టెక్స్‌టైల్స్ పార్కును ఏర్పాటుచేయాలి | Sakshi
Sakshi News home page

టెక్స్‌టైల్స్ పార్కును ఏర్పాటుచేయాలి

Published Mon, Jun 23 2014 11:51 PM

టెక్స్‌టైల్స్ పార్కును ఏర్పాటుచేయాలి - Sakshi

దుబ్బాక రూరల్: దుబ్బాక ప్రాంతంలో చేనేత కార్మికుల ఉపాధి కోసం టెక్స్‌టైల్స్ పార్కు ఏర్పాటుచేయాలని ఆల్‌ఇండియా హ్యాండ్లూమ్ బోర్డ్ సభ్యు లు, చేనేత కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కె.ఎన్.ఎన్ మూర్తి కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం దుబ్బాక చేనేత కార్మికుల స్థితిగతులను తెలుసుకోవడానికి ఆల్ ఇండియా హ్యాం డ్లూమ్ బోర్డు సభ్యులు పర్యటించారు. కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులకు పొద్దంత పని చేసిన 100 రూపాయలు కూడా రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 45లక్షల మంది చేనేత కార్మికులు ఉన్నారన్నారు. ప్రభుత్వాలు మారినా చేనేత కార్మికుల రాత మారడం లేదన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. దుబ్బాక చేనేత కార్మికుల కోసం పవర్ లూం మగ్గాలను ఏర్పాటు చేయాలన్నారు. అంతే కాకుండా ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల సమస్యలపై దేశ ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌లకు నివేదికను అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డ్ సభ్యులు  ఎడ్ల గీత, పాము యాదగిరి, వేంకటేశ్వర్లు, శ్రీనివాస్‌మూర్తి, చేనేత హక్కుల పోరాట సమితి అధ్యక్షులు శ్రీరాం రామకృష్ణప్రభు, గోనే మధు, రవికాంత్, గాజులభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement