అదిలాబాద్‌లో రెండు చోట్ల టీజేఎస్‌ అభ్యర్థులు | Sakshi
Sakshi News home page

రెండు చోట్ల టీజేఎస్‌ అభ్యర్థులు

Published Fri, Nov 30 2018 3:51 PM

TJS Contest In khanapur And Asifabad Also - Sakshi

ఖానాపూర్‌: ప్రజాఫ్రంట్‌ తరుపున ఉమ్మడి జిల్లాలో ఖానాపూర్, ఆసిఫాబాద్‌ నియోజకవర్గాల నుంచి టీజేఎస్‌ అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు టీజేఎస్‌ ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాల్‌శర్మ తెలిపారు. ఖానాపూర్‌లోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ, సీపీఐతో కలిసి ప్రజాఫ్రంట్‌గా ఏర్పడినా సామాజిక సమీకరణలు, పార్టీ ఖచ్చితంగా గెలిచే 8 స్థానాను గుర్తించామని తెలిపారు. అందులో నాలుగు చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థులు పోటీలో లేరని తెలిపారు. ఖానాపూర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి రాథోడ్‌ రమేశ్‌ పోటీలో ఉన్నారని అయినా టీజేఎస్‌ నుంచి భీంరావు పోటీలో ఉంటారని వెల్లడించారు. ప్రజాఫ్రంట్‌లోని ఇతర పార్టీల అభ్యర్థులు పోటీలో ఉన్నచోట ఫ్రెండ్లీ పోటీ ఉంటుందని పేర్కొన్నారు. ఖానాపూర్‌లో టీజేఎస్‌ అభ్యర్థి తాట్ర భీంరావును గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్‌ నియోజకవర్గ అభ్యర్థి తాట్ర భీంరావు, ఓయూ జేఏసీ చైర్మన్‌ మందాల భాస్కర్, జిల్లా కో– కన్వీనర్‌ తిలక్‌రావు ఉన్నారు. 

Advertisement
Advertisement