Sakshi News home page

సింగరేణి భవన్‌లో ట్రైనీ ఐఏఎస్‌లు

Published Fri, Aug 3 2018 2:14 PM

Trainee IAS in Singareni Bhavan - Sakshi

గోదావరిఖని(పెద్దపల్లి జిల్లా): రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో శిక్షణ పొందితున్న ట్రైనీ ఐఏఎస్‌లు గురువారం సింగరేణి భవన్‌లో సంస్థ సీఎండీతో సమావేశమయ్యారు.  సింగరేణి భవన్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో జరిగిన సమావేశంలో సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ ట్రైనీ ఐఏఎస్‌ అధికారులకు సింగరేణి సంస్థ గత 13 దశాబ్దాలుగా బొగ్గు ఉత్పత్తి ద్వారా దేశానికి అందిస్తున్న సేవలను వివరించారు. దక్షిణ భారతదేశంలోని ఏకైక బొగ్గు ఉత్పత్తి సంస్థగా సింగరేణి వివిధ రాష్ట్రాల థర్మల్‌ విద్యుత్‌ అవసరాలు తీరుస్తున్న విషయాన్ని వివరించారు.

రాష్ట్ర ఇంధనశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా కూడా సమావేశంలో పాల్గొన్నారు. డైరెక్టర్‌ ఆపరేషన్స్‌ ఎస్‌.చంద్రశేఖర్‌ సంస్థకు సంబంధించిన విషయాలపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. పలువురు ఐఏఎస్‌ అధికారులు సంస్థ గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఐఏఎస్‌ అధికారుల బృందం సింగరేణి ప్రాంతాల్లోని భూగర్భ, ఓపెన్‌కాస్ట్‌ గనులను సందర్శించాలని చైర్మన్‌ సూచించారు.

కార్యక్రమంలో ఈఅండ్‌ఎం డైరెక్టర్‌ ఎస్‌.శంకర్, పీఅండ్‌పీ డైరెక్టర్‌ బి.భాస్కర్‌రావు, అడ్వైజరీ మైనింగ్‌ డీఎన్‌ ప్రసాద్, సీడీఎస్, ఎస్పీ జీఎం ఆంథోనిరాజా తదితరులు పాల్గొన్నారు. ఐఏఎస్‌ ట్రైనీ అధికారుల బృందంలో యుతులు ముజామిల్‌ఖాన్, మిక్కిలినేని మనుచౌదరి, కుమారి ఇలా త్రిపాఠీ, మిలిండ్‌ బాప్నా, రాహుల్‌ శర్మ, రాజర్షి షా, ప్రతీక్‌ జైన్, అవిష్యాంత్‌ పాండా ఉన్నారు.

Advertisement
Advertisement