వరంగల్‌ : వ్యూహాలకు పదును | Sakshi
Sakshi News home page

వరంగల్‌ : వ్యూహాలకు పదును

Published Tue, Dec 4 2018 10:12 AM

TRS Party Strategy For Elections In Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌ : జిల్లాలో ప్రజా కూటమి అభ్యర్థులు గట్టి పోటీని ఇస్తుండడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. 30 మంది ఓ టర్లకు ఒకరిని బాధ్యుడిని చేసి ప్రతిరోజు వారిని కలిసి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలని నిర్ణయిం చాలని తెలిసింది. వరంగల్‌ పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో బూత్‌కు పదిమంది బాధ్యులను పెట్టడం ద్వారా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి  పసునూరి దయాకర్‌ 4,59,092 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అదే విధానాన్ని టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో సైతం అమలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత ప్రభుత్వాన్ని రద్దు చేసి అదే రోజున పార్టీ అభ్యర్థులను ప్రకటించారు.

పరకాల నుంచి చల్లా ధర్మారెడ్డి, నర్సంపేట నుంచి పెద్ది సుదర్శన్‌రెడ్డి, వర్ధన్నపేట నుంచి అరూరి రమేశ్‌లకు టికెట్‌లు ఖరారు చేశారు. సదరు అభ్యర్థులు రెండు నెలల నుంచి తమ నియోజకవర్గాల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. వివిధ కుల సంఘాలు, ఇతరత్రా సంఘాలతో ఆత్మగౌరవ సభల పేరిట సమావేశాలు నిర్వహించి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ రాగానే ప్రజా కూటమి అభ్యర్థుల ప్రకటన నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణలు ముగిశాయి. మరో 7 రోజుల్లో ఎన్నికలు ఉండడంతో 5 రోజుల్లో ప్రచారం గడువు ముగియనుంది.

బూత్‌ స్థాయిలో ప్రత్యేక శ్రద్ధ
తాజాగా టీఆర్‌ఎస్‌ పార్టీ పోలింగ్‌ బూత్‌లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. తమ నియోజకవర్గాల్లో ఆయా గ్రామాలు, పట్టణాల్లో ఉన్న ఓటర్ల సంఖ్యను బట్టి బూత్‌ల వారీగా ఓటర్లను కలవాలని నిర్ణయించారు. గ్రామాల వారీగా, బూత్‌ల వారీగా ఓటర్ల జాబితాలను తీసుకుని బూత్‌కు పది మంది చొప్పున కమిటీని వేశారు. ఆ బూత్‌తో ఎంత మంది ఉంటే అందరిని ఆ బూత్‌ కమిటీలోని పది మందికి పంచారు. వారంతా ప్రతి రోజు ఆ ఓటరును కలిసి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నారు. ఆ సమయంలో ఓటర్ల హావభావాలు, వాళ్లు టీఆర్‌ఎస్‌ పార్టీపై అనుకులంగా ఉన్నారా, లేరా తెలుసుకుని ఏ రోజుకారోజు బూత్‌ కమిటీ ఇన్‌చార్జికి చెబుతున్నారు.

దీనిని బట్టి విజయావకాశాలపై అంచనాలు తెలుసుకుంటున్నారు. ఎక్కడైతే పార్టీ బలహీనంగా ఉందో ఆ ఆభ్యర్థి రంగంలోకి దిగి పార్టీ శ్రేణులను పెద్ద ఎత్తున మోహరింపజేసి ప్రచారం చేయాలని నిర్ణయించి ఆ మేరకు కార్యాచరణ అమలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఓటర్ల నాడిని పట్టుకునేందుకు యత్నాలు చేస్తున్నది. ఏ బూ™Œ పరిధిలో పరిస్థితులు తమకు అనుకూలంగా లేవో అక్కడ ఉండే కొందరు ఓటర్లతో మంతనాలు జరిపి పార్టీలో చేర్పించుకుంటున్నారు. ఈ విధానం కొంత మేరకు సత్ఫలితాలు ఇస్తున్నట్లు కనబడుతోంది. ఈ విధానాన్ని కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు కసరత్తు సైతం చేస్తున్నట్లు సమాచారం.

ప్రత్యేకంగా బుక్‌లు..
ఓటర్ల పేర్లు, వారి ఫోన్‌ నంబర్లను నోట్‌ చేసుకునేందుకు ప్రత్యేక బుక్‌లను తయారుచేశారు. ఆ బుక్‌ సైతం ప్యాకెట్‌లో పట్టే విధంగా రూపొందించారు. ప్రత్యేకంగా ముద్రించిన బుక్‌ బూత్‌ కమిటీ సభ్యుడి దగ్గర తన ఓటరుకు సంబంధించిన వివరాలు అన్ని వివరాలు రాసుకున్నారు. వారిని రోజు ఫాలో అప్‌ చేస్తున్నారు. ఇలా ఓటర్లను ప్రతిరోజు ఫోన్‌లోనైనా ఫాలో అప్‌ చేస్తున్నారు. ఇలా చేయడం వలన ఓటింగ్‌ శాతం సైతం పెరుగనుంది. ఇది టీఆర్‌ఎస్‌కు ఎంతో కలిసి వచ్చే అంశంగా ఉంది.

Advertisement
Advertisement