గిట్టుబాటు ధర కోసం పత్తి రైతుల ఆందోళన | Sakshi
Sakshi News home page

గిట్టుబాటు ధర కోసం పత్తి రైతుల ఆందోళన

Published Mon, Nov 30 2015 12:18 PM

the cotton farmers' protest for Cost price

పత్తికి గిట్టుబాటు ధర లభించటం లేదని రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా సూర్యాపేట మండలం బాలెంలో చోటుచేసుకుంది. గ్రామంలో ఉన్న మంజీత్ కాటన్ కంపెనీ సీసీఐ అధికారులతో కుమ్మక్కై తక్కువ ధరకే పత్తి కొనుగోలు చేస్తోందని సోమవారం ఉదయం మిల్లు ఆవరణలోనే రైతులు ధర్నాకు దిగారు.

మిల్లులోని ఒక షెడ్డులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం అధికారులు ప్రకటించారు. అయితే, మిల్లు నిర్వాహకులు షెడ్డును ఇవ్వకపోవటంతో కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. పెపైచ్చు క్వింటాలుకు పత్తి రూ.4 వేలు పలుకుతుండగా రూ.3 వేలకే మిల్లు కొనుగోలు చేస్తోందని రైతులు ఆరోపించారు. దీనిపై రెండు వందల మంది రైతులు మిల్లు ఆవరణలో ఆందోళనకు దిగారు. అక్కడికి చేరుకున్న అధికారులతో వాగ్వాదానికి దిగారు.



 

Advertisement
Advertisement