రైతును రాజుగా మారుస్తాం | Sakshi
Sakshi News home page

రైతును రాజుగా మారుస్తాం

Published Mon, Nov 24 2014 4:04 AM

రైతును రాజుగా మారుస్తాం - Sakshi

సీఎం కేసీఆర్ నాయకత్వంలో రైతును రాజుగా మారుస్తామని డిప్యూటీ సీఎం డా క్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. ములు గు రోడ్డులోని ఏఆర్‌ఎస్‌లో ఆదివారం రైతు సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ  మాట్లాడుతూ సస్యశ్యామల తెలంగాణ కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
 
మట్టెవాడ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో కొలువుదీరిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం సస్యశ్యామల తెలంగాణ కోసం కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. వరంగల్ ములుగు రోడ్డులోని వ్యవసాయ పరిశోధ న స్థానంలో ఆదివారం ఏడీఆర్ డాక్టర్ చేరాలు అధ్యక్షతన ఆరుతడి పంటలపై రైతు సదస్సు నిర్వహించా రు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం రాజయ్య మాట్లాడుతూ సుమా రు 60 ఏళ్లపాటు సమైక్య రాష్ట్రంలో సీమాంధ్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంత వ్యవసాయ రంగాన్ని, రైతులను నిర్లక్ష్యం చేశాయన్నారు.

తెలంగాణ సాధించుకున్న తర్వాత గత ప్రభుత్వాలు చేసిన పాపాలను సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం కడుగుతుందన్నారు. ఇది  రైతును రాజును చేసే ప్రభుత్వమన్నారు. అందుకే 38 లక్షల మంది రైతులకు రుణమాఫీలో భాగంగా ఇచ్చే రూ.17 వేల కోట్లలో మొదటి విడతగా 480 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. చెరువులను అభివృద్ధి చేసేం దుకు రాష్ట్రంలోని 46 వేల చెరువుల కోసం రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. ఆరుతడి పంటలైన పెసర, ఆముదాలు, శనగ, నువ్వులు, కందులు వేసుకోవడం వల్ల నీళ్ల సమస్య ఉండదన్నారు. సదస్సులో జేసీ పౌసుమి బసు, జేడీఏ రామారావు, అగ్రికల్చర్ డెరైక్టర్ రాజిరెడ్డి మాట్లాడారు.
 
తడబడిన జంగా..
డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి గౌరవనీయలైన డిప్యూటీ సీఎం టి.రాజయ్య అనబోయి సిరిసిల్ల రాజయ్య అనడంతో వచ్చిన రైతులు ఒక్కసారిగా నవ్వారు. ఆ తర్వాత ఆయన తేరుకుని డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య అని సవరించుకుని మాట్లాడారు. అనంతరం డిప్యూటీ సీఎం చేతుల మీదుగా గిరిజన రైతుల కోసం కల్టివేటర్స్ పంపిణీ చేశారు. అలాగే స్టాళ్లలోని ట్రాక్టర్‌ను ఆయన నడిపారు. ఎనిమల్ హస్బండరీ జేడీ శంకర్‌రెడ్డి, ఫిషరీస్ డీడీ శంకర్‌రాథోడ్, సెరీకల్చర్ జేడీ సుధాకర్‌రావు, వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ జలపతిరావు, ఉద్యానవన శాఖ ఏడీ అక్బర్, ఆత్మ పీడీ ఉమామహేశ్వరమ్మ, శాస్త్రవేత్తలు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
 
ఆకట్టుకున్న స్టాళ్లు..
ఆరుతడి పంటలపై ఏర్పాటు చేసిన సదస్సులో వివిధ వ్యవసాయ ఉత్పత్తులు, విత్తనాలు, విద్యుత్ మోటార్లతోపాటు వ్యవసాయ పరికరాలకు సంబంధించిన స్టాళ్లు రైతులను ఆకట్టుకున్నాయి. అలాగే వరంగల్  వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులు విత్తనాల ప్రదర్శన నిర్వహించారు. ఈ స్టాళ్లను డిప్యూటీ సీఎం రాజయ్య, అధికారులు తిలకించారు.

Advertisement
Advertisement