పింఛన్ పంపిణీ అనుమానమే! | Sakshi
Sakshi News home page

పింఛన్ పంపిణీ అనుమానమే!

Published Wed, Oct 22 2014 1:27 AM

The alleged distribution of pension!

హైదరాబాద్: ప్రతినెలా ఫస్ట్ తారీఖున పింఛన్లు అందుకునే పెన్షనర్లకు, అక్టోబర్ నెల పింఛన్ నవంబర్ 1న అందే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కనిపించడం లేదు. ఒకటో తారీఖున పింఛన్ ఇచ్చే మాట అటుంచితే.. అసలు నవంబర్ నెలఖారులోగానైనా ఇస్తారో, లేదో చెప్పలేని పరిస్థితి అధికారులది. ఆహారభద్రత కార్డులు, పింఛన్ల కోసం ప్రభుత్వం చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ సోమవారంతో ముగిసింది.

వాటి పరిశీలన  నిజామాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో మందకొడిగా సాగుతుండగా, మంగళవారం నుంచి ప్రారంభం కావాల్సిన హైదరాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, అదిలాబాద్, వరంగల్, నల్లగొండల్లో మొదలు కాలేదని అధికారులు పేర్కొన్నారు. నవంబర్ 8 నుంచి కొత్తగా పించన్లిచ్చే పరిస్థితి కన్పించడం లేదు.
 
 

Advertisement
Advertisement