మధురానగర్‌లో తరుణి మెట్రో స్టేషన్‌ | Sakshi
Sakshi News home page

మధురానగర్‌లో తరుణి మెట్రో స్టేషన్‌

Published Thu, Jan 3 2019 8:20 AM

Tharuni Ladies Special Metro Station in Madhura Nagar - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: మధురానగర్‌ మెట్రో స్టేషన్‌లో మహిళలు, చిన్నారులకు అవసరమైన అన్ని రకాల దుస్తులు, వస్తువులు, సౌకర్యాలను  కల్పించడంతోపాటు ఈ స్టేషన్‌ పేరును మహిళల కోసమే ప్రత్యేకంగా ‘తరుణి మెట్రో స్టేషన్‌’గా నిర్ణయించినట్లు హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ఈ స్టేషన్‌లోని దుకాణాలను సైతం మహిళలే నిర్వహిస్తారన్నారు. నగర మెట్రో ప్రాజెక్టులో భాగంగా స్మార్ట్‌ పార్కింగ్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం, కాలుష్య రహిత ఈ–బైక్స్‌ను వినియోగంలోకి తీసుకురావడం, ముఖ్యమెట్రో స్టేషన్లలో ఎలక్ట్రికల్‌ వాహనాలకు ఛార్జింగ్‌ చేసే సదుపాయం కల్పించడం, మల్టీ లెవల్‌ పార్కింగ్‌ కాంప్లెక్సుల నిర్మాణం వంటి అంశాలకు నూతన సంవత్సరంలో పెద్దపీఠ వేస్తామన్నారు. బుధవారం హెచ్‌ఎంఆర్‌ కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. మెట్రో సిబ్బంది కృషివల్లే ఇప్పటివరకు నగర మెట్రో ప్రాజెక్టు 72 జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులను సాధించిందన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంఆర్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement