Sakshi News home page

గుప్తనిధుల కోసం తవ్వకాలు

Published Sat, Aug 15 2015 12:16 PM

Treasure Excavations in khammam distirict

ఖమ్మం: ఖమ్మం జిల్లా నేలకొండపల్లలో గుప్తనిధుల కోసం కొందరు తవ్వకాలు జరిపారు. ఈ విషయం శనివారం వెలుగులోకి వచ్చింది. నేలకొండపల్లి మండల కేంద్రంలోని ఓ పాడబడ్డ ఇంట్లో 9 మంది గత కొన్ని రోజులుగా తవ్వకాలు జరుపుతున్నారు. స్థానికులు సమాచారంతో పోలీసులు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారంతా స్థానికులుగా పోలీసులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement