చంద్రబాబును తక్షణమే అరెస్ట్ చేయాలి | Sakshi
Sakshi News home page

చంద్రబాబును తక్షణమే అరెస్ట్ చేయాలి

Published Wed, Jun 17 2015 1:43 PM

చంద్రబాబును తక్షణమే అరెస్ట్ చేయాలి - Sakshi

హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు నాయుడును A-1 ముద్దాయిగా చేర్చాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు. ఆయన బుధవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబును తక్షణమే అరెస్ట్ చేయాలని యాదవరెడ్డి డిమాండ్ చేశారు.

 

ఈ కేసు నుంచి బయటపడేందుకు సహకరించలేదనే భావనతోనే గవర్నర్ నరసింహన్పై టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. గతంలో ఇదే గవర్నర్ను కొనసాగించాలని టీడీపీ నేతలు కోరారనే విషయాన్ని యాదవరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇరు ప్రాంతాల్లో తెలుగు ప్రజలు సంతోషంగా ఉన్నారని, చంద్రబాబే గందరగోళం సృష్టిస్తున్నారని యాదవరెడ్డి  మండిపడ్డారు.

 

Advertisement
Advertisement