రాజ్యాంగంపై అవగాహన ఉండాలి | Sakshi
Sakshi News home page

రాజ్యాంగంపై అవగాహన ఉండాలి

Published Sat, Aug 25 2018 3:05 PM

There Should Be Awareness On The Constitution - Sakshi

నల్లగొండ టూటౌన్‌ : యువత, విద్యార్థులు రాజ్యంగాన్ని విధిగా చదవాలని.. ప్రతి ఒక్కరికి రాజ్యంగంపై అవగాహన అవసరమని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ ఘంటా చక్రపాణి అన్నారు. ట్రస్మా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 498 రోజులుగా బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేస్తున్న కార్యక్రమాన్ని పురస్కరించుకుని స్థానిక మార్కెట్‌ యార్డులో ‘భారత రాజ్యాం గ పరిరక్షణ – యువత పాత్ర’ అనే అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ము ఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారతావని కీర్తి ప్రతిష్టలకు కారణం అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగమే అన్నారు.

అంబేద్కర్‌ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. అంబేద్కర్‌ జీవిత విశేషాలపై విద్యార్థులకు నిర్వహిం చిన ప్రతిభా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం అంబేద్కర్‌ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం కోమటిరెడ్డి ప్రతీక్‌ ఫౌండేషన్‌ సమకూర్చిన రూ.50 వేల విలు వల గల జీకే పుస్తకాలను ఎస్సీ స్టడీ సర్కిల్‌లో చదివే పేద విద్యార్థులకు ఫౌండేషన్‌ సీఈఓ ఎంవీ.గోనారెడ్డితో స్టడీ సర్కిల్‌ నిర్వహాకుడు సో మయ్యకు అందజేశారు.

అంతకు ముందు మర్రి గూడ బైపాస్‌ వద్ద బుద్ధవనంలో అంబేద్కర్, జగ్జీవన్‌రామ్‌ విగ్రహాలకు పూల మాలలు వేసి ని వాళులు అర్పించారు. ట్రస్మా జిల్లా అధ్యక్షుడు యానాల ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ  కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు కందాళ పా పిరెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ రేకల భ ద్రాద్రి, మార్కెట్‌ చైర్మన్‌ కరీంపాషా, ట్రస్మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంట్ల అనంతరెడ్డి, వైద్యం వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడి శ్రీనివాసులు, కత్తుల నర్సింహ, ప్రపంచ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య కార్యదర్శి ఎంవీ.గోనారెడ్డి, కేజీ టు పీజీ విద్యాసంస్థల చైర్మన్‌ గింజల రమణారెడ్డి, కట్టె శివకుమార్, పెరిక కరణ్‌జయరాజ్, వేముల శేఖర్, వెంకట్‌రెడ్డి, గిరిధర్‌ గౌడ్, కైలాసం పాల్గొన్నారు.

Advertisement
Advertisement