మూడు బాల్య వివాహాలకు బ్రేక్ | Sakshi
Sakshi News home page

మూడు బాల్య వివాహాలకు బ్రేక్

Published Thu, May 7 2015 3:04 AM

మూడు బాల్య వివాహాలకు బ్రేక్ - Sakshi

మూడు ముళ్లు పడకుండానే ఆగిన పెళ్లిళ్లు
ఏటూరునాగారం, అప్పల్‌రావుపేట, బూరుగుపాడు దుబ్బతండాలో ఘటనలు

 
ఏటూరునాగారం :  పోలీసులు, ఐసీడీఎస్ అధికారిణులు, చైల్డ్‌లైన్ సిబ్బంది కలిసి జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో మూడు బాల్య వివాహాలను నిలిపి వేశారు. పెళ్లి సిద్ధమైన బంధువులను ఆయా పోలీస్‌స్టేషన్లకు తరలించి విచారించారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రం లోని ఎర్రల్లవాడకు చెందిన బట్టు శ్రీలత(16) తండ్రి పోతరాజు చిన్నతనంలో మృతి చెందా డు. ఆమె హన్మకొండలో ఇంటర్ పూర్తి చేసింది. అన్ని తానై పోషించిన తల్లి భాగ్యలక్ష్మి శ్రీలతకు ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం బెస్తగూడేనికి చెందిన రామెళ్ల రమేష్‌తో వివాహం చేసేం దుకు సిద్ధమైంది. వారు కల్యాణ మండపం, భోజనాల ఏర్పాటు కూడా చేసుకున్నారు. అరుుతే శ్రీలత మైనర్ అని గుర్తుతెలి యని వ్యక్తి ఐసీడీఎస్ సీడీపీఓ భాగవతం రాజమణికి, జిల్లా పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. దీంతో ఎస్సై వినయ్‌కుమార్ వెళ్లి వధువు శ్రీలత, వరుడు రమేష్‌ను స్టేషన్‌కు తరలించారు. శ్రీలతకు, ఆమె తల్లి భాగ్యలక్ష్మికి ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ప్రమీల రాణి, అంగన్‌వాడీ కార్యకర్తలు ఇర్సవడ్ల సరో జ, కొండ పద్మలు కౌన్సెలింగ్ ఇచ్చారు. వరుడు రమేష్, తల్లిదండ్రులకు ఎస్సై వినయ్‌కుమార్ కౌన్సెలింగ్ ఇచ్చి అవగాహన కల్పించారు.  

అప్పల్‌రావుపేటలో..

నెక్కొండ : మండలంలోని అప్పల్‌రావుపేట గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికకు ఈ నెల 17న జరుగనున్న బాల్యవివాహానికి చైల్డ్‌లైన్ సిబ్బంది, పోలీసులు బుధవారం బ్రేక్ వేశారు. అప్పల్‌రావుపేటకు చెందిన బాలికకు ఖానాపురం మండలం మంగళవారిపేట గ్రామానికి చెందినఅబ్బాయితో పెళ్లి చేయూలని ఇరువైపుల పెద్దలునిశ్చరుుంచారు. అరుుతేఈ సమాచారంఫోన్‌ద్వారా తెలుసుకున్న చైల్డ్‌లైన్ సిబ్బంది స్థానిక పోలీసులు, అంగన్‌వాడీ సిబ్బంది బాలి క ఇంటికి చేరుకున్నారు. ఆమె త ల్లిదండ్రులకు ఎస్సై మిథున్ కౌన్సెలింగ్ ఇ చ్చారు. బాల్య వి వాహం చేస్తే చట్టరిత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమం లోచైల్డ్‌లైన్ సిబ్బం ది బెజ్జంకి ప్రభాకర్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు జి.ఫాతిమా, ఏసీడీఎస్ కౌన్సిలర్ మాధవి, సర్పంచ్ వడ్డె రజిత సురేష్, వార్డు సభ్యులు రమేష్ పాల్గొన్నారు.
 
దుబ్బ తండాలో...

డోర్నకల్ : ఈ నెల 10న జరగాల్సిన బాల్య వివాహాన్ని ఐసీడీస్ అధికారులు, 1098 చైల్డ్‌లైన్ సంస్థ ప్రతినిధులు నిలిపివేశారు. మండలంలోని బూరుగుపాడు శివారు దుబ్బతండాకు చెందిన రాంజీ, చాంది దంపతుల 15 ఏళ్ల కుమార్తెకు ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాకు చెందిన దారావత్ కుమార్‌తో ఈ నెల 10న వివాహం చేసేందుకు నిశ్చయించారు. బాలికకు వివాహం చేస్తున్నారని తెలుసుకున్న ఐసీడీఎస్ సీడీపీఓ నాగమల్లీశ్వరి, సూపర్‌వైజర్ రేఖ, 1098 చైల్డ్‌లైన్ సంస్థ ప్రతినిధులు వెంకటేష్ తదితరులు దుబ్బతండాకు వెళ్లారు. వారి రాకను పసిగట్టిన తల్లిదండ్రులు బాలికను ఇంట్లో పెట్టి తాళం వేసి బయటికి వెళ్లారు. ఈ విషయమై సమాచారం అందడంతో తాళం పగులగొట్టేందుకు అధికారులు సిద్ధమవగా బాలిక తల్లి చాంది వచ్చి తాళం తీసింది. ఇంట్లోనే బాలిక ఉండటంతో వెంటనే ఐసీడీఎస్ కార్యాలయానికి తరలించి బాలికతోపాటు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం బాలికను వరంగల్‌లోని స్వధార్ హోంకు తరలించారు.

Advertisement
Advertisement