నేడు బ్లాక్‌ డే

8 Nov, 2017 12:12 IST|Sakshi

కామారెడ్డి క్రైం: నోట్ల రద్దు కారణంగా యేడాదికాలం పాటు దేశ ప్రజలకు కలిగిన కష్టాలకు నిరసనగా నోట్ల రద్దు చేసిన నవంబర్‌ 8వ తేదీని బ్లాక్‌ డేగా గుర్తించి కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్‌ హందన్‌ అన్నారు. కామారెడ్డిలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ బుధవారం  నిజామాబాద్‌లోని కాంగ్రెస్‌ కార్యాలయం నుంచి ర్యాలీగా బయల్దేరి మహాత్మాగాంధీ విగ్రహం వద్దకు చేరుకుంటామన్నారు. మహాత్మానికి నివేదిక సమర్పిస్తామన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు. డీసీసీబీ మాజీ చైర్మన్‌ ఎడ్ల రాజిరెడ్డి, నాయకులు నల్లమడుగు సురేందర్, కారంగుల అశోక్‌రెడ్డి, గూడెం శ్రీనివాస్‌రెడ్డి, మామిండ్ల అంజయ్య, గోనె శ్రీనివాస్, తిర్మల్‌రెడ్డి, ఐరేని నర్సయ్య, ఇసాక్‌షేరూ, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు