ఆత్మహత్యకు దారితీసిన ప్రేమ వ్యవహారం | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యకు దారితీసిన ప్రేమ వ్యవహారం

Published Mon, Mar 24 2014 3:35 AM

ఆత్మహత్యకు దారితీసిన ప్రేమ వ్యవహారం - Sakshi

హసన్‌పర్తి, న్యూస్‌లైన్ : మూడు రోజుల క్రితం కా ల్వలో శవమై తేలిన కిట్స్ విద్యార్థి శ్రీవిద్య మృతి మి స్టరీ వీడింది. అదే కాల్వలో ఆమె ఇష్టపడిన తోటివి ద్యార్థి మృతదేహం ఆదివా రం లభ్యమైంది. ప్రేమ వ్యవహారమే ఇద్దరి ఆత్మహత్యకు కారణమై ఉంటుందని పోలీసు లు వెల్లడించారు. ప్రియుడితో ఏర్పడిన తగాదాల కారణంగా ఎస్సారెస్పీలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు డీఎస్పీ దక్షిణామూర్తి వెల్లడించారు.

ఆయన కథనం ప్రకారం.. హన్మకొండలోని సుబేదారి ప్రాంతానికి చెందిన గాదె శ్రీవి ద్య, మహ్మద్ అతిఖ్ అహ్మద్(20) ఎర్రగట్టు కిట్స్ కళాశాలలో బీటెక్(మెకానిక ల్) ఫస్టియర్ చదువుతున్నారు. ఇద్దరి సెక్షన్లు వేరయినప్పటికీ ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. తనను పెళ్లి చేసుకోవాలని శ్రీవిద్య వారం రోజులుగా మహ్మద్‌అతిఖ్ అడుగుతోంది. అయితే అందుకు అతడు నిరాకరించాడు. ఈ క్రమంలోనే శుక్రవారం కళాశాలకు వచ్చిన ఇద్దరు మధ్యా హ్నం నుంచి కనిపించలేదు.

అదేరోజు సాయంత్రం ఎస్పారెస్పీ కాల్వలో మృతదేహాన్ని చూసిన స్థానికులు 100కు ఫోన్ చేయగా పోలీసులు వెళ్లి శ్రీవిద్య మృతదేహాన్ని కనుగొన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తుండగానే పలివేల్పుల సమీపంలోని ఎస్సారెస్పీ కాల్వలో మహ్మద్ అతిఖ్‌అహ్మద్ మృతదేహం లభ్యమైందని డీఎస్పీ తెలిపారు. వీరిద్దరి విషయమై స్థానికంగా విచారణ చేపట్టగా వారు ప్రేమికులని తెలిసిందని ఆయన వెల్లడించారు.

ఎస్సారెస్పీ కాల్వ వద్ద ఇద్దరి మధ్య ఏమైనా ఘర్షణ జరిగిందా? ఇద్దరు ఒకేసారి చావాలని నిర్ణయించుకున్నారా? ముందు శ్రీవిద్య కాల్వలో దూకడంతో భయపడి అతిఖ్ అహ్మద్ కూడా దూకాడా? ఇద్దరు పురుగుల మందు తాగి కాల్వలో దూకారా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని డీఎస్పీ తెలిపారు. విలేకరుల సమావేశంలో సీఐ దేవేందర్‌రెడ్డి, ఎస్సై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
 
లిఫ్ట్ అడిగి వెళ్లి.. భీమారంలో దిగి..

శ్రీవిద్య ఆ రోజు మధ్యాహ్నం 2.15 గంటలకు కాలేజీ ప్రధాన ద్వారం వద్ద అదే కళాశాలకు చెందిన విద్యార్థిని లిఫ్ట్ అడిగినట్లు సీసీ కెమెరాలో రికార్డయ్యింది. తర్వాత ఆమె భీమారం పెట్రోల్‌పంప్ వద్ద దిగినట్లు లిఫ్ట్ ఇచ్చిన విద్యార్థిని వి చారణలో వెల్లడించినట్లు సమాచారం. భీమారం పెట్రోల్‌పంప్ వద్ద దిగిన శ్రీ విద్య తన ఫోన్ నుంచి అతిఖ్ అహ్మద్‌కు మిస్డ్‌కాల్ ఇచ్చింది. క్లాస్‌లో ఉన్న అతి ఖ్ తన ఫోన్‌లో బ్యాలెన్స్ లేకపోవడంతో స్నేహితుడైన భరత్ తేజానాయక్ మొబైల్‌తీసుకుని ఆమెకు ఫోన్ చేస్తూ అలాగే వెళ్లిపోయాడు.

అదేరోజు సా యంత్రం భరత్‌తేజా తండ్రి తన కుమారుడి ఫోన్‌ను అతిఖ్ తీసుకెళ్లినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో ప్రిన్సిపాల్ అతిఖ్ తండ్రి ర ఫీక్‌కు ఫోన్ చేసి అతడి గురించిన వివరాలు అడిగినట్లు సమాచారం. పోలీసులకు కూడా అతిఖ్ మీద అనుమానం రావడంతో అతడి తండ్రికి, ఇతర కుటుంబ సభ్యులకు ఫోన్‌లో సమాచారమిచ్చారు. తన కుమారుడు కనిపించ డం లేదని తండ్రి ఫోన్‌లో పోలీసులకు చెప్పాడు. ఫిర్యాదు ఇవ్వాలని సూచించినా వారు రాలేదు. దీంతో శనివారం రాత్రి పోలీసులు అతిఖ్‌ఇంటికి వెళ్లి.. వారి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించారు.
 
మూడేళ్ల క్రితమే పరిచయం..
 
శ్రీవిద్య, అతిఖ్ మధ్య మూడేళ్ల క్రితం నుంచి ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నట్లు తెలిసింది. పదో తరగతి చదువుతున్న సమయంలోనే వీరిద్దరికి నగరంలోని నిర్వహించిన సైన్స్‌ఫేర్‌లో పరిచయం ఏర్పడినట్లు సమాచారం. ఆ పరిచయమే ప్రేమగా మారింది. ఇంటర్‌లో కూడా ఇద్దరు ఒకే కళాశాలలో పూర్తి చేశారు. అనంతరం ఇంజనీరింగ్ విద్య కోసం ఇద్దరు కిట్స్‌లో చేరారు. చివరికి వారి ప్రేమ ఆత్మహత్యకు దారితీసింది.
 

Advertisement
Advertisement