ఆకలి రాజ్యం | Sakshi
Sakshi News home page

ఆకలి రాజ్యం

Published Mon, Jun 19 2017 3:13 AM

6 నుంచి 23 నెలల చిన్నారుల్లో తగినంత ఆహారం అందుతున్న వారి శాతం

మనదేశంలో చిట్టి బొజ్జలకు తగినంత తిండి దొరకడం లేదు! 6 నుంచి 23 నెలల మధ్య ఉన్న పిల్లల్లో.. ప్రతి 10 మందిలో ఒకరికే కడుపు నిండా తిండి దొరుకుతోంది. మిగతా తొమ్మిది మంది అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఫలితంగా ఐదేళ్లలోపు చిన్నారుల్లో 35.7 శాతం మంది తక్కువ బరువుతో ఉన్నారు. అంతేకాదు.. పౌష్టికాహార లేమితో బాధపడుతున్న పిల్లలు ఆఫ్రికాలో కంటే భారత్‌లోనే ఎక్కువగా ఉన్నారట! ప్రపంచంలో పౌష్టికాహార లేమితో ఉన్న ప్రతి ఐదుగురు చిన్నారుల్లో ఒకరు భారత్‌లోనే ఉన్నారని ‘ఇండియాస్పెండ్‌’ అనే వెబ్‌సైట్‌ తెలిపింది. 2015–16 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివరాలను విశ్లేషించి ఈ వాస్తవాలను వెల్లడించింది.  
–సాక్షి, తెలంగాణ డెస్క్‌
 
సరైన బరువు లేక బాధపడుతున్న ఐదేళ్లలోపు చిన్నారులు 35.7% మంది 
ఆరు నెలలలోపు చిన్నారులకు తల్లిపాలతోనే ఆహారం అందుతుంది. అయితే 55 శాతం మంది చిన్నారులకు మాత్రమే తల్లిపాలు అందుతున్నాయి. 2005–06 నుంచి పోలిస్తే తల్లిపాలు అందుతున్న చిన్నారుల సంఖ్య 9 శాతం పెరగడం ఆశించదగ్గ పరిణామం. రెండేళ్లలోపు చిన్నారులంతా పోషకాహారలేమితో బాధపడుతున్నారు.
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు..
అవసరమైన చిన్నారులకు రెండేళ్ల వరకూ తల్లిపాలు అందించాలి.
చిన్నారికి ఆరు నెలలు వచ్చినప్పుటి నుంచి బయటి ఆహారం అందించడం ప్రారంభించాలి. 
6 నుంచి 8 నెలల చిన్నారికి రోజుకు 2 నుంచి 3 సార్లు ఆహారం అందించాలి.
9 నుంచి 23 నెలల చిన్నారికి రోజుకు 3 నుంచి 4 సార్లు ఆహారం అందించాలి. రోజుకు 2 సార్లు స్నాక్స్‌ ఇవ్వాలి.
విటమిన్లు, ఖనిజాలు ఉన్న ఆహారం తప్పనిసరి.

Advertisement
Advertisement