ఆ పోలీసులపై చర్య తీసుకోవాలి | Sakshi
Sakshi News home page

ఆ పోలీసులపై చర్య తీసుకోవాలి

Published Wed, Jun 15 2016 12:45 AM

To take action against the police

శివరాజు అక్రమ నిర్బంధంపై పౌరహక్కుల సంఘం నాయకుల డిమాండ్
నార్లాపూర్ నుంచి తీసుకెళ్లి పస్రాలో పట్టుబడినట్లు కట్టు
కథలు అల్లుతున్నారని ధ్వజం

 

హన్మకొండ : తాడ్వాయి మండలం నార్లాపూర్‌కు చెందిన సిద్దబోయిన శివరాజును అక్రమంగా నిర్బంధించిన పోలీసులపై చర్య తీసుకోవాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణరావు, జిల్లా అధ్యక్షుడు అనంతుల సురేష్, ప్రధాన కార్యదర్శి రమేష్ చందర్ నాయకులు మాదన కుమారస్వామి, గుంటి రవితో కూడిన పౌరహక్కుల సంఘం (సీఎల్‌సీ) బృందం తాడ్వాయి మండలం నార్లాపూర్‌కు వెళ్లి శివరాజు ఉదంతానికి సంబంధించి గ్రామస్తులు, కుటుంబ సభ్యుల ద్వారా వివరాలు సేకరించింది. ఈ మేరకు ఆ వివరాలను సంఘం విడుదల చేసింది. వారి కథనం ప్రకారం..

 
ఈ నెల 11న ఉదయం 9 గంటలకు సాధారణ దుస్తుల్లో ఇద్దరు వ్యక్తులు ఆటోలో నార్లాపూర్‌కు చేరుకున్నారు. నేరుగా మద్యం షాపునకు వెళ్లి మద్యం తాగుతూ యజమానితో మాటమాట కలిపి సిద్ధబోయిన శివరాజుకు సంబంధించిన వివరాలు సేకరించారు. సెల్‌ఫోన్ నంబర్ తీసుకున్నారు. అక్కడి నుంచి శివరాజు ఇంటికి వెళ్లి తాము ఖమ్మం జిల్లా వాజేడు నుంచి వచ్చామని శివరాజు స్నేహితులమని ఇంట్లో ఉన్న శివరాజు సోదరితో చెప్పారు. అక్కడి నుంచి శివరాజుకు ఫోన్ చేసి అతడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నారు. గ్రామ చివరలో ఉన్న టీఆర్‌ఎస్ మాజీ మండల అధ్యక్షుడు అశోక్ ఇంట్లో కలుద్దామని చెప్పి, అక్కడే కలుసుకున్నారు. తన కు 10 ఎకరాల భూమి కావాలని, కొనడానికి వచ్చానని నీ సాయం కావాలని కోరాడు. ఆ తర్వాత వచ్చిన వ్యక్తిని సాగనంపడానికి శివ రాజు ఆటో దగ్గరికి వెళ్లగానే ఆటోలో కూర్చు న్న మరో వ్యక్తి అతడిని ఆటోలోకి లాగగా బయట ఉన్న వ్యక్తి కాళ్లు ఎత్తి ఆటోలో పడేశా డు. ఈ ఘర్షణలో శివరాజు తలకు గాయమైం ది. ఊరు చివర్లో ఇల్లు ఉండంతో జన సంచా రం లేదు. ఒక అమ్యాయి ఈ దృశ్యాన్ని చూస్తుండగానే క్షణాల్లో ఆటో వెళ్లి పోయింది. ఆమె ద్వారా సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు శివరాజును ఎవరో గుర్తుతెలియని అగంతుకులు ఆపహరించుకుపోయారని తాడ్వాయి పోలీసులకు ఫోన్ చేశారు. అనంతరం మంత్రి చందులాల్, మేడారం ట్రస్టు బోర్డు చైర్మన్ కాక లింగయ్య కు ఫోన్ చేశారు.


అయినా ఆచూకీ తెలియలేదు. అదేరోజు సాయంత్రం కిరణ్‌ను ఇదే పద్ధతిలో పస్రాలో ఎత్తుకుపోయి మరుసటి రోజు వదిలిపెట్టారు. శివరాజు కుటుంబ సభ్యులు వెళ్లి ములుగు ఏఎస్పీ విశ్వజిత్‌ను కలిస్తే తాము ఎవరిని అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. కానీ ఆ తర్వాత జరిగిన శివరాజు అరెస్టుపై పోలీసు లు కట్టుకథలు అలా ్లరు. మావోయిస్టు కేకేడ బ్ల్యూ కార్యదర్శి దామోదర్ కొరియర్‌గా సిద్దబోయిన శివరాజు పని చేస్తున్నాడని, పస్రా వ ద్ద ములుగు, ఏటూరు నాగారం పోలీసులకు పట్టుబడినట్లు శివరాజును తనిఖీ చేయగా నాలుగు డిటోనేటర్లు, నాలుగు జిలెటిన్ స్టిక్స్ దొరికినట్లు ప్రకటించి అసత్య ప్రకటనలు చేశారని పౌరహక్కుల సంఘం నాయకులు పేర్కొన్నారు.

 
చట్ట ప్రకారం 24 గంటల్లో కోర్టులో ప్రవేశ పట్టాల్సి ఉండగా మూడు రోజులుగా అక్రమంగా నిర్భందించారని పేర్కొన్నారు. కోయ సామాజిక వర్గానికి చెందిన శివరాజు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడని, టీఆర్‌ఎస్‌లో క్రియాశీల కార్యకర్త అని తెలిపారు. మంత్రి చందులాల్ గెలుపుకు అ హర్నిశలు కృషి చేశాడని ఒక వైపు తలవెం ట్రులు తీసుకొని దీక్ష బూనిన ఉద్యమకారుడని, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న నక్సలైట్ల ఎజెండా ఇదేనా అని పౌర హక్కుల సంఘం ప్రశ్నించింది. శివరాజును అక్రమంగా అరెస్టు చేసిన పోలీసుల పేర్లు ప్రకటించి వారిని కఠి నంగా శిక్షించాలని, అన్యాయంగా బనాయిం చిన కేసులను ఎత్తివేయాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది. 

 

Advertisement

తప్పక చదవండి

Advertisement