల్, ఎస్టీ కేటగిరీలో 5 స్థానాలు కేటాయించగా 3 మహిళ, 2 జనరల్, ఎస్సీ కోటాలో 3 పంచాయతీలు రిజర్వ్‌ కాగా 2మహిళ, 1 జనరల్, బీసీలో 4 స్థానాలు, 2 మహిళ, 2 జనరల్‌కు కేటాయించారు. అన్‌ రిజర్వ్‌డ్‌లో 11 స్థానాలకు 6 మహిళ, 5 జనరల్‌.

శాలిగౌరారంలో 24 పంచాయతీలకు ఎస్సీ కోటాలో 7 పంచాయతీలు రిజర్వ్‌ కాగా 4మహిళ, 3 జనరల్, బీసీలో 5 స్థానాలు, 3 మహిళ, 2 జనరల్‌కు కేటాయించారు. అన్‌ రిజర్వ్‌డ్‌లో 12 స్థానాలకు 6 మహిళ, 5 జనరల్‌.
తిరుమలగిరి (సాగర్‌)లో  34 పంచాయతీలకు 100 శాతం ఎస్టీలు 12 కాగా 6 మహిళ, 6 జనరల్, ఎస్టీ కేటగిరీలో 5 స్థానాలు కేటాయించగా 2మహిళ, 3 జనరల్, ఎస్సీ కోటాలో 3 పంచాయతీలు రిజర్వ్‌ కాగా  2మహిళ, 1 జనరల్, బీసీలో 3 స్థానాలు, 1 మహిళ, 2 జనరల్‌కు కేటాయించారు. అన్‌ రిజర్వ్‌డ్‌లో 11 స్థానాలకు 6 మహిళ, 5 జనరల్‌ కేటాయించారు.

త్రిపురారంలో  32 పంచాయతీలుండగా 100 శాతం ఎస్టీలున్నవి 2. వాటిలో 1 మహిళ, 1 జనరల్, ఎస్టీ కేటగిరీలో 6 స్థానాలు కేటాయించగా 3మహిళ, 3 జనరల్, ఎస్సీ కోటాలో 4 పంచాయతీలు రిజర్వ్‌ కాగా  2మహిళ, 2 జనరల్, బీసీలో 5 స్థానాలు, 3 మహిళ, 2 జనరల్‌కు కేటాయిం చారు. అన్‌ రిజర్వ్‌డ్‌లో 15 స్థానాలకు 8 మహిళ, 7 జనరల్‌.

వేములపల్లిలో 12 పంచాయతీలు, ఎస్సీ కోటాలో 4 పంచాయతీలు రిజర్వ్‌ కాగా  2మహిళ, 2 జనరల్, బీసీలో 2 స్థానాలు, 1 మహిళ, 1 జనరల్‌కు కేటాయించారు. అన్‌ రిజర్వ్‌డ్‌లో 6 స్థానాలకు 3 మహిళ, 3 జనరల్‌కు కేటాయించారు.

Advertisement
Advertisement