‘తాడిచెర్లపై ప్రచారయాత్ర..గోలివాడపై ఉద్యమం’ | Sakshi
Sakshi News home page

‘తాడిచెర్లపై ప్రచారయాత్ర..గోలివాడపై ఉద్యమం’

Published Wed, May 3 2017 7:33 PM

‘తాడిచెర్లపై ప్రచారయాత్ర..గోలివాడపై ఉద్యమం’ - Sakshi

గోదావరిఖని: ప్రొఫెసర్‌ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని తాడిచెర్ల బొగ్గు గనులను ప్రైవేటుపరం చేయడాన్ని అడ్డుకుంటుమాని టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం తెలిపారు. తాడిచెర్ల బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యాలు కుట్రలు చేస్తున్నాయని మండిడ్డారు. బుధవారం ఆయన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బుధవారం జరిగిన సదస్సుకు హాజరయ్యారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల కోసం కార్మికుల పిల్లలు ఇబ్బంది పడుతుంటే... ప్రభుత్వం, యాజమాన్యం తాడిచెర్ల బొగ్గు బ్లాక్‌లను ప్రైవేటుపరం చేసేందుకు కాంట్రాక్టర్ల నుంచి టెండర్లను ఆహ్వానించి కుట్ర చేస్తున్నాయన్నారు. సింగరేణి సంస్థ ఇతర  దేశాలలో బొగ్గుబ్లాక్‌లను తీసుకుని ఉత్పత్తి చేసేందుకు ఉవ్విళ్లూరుతున్న తరుణంలో స్వరాష్ట్రంలో ఉన్న బొగ్గు బ్లాక్‌లను ప్రైవేటు వారికి అప్పగించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ కుట్రకు వ్యతిరేకంగా కార్మిక, ప్రజాసంఘాలతో సింగరేణి వ్యాప్తంగా  ప్రచారయాత్ర నిర్వహించనున్నామని, తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.

గోలివాడ రైతుల యాజమాన్య హక్కులకు భంగం
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గోలివాడలో నిర్మిస్తున్న సుందిళ్ల బ్యారేజీకి సంబంధించిన పంప్‌హౌస్‌ కోసం సేకరిస్తున్న భూమి విషయంలో రైతుల యాజమాన్య హక్కులకు భంగం కలిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని కోదండరాం ఆరోపించారు. భూసేకరణ చట్టబద్ధతతో జరగకపోవడంతో రైతులు హైకోర్టులో పిటిషన్‌ వేయగా, కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయకుండా యాజమాన్య హక్కులకు భంగం కలిగిలే రైతుల భూముల్లో బలవంతంగా పనులు చేపడుతోందని ఆరోపించారు. రైతులకు నష్టం కలిగిస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement