కదం తొక్కిన కార్మికులు.. | Sakshi
Sakshi News home page

కదం తొక్కిన కార్మికులు..

Published Mon, Jul 6 2015 11:47 PM

కదం తొక్కిన కార్మికులు..

- సంగారెడ్డిలో భారీ ప్రదర్శన, కలెక్టరేట్ ముట్టడి
- కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలి
- కనీస వేతనం రూ.15వేలు ఇవ్వాలి
- సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు
సంగారెడ్డి క్రైం :
రాష్ట్రంలో కార్మికులు, ఉద్యోగులు చేస్తున్న సమ్మెలు, ఉద్యమాలు రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు ధ్వజమెత్తారు. కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనంగా రూ.15వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వివిధ శాఖల్లోని కాంట్రాక్టు కార్మికులు కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. అంతకుముందు కార్మికులు స్థానిక ఐటీఐ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా  చుక్క రాములు మాట్లాడుతూ కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేస్తామన్న సీఎం మాట తప్పారన్నారు.

గత నెల 15 నుంచి కార్మికుల సమస్యలపై కార్మిక పోరుబాట పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేశామన్నారు. సర్వేలో ఎక్కడ కూడా కనీస వేతనాలు అమలు కావడం లేదని తేలిందన్నారు.  కోట్లాదిరూపాయలు ఖర్చు చేసి ఆర్భాటాలు చేస్తున్న ప్రభుత్వం అసంఘటిత కార్మికులకు, స్కీం వర్కర్లకు వేతనాలు పెంచడం లేదన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, తదితరులకు వేతనాలు పెంచినప్పటికీ, రోడ్లపైకి వచ్చి పోరాడుతున్న అసంఘటిత కార్మికులకు మాత్రం వేతనాలు పెంచకపోవడం శోచనీయమన్నారు.
 
కార్యక్రమంలోసీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి కె.రాజయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం, సీఐటీయూ నాయకులు సర్దార్, ప్రవీణ్, నాగేశ్వర్‌రావు, నర్సమ్మ,మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్వో దయానంద్‌కు అందజేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement