‘ఇంటిదొంగ’ గుట్టురట్టు | Sakshi
Sakshi News home page

‘ఇంటిదొంగ’ గుట్టురట్టు

Published Wed, Feb 24 2016 3:48 AM

‘ఇంటిదొంగ’ గుట్టురట్టు - Sakshi

జేడీఏ కార్యాలయంలో రూ.3 కోట్లు కాజేసిన డేటా ఎంట్రీ ఆపరేటర్
 
 సంగారెడ్డి రూరల్: మెదక్ జిల్లా వ్యవసాయ కార్యాలయం నుంచి డబ్బులు కాజేసిన డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎట్టకేలకు దొరికాడు. సంతకాలు ఫోర్జరీ చేసి రూ.3.35 కోట్లు కాజేసిన మానయ్య అలియాస్ మాణిక్యం (29)ను సంగారెడ్డి రూరల్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. డీఎస్పీ తిరుపతన్న కేసు వివరాలను విలేకరులకు వివరించారు. వ్యవసాయ శాఖ కార్యాలయంలో డీటీపీ ఆపరేటర్ మానయ్య రూ.3 కోట్లకుపైగా అక్రమం గా డబ్బులు డ్రా చేశారని జేడీఏ హుక్యానాయక్ గత నెల 21న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానితుల సంతకాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగా ఆఫీసులో డేటా ఎం ట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న శంకర్‌పల్లి మం డలం లక్ష్మీరెడ్డిగూడెంకు చెందిన మానయ్య జేడీఏ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆర్‌కేబీవై పథకానికి చెందిన రూ.కోటికి పైగా, ఎన్ ఎఫ్‌ఎస్‌ఎం నుంచి రూ. 2 కోట్లకు పైగా డ్రా చేశాడు.

 జాతకం మార్చిన ఫోన్‌కాల్: ‘షెవర్ల్లెట్ కంపె నీ నుంచి రూ.7 కోట్లు గెలుచుకున్నారు. ఆ డబ్బు పొందాలంటే రూ.3.50కోట్లను తాము సూచించిన అకౌంట్లలో జమ చేయాలి’ అని మానయ్య ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ వచ్చింది. దీంతో మానయ్య.. తాను పని చేస్తున్న కార్యాలయం నుంచి డబ్బులను డ్రా చేసి సదరు కంపెనీ అకౌంట్‌కు పంపించాడు. ఈ క్రమం లో ఓ బ్యాంక్ కర్ల్క్‌కు అనుమానం వచ్చి జేడీఏ హుక్యానాయక్‌కు లేఖ రాయడంతో అసలు విషయం బయటపడింది. ఈ కేసులో ఇతర సిబ్బంది ప్రమేయం ఉందా? లేదా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఎస్‌ఎంఎస్‌లను రిసీవ్ చేసుకొనే వ్యక్తులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ల లో డబ్బు ఆన్‌లైన్ ద్వారా అక్రమంగా డ్రా చేసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.

Advertisement
Advertisement