అసౌకర్యాల సెగ | Sakshi
Sakshi News home page

అసౌకర్యాల సెగ

Published Fri, May 20 2016 12:15 AM

To cope with the inconvenience

ఉత్పత్తి లక్ష్యాలు చేరుకోవడానికి శక్తి వంచనలేకుండా కృషి చేస్తున్న కార్మికులకు కనీసం సౌకర్యాలు కరువయ్యూరుు. దుమ్ము, ధూళి, కాలిన బొగ్గు నుంచి గ్యాస్ లాంటి పొగతో ఊపిరి సలపని పరిస్థితి. మండుటెండలోనే విధుల నిర్వహణ. స్థానికంగా క్వార్టర్లు లేక దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు జేవీఆర్ ఓసీ-1 కార్మికులు.      - సత్తుపల్లి(ఖమ్మం)

 

కొత్తగూడెం ఏరియూ పరిధి సత్తుపల్లి జేవీఆర్ ఓసీని 2005 జూలై 5న అప్పటి ముఖ్యమంత్రి దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. 11 ఏళ్లుగా ఉత్పత్తిలో ఏటా కంపెనీ నిర్దేశించిన లక్ష్యానికి మించి బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు కార్మికులు. ప్రస్తుతం 453 మంది పని చేస్తున్నా రు. హైడ్రాలిక్ షావల్స్ 4, డ్రిల్స్ 2, డోజర్లు 4, డంపర్లు 15, గ్రేడర్స్ 2, లోడర్ 1 ఉన్నారుు. గతేడాది లక్ష్యం 40లక్షల టన్నులకు 45.5లక్షల టన్నులు తీశారు. షిఫ్టునకు కనీసం 16 నుంచి 18వేల టన్నుల ఉత్పత్తి జరుగుతోంది.

 
సమస్యల తిష్ట : కార్మికులకు స్థానికంగా క్వార్టర్లు లేకపోవడంతో సగానికి పైగా కొత్తగూడెం, ఇల్లెందు ఏరియూల్లో నివాసముంటున్నారు. అక్కడి నుంచి డెరైక్ట్ బస్సు సౌకర్యం లేక లారీల ను, ఆటోలను ఆశ్రయిస్తున్నారు. దీంతో తరచూ రోడ్డు ప్రమాదాల బారినపడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు కార్మికులు మృత్యువాత పడ్డారు. క్వార్టర్ల నిర్మాణానికి యూజ మాన్యం రూ.114కోట్లు మంజూరు చేసినా స్థలం సేకరిం చలేదు. కంపెనీ ఇస్తున్న 10శాతం హెచ్‌ఆర్‌ఏ విద్యుత్ బిల్లులకు సరిపోవటం లేదని కార్మికులు చెబుతున్నారు. 

     
ఓసీలో కార్మికులు సేద తీరేందుకు వేసిన పందిళ్లకు చుట్టూ తడికలు కట్టకపోవటంతో తీవ్రవేడి, వడగాడ్పు లు, బొగ్గు సెగలోనే పని చేయాల్సి వస్తోంది. పందిళ్ల కింద ఏర్పాటు చేసి కుండలోని మంచినీళ్లు వేడెక్కి తాగలేకపోతున్నారు. పదేళ్ల నాటి యంత్రాలనే వాడటం వలన తరచూ రిపేరుకొస్తున్నారుు. హైడ్రాలిక్ షావల్స్ నాలుగు ఉన్నా ఒక్కటే సక్రమంగా నడుస్తోంది. మిగిలినవి ఎప్పుడు ఆగిపోతా యో తెలియదు. డోజరు పాతకాలంనాటిది కావడటం వల్ల దుమ్ము, ధూళితో నరకం చూస్తున్నారు. క్రషర్ క్యాబిన్‌లు, డోజర్, లోడర్ యంత్రాల క్యాబిన్‌ల పైన చాపలతో కప్పుతున్నారు. చుట్టు పక్కల నుంచి వచ్చే వేడికి కార్మికులు తట్టుకోలేకపోతున్నారు.

     
యూజమాన్యం నిర్వహిస్తున్న క్యాంటీన్‌లో అల్పాహారం నాణ్యత లేకుండా తయూరు చేస్తున్నారు. వాటిని తినలేక అర్ధాకలితో ఉండాల్సి వస్తోంది. కేవలం వడ, ఉప్మాతోనే సరిపుచ్చుతున్నారు. పూరి అప్పుడప్పుడు వడ్డిస్తున్నారు. ఇడ్లీ, స్వీట్లు అసలే ఇవ్వటం లేదు. రెస్ట్ రూంలోనే క్యాంటీన్ నిర్వహించటంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.

     
అసలే ఎండాకాలం. పంపిణీ చేస్తున్న మజ్జిగ ప్యాకెట్లు కార్మికులకు అందే వరకు ఎండలకు వేడిగా మారుతున్నారుు. వాటిని పని ప్రదేశానికి పంపిణీ చేయకుండా ఒక షెడ్డులో ఇస్తున్నారు. అవి కార్మికుల చేతికి చేరడానికి చాలా సమయం పడుతోంది. పీఎంఈ పరీక్షలకు కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి వెళ్లి రావటంతో మస్టర్ పోతోంది. బీపీ హెచ్చుతగ్గులుంటే.. పరీక్షలకు రెండు మూడురోజులు పడుతోంది. కొత్తగూడెం ఏరియా పరిధి కావటంతో ప్రతి చిన్న పనికి అక్కడి కార్యాలయూనికి వెళ్లడంతో మస్టర్లు పోతున్నారుు.

 

క్వార్టర్లు లేక అవస్థలు
సత్తుపల్లిలో క్వార్టర్లు లేకపోవటంతో కార్మికుల కుటుం బాలకు రక్షణ లేకుండా పోయింది. ఇప్పటికీ చాలా మంది దూర ప్రాంతాల నుంచి వచ్చిపోతున్నారు. సంస్థ ఇచ్చే హెచ్‌ఆర్‌ఏ అద్దెలకు ఏమాత్రం సరిపోవటం లేదు. స్థల సేకరించి తక్షణం క్వార్టర్లు నిర్మించాలి.
- ఎండీ.అజ్గర్‌ఖాన్, ఈపీ ఆపరేటర్

 

పీఎంఈ పరీక్షలు ఇక్కడే చేయూలి
ప్రతి ఏడాది పీఎంఈ పరీక్ష లు తప్పనిసరి. పరీక్షలకు కొ త్తగూడెం ఏరియా ఆస్పత్రికి వెళ్లటంతో మస్టర్ పోతుంది. స్థానిక డిస్పెన్సరీ వద్దే పీఎంఈ పరీక్షలు నిర్వహిస్తే వేతనం కలిసివస్తుంది. టెన్షన్ తగ్గుతుంది.  - చిట్టూరి యుగంధర్, ఫిట్ కార్యదర్శి సత్తుపల్లి

 

Advertisement
Advertisement