రెండోవిడతలో 8వేల చెరువులు | Sakshi
Sakshi News home page

రెండోవిడతలో 8వేల చెరువులు

Published Sun, Jun 5 2016 1:49 AM

Transparently 'Mission Kakatiya' works

పారదర్శకంగా ‘మిషన్ కాకతీయ’ పనులు
రాష్ట్ర ప్రత్యేకాధికారి శంకర్‌నాయక్

 
తలకొండపల్లి: మిషన్ కాకతీయ పనులను మరింత పారదర్శకంగా చేపట్టాలని మిషన్ కాకతీయ రాష్ట్ర ప్రత్యేకాధికారి శంకర్‌నాయక్ సూచించారు. మిషన్ కాకతీయ మొదటి విడతలో పనులు పూర్తిచేసిన మం డలంలోని వెల్‌జాల్ సహదేవిసముద్రం, చంద్రధనలోని నల్ల చెరువులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కట్ట మరమ్మతు పనులు, తూం లీకేజీలు, అలుగు లెవలింగ్, ఒండ్రు లేవలింగ్, పాటుకాల్వ, పంట కాల్వలతో పాటు  చెరువు పునరుద్ధరణ పనులను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండో విడత మిషన్ కాకతీయ పనుల వేగంగా జరుగుతన్నాయని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8వేల చెరువులకు సుమారు రూ.21,600 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా 7.643 చెరువులు ఉండగా 1530 చెరువులకు మిషన్ కాకతీయ నిధులు మంజూరైనట్లు చెప్పారు. రూ.200కోట్ల నిధులతో చెరువుల ఆధునికీకరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ చెరువులు పూర్తయితే సుమారు 25వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నారు.

ఫలితంగా జిల్లాల్లో హరితవిప్లవం ఏర్పడి కరువు కనుమరుగవుతుందన్నారు. ఆకలికేకల వలసల జిల్లా అన్నపూర్ణ జిల్లాగా మారనుందన్నారు. జిల్లావ్యాప్తంగా 265 టీఏంసీల నీటిని సాగునీరు అందాల్సి ఉండగా, కేవలం 100 టీఏంసీల సాగునీటిని వ్యవసాయానికి ఉపయోగించుకుంటున్నామన్నారు. చెరువుల పునరుద్ధరణతో భూగర్భజలాలు పెంపొందుతాయన్నారు. కార్యక్రమంలో ఈఈ న ర్సింగ్‌రావు, డీప్యూటీఈఈ ఆంజనేయులు, డీఈ శం కర్‌బాబు, ఏఈలు రమణ, గంగరాజు, మాజీ ఏం పీపీ శ్రీనివాసాయదవ్, కో ఆప్షన్ సభ్యులు ఖాజాపాషా, యాదయ్య, సత్యంగౌడ్, రవి  పాల్గొన్నారు.

Advertisement
Advertisement