కుక్క కాటుతో రేబిస్ ముప్పు | Sakshi
Sakshi News home page

కుక్క కాటుతో రేబిస్ ముప్పు

Published Mon, Sep 28 2015 1:46 AM

కుక్క కాటుతో రేబిస్ ముప్పు - Sakshi

పెంపుడు కుక్కలను మనుషులతో సమానంగా ప్రేమగా చూసుకునే వారిని మనం నిత్య జీవితంలో చాలా మందిని చూస్తుంటాం, వాటితో ఉండే అనుబంధం అలాంటిది. కానీ తగు జాగ్రత్తలు తీసుకోకపోతే కుక్కల సహవాసంతో ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదముంది. ఎందుకంటే ప్రమాదకరమైన రేబిస్ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందేది కుక్కల వల్లే. అయితే కుక్కల వల్ల రేబిస్ వ్యాధి వ్యాపించే విధానం, నిర్మూలనా మార్గాలపై అవగాహన కల్పించడానికై ఏటా సెప్టెంబరు 28న రేబిస్ నివారణా దినంగా జరుపుకొంటారు.                            
- దోమ

 
* సరైన చికిత్స తీసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం
* నేడు రేబిస్ నివారణ దినం
రేబిస్ వ్యాధి ప్రధానంగా రేబిస్ అనే వైరస్ కారణంగా వ్యాపిస్తుంది. ఈ వైరస్ ఎక్కువగా కుక్కల్లో కనబడుతుంది. కుక్కల ద్వారా మానవులకు ఈ వైరస్ సోకి మొదడు పనితీరును తీవ్రమైన ప్రభావం చూపుతుంది. సరైన చికిత్స అందకపోతే మరణానికి కూడా దారితీస్తుంది. ఇది ఒక అంటువ్యాధి. వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా, తుంపర వెదజల్లినా ఇతరులకు సోకుతుంది.
 
రేబిస్ వ్యాధి లక్షణాలు..
విపరీతమైన జ్వరం, తల నొప్పి, ఒళ్ల నొప్పులు రేబిస్ వ్యాధి లక్షణాలుగా చెప్పవచ్చు. వ్యాధిగ్రస్తులలో మెదడు ఉద్వేగానికి లోనై అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. ప్రతి చిన్న విషయానికి భయాందోళనకు గురవుతుంటారు. కుక్క కాటు వేసిన ప్రదేశంలో నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కుక్క కరిచిన 4 నుంచి 6 వారాల తర్వాత ఈ వ్యాధి లక్షణాలు కనబడతాయి.
 
రేబిస్ సోకకుండా ఉండాలంటే...
రేబిస్ వైరస్ సోకకుండా ఉండాలంటే పెంపుడు కుక్కలకు పుట్టిన ఆరు వారాల లోపు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించాలి. 2 నెలల తర్వాత బూస్టర్ డోస్ వేయించాలి. తరచూ ఆస్పత్రికి తీసుకువెళ్లి పరీక్షలు నిర్వహించాలి.
 
కుక్క కరిస్తే ఇలా చేయాలి..
* కుక్క కాటు వేసినపుడు అనవసర ఆందోళనకు గురికావద్దు.
* కరిచిన ప్రదేశంలో గాయాన్ని డెటాల్‌తో శుభ్రంగాా కడగాలి.
* వీలైనంత త్వరగా వైద్యుడి వద్దకు వెళ్లి ఇంజక్షన్ చేయించుకోవాలి.
* కరిచిన కుక్కకు రేబిస్ వ్యాధి ఉందో లేదో నిర్ధిరించుకుని దానికి అనుగుణంగా చికిత్స తీసుకోవాలి.
* ఆంటీ రేబిస్ వ్యాక్సిన్‌తో పాటు బూస్టర్ డోస్‌లను తప్పకుండా వేయించుకోవాలి.
 
వెంటనే చికిత్స అవసరం..
కుక్క కాటుకు గురైన వారు వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించాలి. సంబంధిత ఇంజక్షన్ చేయించుకోవాలి. తద్వారా రేబిస్ వ్యాధి సోకకుండా కాపాడుకోవచ్చు. కుక్కలను పెంచేవారు వాటికి ఆంటీ రేబిస్ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలి. తద్వారా రేబిస్ సోకకుండా జాగ్రత్త పడవచ్చు.
- కృష్ణ, వైద్యాధికారి, దోమ

Advertisement
Advertisement