Sakshi News home page

సిరుల మాగాణి..సింగరేణి

Published Tue, Dec 23 2014 2:29 AM

the goldeen singareni history

సింగరేణి.. నిలువెల్లా నల్లబంగారంతో తులతూగుతోంది. కార్మికులకు వరప్రదాయినిగా వర్ధిల్లుతోంది. యావత్తు తెలంగాణకు కల్పవల్లిగా భాసిల్లుతోంది.  నాలుగు జిల్లాల్లో విస్తరించిన బొగ్గు గనులతో సిరుల పంట పండిస్తోంది. తట్టాచెమ్మస్ వాడక ం నుంచి.. అధునాతన అడ్రియాల గని ప్రారంభించే దాక ఎదిగిందీ సంస్థ. బ్రిటిష్ కాలంలో పురుడుపోసుకున్న సింగరేణి.. నూటాపాతిక వసంతాల వేడుకలు జరుపుకుంటోంది. . తెలంగాణ రాష్ర్టంలో ఇవి తొలి వార్షికోత్సవాలు. ఈ  సందర్భంగా ప్రత్యేక కథనం..  
 
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల పరిధిలోని గోదావరినది లోయ పరీవాహక ప్రాంతంలో విస్తరించింది సింగరేణి. వేలాది మందికి ప్రత్యక్షంగా.. లక్షలాది మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధిలో భాగస్వామ్యమవుతోంది.
 
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి ఇలా..
అండర్‌గ్రౌండ్,ఓపెన్‌కాస్ట్‌విధానాల్లోఉత్పత్తి చేస్తారు.
లక్ష్యంలో 70 శాతం ఓపెన్‌కాస్ట్‌ల ద్వారా 30 శాతం భూగర్భ గనుల ద్వారా బొగ్గును వెలికితీస్తారు.
దేశంలో 9 శాతం బొగ్గును సింగరేణి అందిస్తోంది.
సింగరేణిలో 32 భూగర్భ గనులున్నాయి  
16 ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులున్నాయి.  
భూగర్భ గనుల్లో ప్రతీ టన్ను బొగ్గు వెలికితీతకు ఖర్చు 3,300. కానీ రూ. రూ 2,650 కే విక్రయిస్తున్నారు. ఇందులో రూ.2,450 వేతనాలకే పోతుంది.
ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులో ప్రతీ టన్ను బొగ్గు వెలికితీతకు రూ. 1110 ఖర్చవుతుంది. దీన్ని విక్రయిస్తే రూ. 2,700 వస్తుంది. ఇక్కడ ప్రతీ టన్నుకు కార్మికుడికి చెల్లించే మొత్తం రూ. 210 మాత్రమే. అందుకే యాజమాన్యం ఓసీపీలవైపే  మొగ్గు చూపుతోంది.
సింగరేణి నుంచి బొగ్గును విద్యుత్, సిమెంట్ పరిశ్రమలకు 70 శాతం పంపిస్తున్నారు.  
1991-92లో రికార్డుస్థాయిలో 475 సమ్మెలతో బొగ్గు ఉత్పత్తి చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.  
1997నాటికి కంపెనీఆర్థికస్థితి మరింత దిగజారింది.
1997-98 నుంచి రూ. 102 కోట్లతో నేటికి లాభాల బాటలో పయనిస్తోంది.
దేశంలో ఎక్కడా లేని విధంగా లాభాల్లో  10 శాతం వాటాను కార్మికులకు పంపిణీ చేస్తున్నారు.
61,778మందికార్మికులకు 49,800 క్వార్టర్లు న్నాయి.  
1998లో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించిం ది. అదే లాభాలకు నాంది అయింది.  
 
సంస్కరణలతో వచ్చిన మార్పులు...
1991లో వచ్చిన సంస్కరణలు సింగరేణిపై తీవ్ర ప్రభావం చూపాయి. కార్మికుడు రిటైర్డయితే ఆయన వారసుడికి ఉద్యోగం ఇవ్వాలనే నిబంధన తొలగించారు.
భూగర్భ గనుల్లో తట్టాచెమ్మస్ ద్వారా బొగ్గు ఉత్పత్తి నిలిపివేస్తూ యాంత్రీకరణను వేగవంతం చేశారు.
2000-01లో 32 వేల మంది కోల్‌ఫిల్లర్ కార్మికులండగా... నేడు వారి సంఖ్య 5 వేలకు పడిపోయింది.  
ఐఏఎస్ అధికారి ఏపీవీఎన్ శర్మ సింగరేణి సంస్థ సీఎండీగా ఉన్నప్పుడు సంస్థను పూర్తిగా ప్రక్షాళన చేశారు.
వాలంటరీ రిటైర్డ్‌మెంట్ స్కీమ్(వీఆర్‌ఎస్)ను తెచ్చి కొంత మొత్తాన్ని వారికి అందిస్తూ కార్మికుల సంఖ్య కుదించారు.
 
సింగరేణికి కలికితురాయి ‘అడ్రియాల’
సింగరేణి ప్రతిష్టాత్మకంగా రామగుండం ఏరియాలో అడ్రియాల వద్ద పంచ్‌ఎంట్రీ గనిని ప్రారంభించింది. సుమారు రూ. 1400 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టారు.
జర్మనీకి చెందిన క్యాటర్‌పిల్లర్ సంస్థ సాంకేతిక పరిజ్ఞానంతో భూగర్భంలో 400 మీటర్ల లోతులో బొగ్గును సర్ఫెర్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షిస్తూ వెలికితీస్తారు.
ఏటా 2 మిలియన్ టన్నుల బొగ్గు వెలికితీత ఈ గని లక్ష్యం.
 
కాకతీయ రాజుల ప్రతీకగా కేటీకే
అతివేగంగా పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న భూపాలపల్లి సింగరేణి గనులు జిల్లాకు తలమానికంగా నిలుస్తున్నాయి. కాకతీయ రాజుల వీరత్వానికి ప్రతీకగా భూపాలపల్లిలో కాకతీయ గనుల పేరుతో కేటీకే 1వ గనిని 1988 జూలై 15న అప్పటి సీఎం ఎన్టీ రామారావు ప్రారంబించారు.
1991-1992లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైంది. కేటీకే 2, 5, 6, లాంగ్‌వాల్ ప్రాజెక్ట్, ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్‌లు విస్తరింంచారు.
7008 మంది కార్మికులు పనిచేస్తూ రోజుకు 10వేల టన్నుల బొగ్గు వెలికి తీస్తున్నారు.
ఏరియాలోని కేటీకే 2వ గనిలో పూర్తి స్థాయిలో యాంత్రీకరణతో బొగ్గు వెలికి తీస్తుండగా కేటీకే 1, 5, 6 గనుల్లో కొన్ని ప్రదేశాల్లో నేటికి కోల్ ఫిల్లర్లతో బొగ్గు వెలికి తీస్తున్నారు.  
భూపాలపల్లి పక్కనే ఉన్న తాడిచర్లలో రెండు ఉపరితల గనులు రానున్న రోజుల్లో బొగ్గు ఉత్పత్తి చేయనుంది.

Advertisement
Advertisement