ప్రతి పనికీ లంచమే | Sakshi
Sakshi News home page

ప్రతి పనికీ లంచమే

Published Sun, Apr 10 2016 3:22 AM

ప్రతి పనికీ లంచమే - Sakshi

విద్యుత్ శాఖలో అడ్డూ అదుపు లేని అవినీత
అధికారులు, సిబ్బంది తీరుపై పెల్లుబికిన ఆగ్రహం
సంస్థను కాపాడండి... మమ్ముల్ని బతికించండి...
ఈఆర్‌సీ బహిరంగ విచారణలో ఫిర్యాదుల వెల్లువ
పక్కదారి పట్టిన విచారణ.. అవినీతిపై అట్టుడికిన వైనం

 
 
విద్యుత్ అధికారులు లంచం లేనిదే  ఏ పనీ చేయడం లేదు. నెలకు రూ.50 వేలకు పైగా జీతాలు తీసుకుం టున్నా.. ప్రతిరోజు రెండు, మూడు వేలు లేనిదే ఇంటికి పోతలేరు. కరెంటు ఆఫీసులన్నీ అవినీతిమయంగా మారాయి. ఇది నిజం కాదని గుండెమీద చేయి వేసుకొని చెప్పమనండి సార్..’    -సుల్తానాబాద్‌కు చెందిన నల్ల సుధాకర్ అనే రైతు ఆవేదన...
 

డీడీలు కట్టి నాలుగు నెలలైంది. సీరియల్ నెంబర్ అంటూ కార్యాలయం చుట్టూ తిప్పికుంటుండ్రు. ఎస్‌ఈ ఆఫీసుకు వచ్చి బాధ చెప్పుకుంటే.. అక్కడే మాట్లాడుకోండని ఉచిత సలహాలు ఇస్తుండ్రు. కార్యాలయంలోని ఓ ఉద్యోగి చెప్పిన ప్రకారంగా రూ.25 వేలు ఇస్తే రెండు రోజుల్లోనే ట్రాన్స్‌పార్మర్, స్తంభాలు, వైర్లు వేసిండ్రు. ఇదెక్కడి న్యాయం... ఇంత అవినీతా..’
 
 
కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి ఆధ్వర్యంలో విద్యుత్ చార్జీల పెంపుపై శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన బహిరంగ విచారణ కార్యక్రమంలో విద్యుత్ శాఖలో అవి నీతిపై రైతులు, పలువురు ప్రతినిధులు ధ్వజమెత్తారు. 2016-17 సంవత్సరానికి విద్యుత్ బిల్లుల నిర్ధారణ, వార్షిక ఆదాయ అవసరాలపై నిర్వహించిన బహిరంగ విచారణ కార్యక్రమంలో విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్, సభ్యులు మనోహర్‌రెడ్డి, శ్రీనివాస్‌తోపాటు ఎన్పీడీసీఎల్ సీఎండీ వెంకటరమణ పాల్గొన్నారు.

ఉద యం 10 గంటలకు మొదలైన సమావేశం రా త్రి 9 గంటల వరకు ఏకధాటిగా కొనసాగిం ది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన రైతులు, రైతు సంఘాలు, వివిధ పార్టీల నాయకులు హాజరయ్యూరు. బహిరంగ విచారణ ఆసాంతం వి ద్యుత్ అధికారులు, సిబ్బంది అవినీతి చుట్టే తిరిగింది. మాట్లాడిన ప్రతి ఒక్కరూ విద్యుత్ శాఖలో ఉన్నంత అవినీతి మరెక్కడా లేదన్నా రు. అవినీతిని కట్టడి చేయకపోతే సంస్థపై ప్ర జలకు ఉన్న విశ్వాసం సన్నగిల్లడం ఖాయమన్నారు. తద్వారా సంస్థ ఉనికికే ప్రమాదమని హెచ్చరించారు. మొదటగా ఎన్పీడీసీఎల్ సీఎండీ వెంకటరమణ ఈఆర్‌సీ ఎదుట ప్రతిపాదనలు పెట్టారు. అనంతరం రైతులు, వివిధ పార్టీలు, సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయూలను వెల్లడించారు.


 భారీగా పోలీసు బందోబస్తు
బహిరంగ విచారణ సందర్భంగా పోలీసులు జెడ్పీ కార్యాలయం చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గేట్లను మూసివేసి ప్రధాన ద్వారం నుంచి ఒక్కొక్కరిని లోనికి అనుమతించారు. మహిళా పోలీసులు సైతం రెండు గేట్ల వద్ద మోహరించారు. ప్రజాభిప్రాయ సేకరణలో పాలుపంచుకోకుండా పోలీసులను మోహరించడం, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం ఏమిటని పలువురు మండిపడ్డారు. ఇది వరకు బహిరంగ విచారణ జరిపిన సందర్భాల్లో ఇంతటి పోలీసు బందోబస్తు చూడలేదని పలువురు నాయకులు పేర్కొన్నారు.

 కుర్చీలు కరువు..  బయటే ఎదురుచూపులు
 నాలుగు జిల్లాల పరిధిలోని రైతులు, రైతు సంఘాల నేతలు, పలు పార్టీల నాయకులు జెడ్పీ కార్యాలయానికి తరలివచ్చారు. సమావేశ మందిరం చిన్నదిగా ఉండడం, ప్రజలు పెద్ద సంఖ్యలో రావడంతో కూర్చునేందుకు చోటు దొరకలేదు. దీంతో హాల్ బయట జనం పెద్ద ఎత్తున వేచి ఉన్నారు. సమావేశ మందిరంలో పలువురు కుర్చీలు లేకపోవడంతో నిల్చొని ఉన్నారు.
 
ముందుగా వరంగల్ జిల్లాకు చెందిన కాటన్, జిన్నింగ్ పరిశ్రమ అసోసియేషన్ అధ్యక్షులు చింతలపల్లి వీరరావు మాట్లాడారు. కాటన్, జిన్నింగ్ పరిశ్రమ విషయంలో తెలంగాణ దేశంలోనే 3వ స్థానం ఉందన్నారు. ఇప్పటికే జిన్నింగ్ పరిశ్రమలు అచేతన స్థితికి చేరుకున్నాయని తెలిపారు. స్థిరచార్జీలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. 2012 నుంచి కాటన్ ఇండస్ట్రీ బకాయిలు రూ.25 కోట్లు పేరుకపోయాయని చెప్పారు. నాలుగు నెలల్లోగా చెల్లిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హమీ నాలుగేళ్లరుునా అమలు కావడం లేదని అన్నారు.
 
మెట్‌పల్లికి చెందిన రైతు సామ రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ... ట్రాన్స్‌ఫార్మర్లు కాలినా.. కొత్త కరెంటు పోళ్లు కావాలన్నా.. వైర్లుసహా ఏ అనుమతి కావాలన్నా పైసలు లేనిదే కరెంటు ఆఫీసుల ఫైల్ కదలడం లేదన్నారు. రైతన్నను కాల్చుకతినడం భావ్యం కాదంటూ అధికారులకు తాము ఎదుర్కొన్న బాధను వివరించారు.

Advertisement
Advertisement