దొంగ అల్లుడు..! | Sakshi
Sakshi News home page

దొంగ అల్లుడు..!

Published Tue, Mar 10 2015 3:19 AM

దొంగ అల్లుడు..! - Sakshi

- చంద్రశేఖర్‌కాలనీలో చోరీకి పాల్పడింది ఇంటి అల్లుడే  
- రూ. రూ.23.98 లక్షలు స్వాధీనం

నిజామాబాద్ క్రైం : నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో సంచలనం సృష్టించిన రూ.25 లక్షల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడింది స్వయనా ఇంటి అల్లుడేనని తెలుసుకున్న కుటుంబ సభ్యులు నివ్వెరపోయారు. ఈ సంఘటనకు సంబంధించి నిజామాబాద్ డీఎస్పీ ఆనంద్‌కుమార్ సోమవారం మూడో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.  
 
నగరంలోని మూడో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధి చంద్రశేఖర్‌కాలనీలో ఈ నెల 3న బాబురావు ఇంట్లో రూ. 24 లక్షలు చోరీకి గురయ్యాయి. బాబురావు మహా రాష్ట్రలోని ధర్మబాద్ వద్ద వ్యవసాయ భూమిని అమ్మి నిజామాబాద్‌లో ఓ ఇంటి స్థలాన్ని కొనుగోలు చేయాల ని భావించాడు. అందులో భాగంగా తన పొలాన్ని పెద్దల్లుడు వెంకట్ సహాయంలో విక్రయించాడు. బాబురావుకు గత కొద్ది నెలలుగా ఆరోగ్యం బాగలేకపోవడంతో అతని భార్య చౌత్రభాయి ఇంటి వ్యవహారాలు చూస్తోంది. వీరికి నలుగురు కూమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ధర్మబాద్ వద్ద ఉన్న పొలాన్ని గత  ఏడాది సెప్టెంబర్‌లో విక్రరుుంచగా దానికి సంబంధించి నగదు రూ. 26 లక్షలు గత నెల ఫిబ్రవరి 20న  ఇచ్చారు. ఇందు లో నుంచి రూ.లక్షను అల్లుడు వెంకట్‌కు ఇచ్చి, మరో రూ.1.02 లక్షలను ఇంటి ఖర్చుల కోసం తీసిపెట్టారు. మిగిలిన రూ.23.98 లక్షలను కుమారులపై నమ్మకం లేకపోవడంతో పెద్ద అల్లుడు చేతిలో పెట్టారు. వాటిని ఆయన తన మూడో బామ్మర్ది గదిలోని బీరువాలో దాచిపెట్టాడు. అరుుతే 11 రోజుల తర్వాత వెంకట్ ఆ నగదుపై కన్నేశాడు. అత్తమామలు ఇచ్చిన లక్ష రూపాయలు కాదని బీరువాలో దాచిపెట్టిన డబ్బులు కాజేసేందుకు పన్నాంగం పన్నాడు.

ఇందులో భాగంగా ఈ నెల 2న నగదు తస్కరించి ఇంటిముందున్న గడ్డివాములో దాచిపెట్టాడు. అనంతరం మరుసటి రోజు 3వ తేదీన ఉదయం 6 గంటలకు తాను ధర్మబాద్‌కు వెళ్తానని చెప్పటంతో బామ్మర్ది బైక్‌పై అతడిని బస్టాండ్‌లో దింపివచ్చాడు. అల్లుడు వెళ్లిన రెండు గంటల తర్వాత చౌత్రబాయి బీరువాలో డబ్బులు చూడగా కనిపించలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పూర్తి వివరాలు రాబట్టారు. వారు తెలిపిన ప్రకారం అనుమానం పెద్దల్లుడి పైకి వెళ్లింది.

ఆయన కోసం ఫోన్ చేయగా ఫోన్ స్విచాఫ్ రావడంతో అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం వెంకట్ తాను దొంగలించిన డబ్బుల కోసం నిజామాబాద్‌కు వచ్చి డబ్బులు బ్యాగ్‌లో వేసుకుని హమల్‌వాడి నిర్మల హృదయ కాన్వెంట్ స్కూల్ నుంచి వెళ్తుండగా పోలీసులకు అనుమానం వచ్చి అతని బ్యాగ్‌ను తనిఖీ చేయగా విషయం బయటపడిందని డీఎస్పీ తెలిపారు. అతడి నుంచి రూ.23.98 లక్షలు స్వాధీనం చేసుకున్నామన్నారు. విలేకరుల సమావేశంలో నగర సీఐ నర్సింగ్‌యాదవ్, ఎస్సైలు శ్రీహరి, రామానాయుడులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement