కేసీఆర్ వ్యాఖ్యలపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు | Sakshi
Sakshi News home page

కేసీఆర్ వ్యాఖ్యలపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు

Published Sat, Sep 13 2014 12:31 PM

కేసీఆర్ వ్యాఖ్యలపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు - Sakshi

విచారణకు ఆదేశించిన ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ కట్జూ

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మీడియాకు వ్యతిరేకంగా  వ్యాఖ్యానించినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) ఓ త్రిసభ్య కమిటీని వేసింది. ఇందులో సీనియర్ జర్నలిస్టు రాజీవ్ రంజన్‌నాగ్ కన్వీనర్‌గా, కె. అమర్‌నాథ్, కృష్ణప్రసాద్ సభ్యులుగా ఉంటారు.

తెలంగాణలో మీడియా ఎదుర్కొంటున్న ముప్పు, బెదిరింపుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీ సిఫారసు చేయనున్నట్లు పీసీఐ చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణను కించపరిస్తే మీడియా మెడలు విరుస్తానని, పాతరేస్తానని కేసీఆర్ అన్నట్లు వచ్చిన ఆరోపణల నిర్ధారణకు ఈ కమిటీ విచారణ జరపనుంది.

Advertisement
Advertisement