కరీంనగర్ క్రైం:
కరీంనగర్ కిసాన్‌నగర్‌కు చెందిన కైలాస్ నర్సింగరావు(27) అయినవారి చేతిలోనే హత్యకు గురయ్యాడు. అతని అత్తమామల ఆస్తిపై కన్నేసిన సమీప బంధువే పాలేర్ల చేత చంపించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ మండలం గోపాల్పూర్ గ్రామానికి చెందిన అనుముల మల్లయ్య కుమార్తె పద్మను నర్సింగరావుకు ఇచ్చి ఆగస్టు 22న వివాహం జరిపించారు.
పెళ్లి సమయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నర్సింగరావుకు, అతడి కుటుంబ సభ్యులకు ఫోన్లు చేస్తూ పెళ్లి చేసుకోవద్దని బెదిరింపులకు గురిచేశారు. అయినా నర్సింగరావు పద్మను వివాహం చేసుకున్నాడు. అనంతరం వీరు కిసాన్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈనెల 15న అనుముల మల్లయ్య వద్ద పాలేరుగా పనిచేసే స్వామి.. నర్సింగరావుకు ఫోన్ చేసి మద్యం తాగుదాం రమ్మని కోరాడు. స్వామి తనకు తెలిసిన వ్యక్తే కావడంతో ఎలాంటి అనుమానం లేకుండా అతడి వెంట బైక్‌పై వెళ్లాడు. అప్పటినుంచి నర్సింగరావు కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు పలుచోట్ల వెతికారు.
ఈ నెల 17న కరీంనగర్ త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో నర్సింగరావు అదృశ్యమైనట్టు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. నర్సింగరావు ఇంటి నుంచి వెళ్లిన సమయంలో అతడిని ఫోన్లో ఎవరు సంప్రదించారని ఫోన్‌కాల్ లిస్టును పరిశీలించారు. చివరగా నర్సింగరావుకు స్వామి ఫోన్ చేసినట్టు గుర్తించి.. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా, హత్య విషయాన్ని వెల్లడించాడు.
నర్సింగరావు ఇంట్లోంచి బయటకు వచ్చాక గాంధీనగర్‌లో మద్యం కొనుక్కుని ఇరుకుల్ల పాత బ్రిడ్జి వరకు వెళ్లామని చెప్పాడు. అక్కడ మరో పాలేరు కొమురయ్యతో కలిసి నర్సింగరావుకు మత్తుమందు కలిపిన మద్యం తాగించిన అనంతరం టవల్‌ను మెడకు బిగించి చంపి మృతదేహాన్ని ఇసుకలో పాతిపెట్టినట్టు చెప్పాడు. నర్సింగరావు బైక్‌ను సమీపంలోని బావిలో పడేసి.. ఎవరికీ అనుమానం రాకుండా గోపాల్పూర్ వెళ్లారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆదివారం హత్యాప్రదేశానికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీసి.. అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. నిందితులు స్వామిది వరంగల్ జిల్లా మొగుళ్లపల్లి మండలం హస్పెట గ్రామం కాగా, కొమురయ్యది అదే మండలం.
సూత్రధారి సమీప బంధువే..
అనుముల మల్లయ్యకు కుమారుడు, కుమార్తె సంతానం. కుమారుడు ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. వరుసకు అల్లుడైన అదే గ్రామానికి చెందిన ముస్కు రాజిరెడ్డి(45) మల్లయ్యకు చెందిన వ్యవసాయ భూములు, ఆస్తులను పర్యవేక్షిస్తున్నాడు. ఈ క్రమంలో ఆస్తిపై కన్నేసిన రాజిరెడ్డి.. మల్లయ్యకు కుమార్తె పద్మనే ఏకైక వారసురాలు కాబట్టి ఆమెను లొంగదీసుకుంటే ఆస్తిని కాజేయవచ్చని పథకం పన్నాడు. ఇదే క్రమంలో పద్మకు వచ్చిన పలు సంబంధాలను చెడగొట్టాడు.
నర్సింగరావుతో వివాహం నిశ్చయం కాగా.. దానిని నిలిపివేయాలని అతడి కుటుంబాన్ని పరోక్షంగా బెదిరింపులకు గురిచేశాడు. ఇవేమీ పట్టించుకోని నర్సింగరావు పద్మను వివాహం చేసుకున్నాడు. అప్పటినుంచి మల్లయ్య.. రాజిరెడ్డిని పక్కన పెడుతూ సొంత అల్లుడైన నర్సింగరావును దగ్గరకు తీయడం ప్రారంభించాడు.
ఆస్తి తనకు దక్కాలంటే నర్సింగరావును అడ్డు తొలగించుకోవాలని పథకం వేసిన రాజిరెడ్డి.. మల్లయ్యతోపాటు తన వద్ద పాలేర్లుగా పనిచేస్తున్న కొమురయ్య, స్వామిలతో రూ.2 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. వారికి అడ్వాన్స్‌గా రూ.90 వేలు ముట్టచెప్పి, మత్తుమందు తీసుకువచ్చి ఇచ్చాడు. ఈ మేరకు స్వామి, కొమురయ్యలు నర్సింగరావును హత్య చేశారు.
పది గంటల్లోనే ఛేదించిన పోలీసులు
17వ తేదీన మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న త్రీటౌన్ సీఐ స్వామి 18వ తేదీన మధ్యాహ్నం అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 19వ తేదీ తెల్లవారుజాము వరకే హత్య చేసిన విషయం నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పది గంటల్లోనే ఛేదించిన త్రీటౌన్ సీఐని డీఎస్పీ రవీందర్ అభినందించారు. హత్యకు పథకం వేసిన రాజిరెడ్డితోపాటు నిందితులైన స్వామి, కొమురయ్యను అదుపులోకి తీసుకున్నారు.
సంఘటన స్థలాన్ని డీఎస్పీ రవీందర్, త్రీటౌన్ సీఐ స్వామి, వన్‌టౌన్ సీఐ కరుణారావు, ఎస్సై నాగార్జురావు, రూరల్ ఎస్సై శ్రీనివాస్ పరిశీలించారు. తహశీల్దార్ జయచంద్రారెడ్డి సమక్షంలో మృతదేహానికి సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కుమారుడి మృతదేహాన్ని చూసి నర్సింగరావు తండ్రి పాండురంగారావు, సోదరులు గుండెలవిసేలా రోదించారు.
# Tag
Related news
-
Neha Hiremath murder: నేహా హత్య కేసు నిందితునికి డీఎన్ఏ పరీక్ష
హుబ్లీ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విద్యార్థిని నేహా హిరేమఠ హత్య కేసు నిందితుడు ఫయాజ్ రక్త నమూనాను సీఐడీ దర్యాప్తు అధికారులు న్యాయమూర్తి సమక్షంలో సేకరించారు. నిందితునిపై మరింత దర్యాప్తు, అతని డీఎన్ఏ పరీక్ష చేయడానికి అనుమతి కోరి సీఐడీ అధికారులు హుబ్లీ 1వ అదనపు సెషన్స్ కోర్టులో అర్జీ వేశారు. ఈ నేపథ్యంలో జడ్జి సమక్షంలో వైద్యులు ఫయాజ్ రక్త నమూనాలను సేకరించారు. హత్య జరిగిన స్థలం, హత్యకు వాడిన చాకుపై రెండు రక్తపు గ్రూప్‌లను కనుగొన్నారు. ఒక రక్త గ్రూప్ నేహాది అయితే, మరొకటి ఫయాజ్‌ది కావచ్చని, కత్తితో పొడిచేటప్పుడు అతనికి స్వల్ప గాయమై ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఐడీ దర్యాప్తు అధికారులు ఫయాజ్ డీఎన్ఏ పరీక్ష నిర్వహించడానికి చర్యలు తీసుకున్నారు. కాగా ఫయాజ్ను సీఐడీ బృందం 6 రోజుల కస్టడీకి తీసుకున్న సంగతి విదితమే. సోమవారంతో కస్టడీ గడువు ముగియనుంది. అతన్ని మరింతగా విచారించడానికి కస్టడీ గడువును పొడిగించాలని సీఐడీ అధికారులు కోర్టును కోరే అవకాశం ఉంది. -
దారుణం: ప్రియుడిపై మోజు.. భర్తను అంతమొందించిన భార్య!
సబ్బవరం: సాలాపువానిపాలెంలో ఓ యువకుడు శుక్రవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. అయితే ప్రియుడిపై మోజులో మరో ఇద్దరితో కలిసి కోడలే కడతేర్చిందని మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు చేసిన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ఘటన మండలంలోని గోటివాడ శివారు సాలాపువానిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. సీఐ పిన్నింటి రమణ శనివారం సాయంత్రం వెల్లడించిన వివరాల ప్రకారం... సాలాపు శ్రీనివాసరావు (32) దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఆరేళ్ల క్రితం దువ్వాడ సమీపంలోని మంగళపాలెంకు చెందిన భాగ్యలక్ష్మితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. ఈ నేపథ్యంలో భాగ్యలక్ష్మికి అదే గ్రామానికి చెందిన గళ్ల రవి (26)తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరగడంతోపాటు పెద్దలు వద్ద పంచాయతీ నిర్వహించడం... అనంతరం కలిసి జీవించడం జరిగేది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో సాలాపు శ్రీనివాసరావు పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి ఇంటికి వస్తుండగా... అదే గ్రామానికి చెందిన గళ్ల రవి (26), గరికిపాటి శ్రీహరి (22) కలిసి శ్రీనివాసరావును అడ్డుకుని మంచం కోడితో తలపై దాడి చేశారు. దీంతో పెద్దగా కేకలు వేయడంతో శ్రీనివాసరావు తండ్రి అప్పారావుతోపాటు గ్రామస్తులు ఘటనాస్థలికి చేరుకుని చూడగా... శ్రీనివాసరావు తీవ్ర గాయాలతో పడి వున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు సబ్బవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.అయితే అప్పటికే మృతి చెందినట్ల వైద్యులు నిర్ధారించారు. కోడలు భాగ్యలక్ష్మితోపాటు మరో ఇద్దరు వ్యక్తులు కలిసి తమ కుమారుడు శ్రీనివాసరావును హత్య చేశారని మృతుని తండ్రి అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. శ్రీనివాసరావు తలపై మంచం కోడితో దాడి చేసిన తర్వాత... సుమారు 150 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. హత్యకు పాల్పడిన గళ్ల రవి (26), గరికిపాటి శ్రీహరిని(22) అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. భార్య భాగ్యలక్ష్మిపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమణ తెలిపారు. -
అంతా బాబు జట్టే.. పచ్చ కుట్రే..
సాక్షి, అమరావతి: ‘పచ్చ’ ముఠా ముసుగు పూర్తిగా తొలగిపోయింది. చంద్రబాబు, నర్రెడ్డి సునీత, షర్మిల, పవన్ కళ్యాణ్, లోకేశ్, పురందేశ్వరి, బీటెక్ రవి అంతా ఒకే తానులో ముక్కలని తేటతెల్లమైంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వారికి కావాల్సింది రాజకీయ ప్రయోజనాలే తప్ప, అసలు హంతకులకు శిక్ష పడటం కాదన్న విషయం మరోసారి తేటతెల్లమైంది. వివేకాను రాజకీయంగా, ఆ తర్వాత భౌతికంగానూ తొలగించుకొన్న వారితో ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటకాగుతున్నారన్న విభ్రాంతికర వాస్తవం మరోసారి సాక్ష్కాత్కరించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్నందున, ఈ కేసుపై న్యాయస్థానాల్లో విచారణ జరుగుతున్నందున ఈ ఉదంతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోకూడదన్న పులివెందుల న్యాయస్థానం తీర్పును అందరూ శిరసావహిస్తారని భావించారు. కానీ, పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి ఆ తీర్పును హైకోర్టులో సవాల్ చేయడం పచ్చ కుట్రను బయటపెట్టంది. రాజకీయ జీవితంలో ఓటమి ఎరుగని నేతగా ఉన్న వివేకానందరెడ్డిని తానే ఓడించానని చంద్రబాబు నమ్మిన బంటు సీఎం రమేష్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు వివేకాను అంతమొందించే కుట్రకు ఎంత ముందుగా భూమికను సిద్ధం చేశారో అర్థమవుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వివేకా హత్యను రాజకీయంగా వాడుకోవడానికి చంద్రబాబు చాలా ముందుగానే స్క్రిప్టు సిద్ధం చేశారు. దస్తగిరి, సునీత, సౌభాగ్యమ్మ, షర్మిల.. ఇలా పలువురు పాత్రధారులు తెరపైకి వస్తూ వారికి ఇచ్చిన డైలాగులు చెబుతూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత మరింతగా విషం చిమ్మేందుకు తెగించారు. ఓటర్లను తప్పుదారి పట్టించే ఈ దుష్ప్రచారానికి అడ్డుకట్ట పడాలని, సామరస్యపూర్వక రాజకీయ వాతావరణంలో ఎన్నికలు జరగాలని వైఎస్సార్సీపీ భావించింది. పలు న్యాయస్థానాల్లో విచారణ సాగుతున్న ఈ హత్యపై ఎవరూ మాట్లాడటం సరైన విధానం కాదని కూడా అభిప్రాయపడింది. ఇదే అంశాన్ని విన్నవిస్తూ చంద్రబాబు, నర్రెడ్డి సునీత, షర్మిల, లోకేశ్, పవన్, పురందేశ్వరి, బీటెక్ రవిని ప్రతివాదులుగా చేరుస్తూ పులివెందుల న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. వైఎస్ వివేకా హత్య కేసు గురించి ఎన్నికల ప్రచారంలో మాట్లాడకుండా కట్టడి చేయాలని కోరింది. ఈ పిటిషన్లో పేర్కొన్న అంశాలతో న్యాయస్థానం ఏకీభవించింది. వైఎస్ వివేకా హత్య కేసు గురించి ఎవరూ మాట్లాడవద్దని ఈ నెల 16న తీర్పునిచ్చింది. మంచి ఉద్దేశంతో న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు అడ్డగోలు రాజకీయ ప్రయోజనాలే లక్ష్యమైన చంద్రబాబు అండ్ కోకు మింగుడు పడలేదు. దీంతో పక్కా పన్నాగంతో మొదట సునీతతో ఈ తీర్పుపై అభ్యంతరం తెలిపారు. ఆమె హైకోర్టులో ఈ తీర్పును సవాల్ చేస్తారని అందరూ భావించారు. కానీ, పులివెందుల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి హైకోర్టులో సవాల్ చేశారు. తీర్పుపై సునీత వెలిబుచ్చిన అభిప్రాయాలనే ఈ పిటిషన్లో ప్రస్తావించారు. తద్వారా అంతా చంద్రబాబు తానులో ముక్కలేనని స్పష్టం చేశారు. చంద్రబాబు కుట్రలో పాత్రధారుల ప్రవేశం ఇలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రజాక్షేత్రంలో నేరుగా ఎదుర్కొనే సత్తా లేక కుట్ర రాజకీయాలు చేస్తున్నానని చంద్రబాబు మరోసారి పరోక్షంగా చెప్పారు. 2019 మార్చి 15న వివేకా హత్యకు గురైన వెంటనే వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యంగా అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రచారంలోకి తీసుకువచ్చిన కట్టుకథను ప్రజలు ఆ ఎన్నికల్లో తిప్పికొట్టారు. ఎన్నికల తరువాత చంద్రబాబు రూటు మార్చారు. తాము చేసిన నిరాధార ఆరోపణలనే వైఎస్ వివేకా కుటుంబ సభ్యులతో చెప్పించే సరికొత్త డ్రామాకు తెరతీశారు. ముందుగా వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతతో మూడేళ్లకుపైగా డ్రామా నడిపించారు. ఆ తరువాత బాబు స్క్రిప్ట్ ప్రకారమే షర్మిలను రాష్ట్ర రాజకీయ తెరపైకి తెచ్చారు. సునీత చేస్తున్న నిరాధార ఆరోపణలనే షర్మిల కూడా వినిపిస్తున్నారు. ఇటీవల వివేకా సతీమణి సౌభాగ్యమ్మనూ తెరపైకి తెచ్చారు. వివేకా వర్ధంతి కార్యక్రమంలో సౌభాగ్యమ్మ, సునీత, షర్మిలతోపాటు టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి ఒకే వేదికపై ఆశీనులయ్యారు. వారందరి ప్రసంగాలు ఒకే రాజకీయ లక్ష్యంతో సాగడం గమనార్హం. తాజాగా పులివెందుల కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ సునీత, బీటెక్ రవి ఒకేలా చంద్రబాబు పాటనే పాడారు. వివేకా శత్రువులు, హంతకులతోనే జట్టు కట్టిన సునీత దంపతులు వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి తీరు మొదటి నుంచి అత్యంత వివాదాస్పదంగా, సందేహాస్పదంగా ఉంది. వివేకాను 2017లో రాజకీయంగా వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్సీగా ఓడించిన బీటెక్ రవి తదితరులతో వారు సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. 2017లో వైఎస్సార్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి పూర్తి మెజార్టీ ఉంది. అయినప్పటికీ, వైఎస్సార్సీపీ అభ్యర్థి వివేకాను అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి ఆదినారాయణ రెడ్డి కుట్రపూరితంగా ఓడించారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను ప్రలోభాలకు గురిచేసి బీటెక్ రవిని గెలిపించారు. వివేకాను కుట్రతో ఓడించిన ఇదే బ్యాచ్‌తో సౌభాగ్యమ్మ, సునీత దంపతులు నాలుగేళ్లుగా సన్నిహితంగా ఉండటం వివాదాస్పదంగా మారింది. సునీత ఇటీవల మీడియా సమావేశంలోనూ చంద్రబాబు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, మహాసేన రాజేశ్ తదితరులకు కృతజ్ఞతలు తెలపడం గమనార్హం. మరోవైపు వివేకాను కిరాతకంగా నరికి హత్య చేశానన్న దస్తగిరితోనూ సఖ్యతతో ఉండటం విభ్రాంతి కలిగిస్తోంది. హత్య జరిగిన రోజునా సందేహాస్పదంగా.. వైఎస్ వివేకా హత్య అనంతరం ఆయన సతీమణి సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి తీరు సందేహాస్పదంగా ఉంది. వివేకా గుండెపోటుతో చనిపోయారనే ప్రచారం వెనుక సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. 2019 మార్చి 15న ఉదయం వివేకా తలపై తీవ్ర గాయాలతో మృతిచెందారని ఆయన పీఏ కృష్ణారెడ్డి మొదటగా గుర్తించారు. ఆ వెంటనే వివేకా సతీమణి, కుమార్తె, అల్లుడికి సమాచారం ఇచ్చారు. రక్తపు మడుగులో ఉన్న వివేకా మృతదేహం ఫొటోలు తీసి వాట్సాప్ చేశారు. అయినప్పటికీ ఆయన పెద్ద బావమరిది శివప్రకాశ్‌రెడ్డి అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ఆదినారాయణరెడ్డికి ఫోన్ చేసి వివేకా గుండెపోటుతో మరణించారని చెప్పారు. అదే విషయాన్ని ఆదినారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు. దాంతో వివేకా గుండెపోటుతో మరణించారనే అసత్య సమాచారం బయటకు వచ్చింది. ఇక వివేకా రాసిన లేఖను బయటపెట్టవద్దని పీఏ కృష్ణారెడ్డిని ఆదేశించడం ద్వారా గుండెపోటుతో మరణించారన్న ప్రచారాన్ని ఆయన కుమార్తె, అల్లుడు కొనసాగించారు. ఆ లేఖను వెంటనే పోలీసులకు అప్పగించమని వారు చెప్పి ఉంటే వివేకాని హత్య చేశారన్న విషయం వెంటనే అందరికీ తెలిసేది. కానీ ఆ లేఖను ఉద్దేశపూర్వకంగానే గోప్యంగా ఉంచారు. సాయంత్రం 5 గంటలకు కృష్ణారెడ్డి లేఖ, సెల్‌ఫోన్‌ను పోలీసులకు ఇచ్చారు. లేఖను వారు ఎందుకు గోప్యంగా ఉంచారన్నది ఈ కేసులో కీలక అంశం. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారనే ప్రచారం చేసే ఉద్దేశంతోనే ఆ లేఖను బయట పెట్టకూడదని వారు నిర్ణయించారా అన్నది ఇక్కడ అందరికీ కలిగే సందేహం. -
ఇదంతా సీబీఐ, సునీత ఆడుతున్న డ్రామా
సాక్షి ప్రతినిధి, కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు సునీతక్క చెబుతోందని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి చెప్పారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు శాస్త్రీయ విధానంలో కాకుండా, పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని అన్నారు. ఇదంతా దస్తగిరిని అడ్డం పెట్టుకొని, హియర్ సే ఎవిడెన్స్ అంటూ సీబీఐ, సునీత తదితరులు కలిసి ఆడుతున్న డ్రామా అని స్పష్టం చేశారు. ఎంపీ అవినాశ్ మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అసలు దస్తగిరి అప్రూవర్‌గా మారకముందే ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. ‘వివేకా హత్య జరిగిన 40 రోజుల తర్వాత దస్తగిరి సీబీఐ ముందు వాంగ్మూలమిస్తూ అతనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. వెంటనే అతన్ని అరెస్టు చేయాలి. కానీ, సీబీఐ అతన్ని అరెస్టు చేయలేదు. పైగా, అతనికి ముందస్తు బెయిలు వచ్చేలా సీబీఐ, సునీత సహకరించారు. 2021 అక్టోబరు 21న కోర్టులో దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తే సీబీఐ అభ్యంతరం లేదని చెప్పింది. సునీత అభ్యంతరం చెప్పలేదు. ముందస్తు బెయిల్ వచ్చేంత వరకూ వేచి ఉండి, ఆ తర్వాత అప్రూవర్ వ్యవహారాన్ని తీసుకొచ్చారు. ఐపీసీ 306(4)ఏ ప్రకారం అప్రూవర్ అయితే కోర్టులో విచారణ అయ్యే వరకు బెయిల్ రాదు. కాబట్టే బెయిల్ వచ్చిన తర్వాత 306 (4)బి ప్రకారం అప్రూవర్‌గా మార్చారు. ఇక అతను జైలుకెళ్లే అవకాశం లేదు. సీబీఐ, సునీత ఈ విధానాన్ని వాడుకున్నారు. ఒకవేళ హంతకుడినని ఒప్పుకొన్న అతన్ని అరెస్టు చేసి ఉంటే జీవిత కాలం బెయిల్ వచ్చి ఉండేది కాదు. అందుకే హంతకుడినని ఒప్పుకొన్న దస్తగిరి ఒక్క రోజు కూడా జైలులో ఉండకుండా అతనికి ముందస్తు బెయిలు వచ్చేలా సహకరించి, ఆ తర్వాత అప్రూవర్ వ్యవహారాన్ని బయటకు తెచ్చారు. ఇక జీవిత కాలం ఈ కేసులో అతని అరెస్టు ఉండదని హామీ ఇచ్చి, ఈ ప్రయోజనాన్ని కల్పించినందుకు వారికి కావల్సిన పేర్లను అతనితో చెప్పించుకున్నారు. ఇదంతా డ్రామా కాదా?’ అని అవినాశ్ ప్రశ్నించారు. దస్తగిరి హియర్ సే ఎవిడెన్స్ అంటూ అప్పటి దర్యాప్తు అధికారి రామ్‌సింగ్, సునీత కలిసి కట్టుకథ అల్లారని, అందువల్లే తన తండ్రి చేయని నేరానికి ఏడాదిగా జైల్లో మగ్గుతున్నారని, రెండున్నరేళ్లు శివశంకర్‌రెడ్డి జైల్లో ఉండాల్సి వచ్చిందని తెలిపారు. గూగుల్ టేకౌట్‌కు కచ్చితత్వం ఉండదని గూగులే వెల్లడించిందని, అయినా దాని ఆధారంగా ఎందుకు దర్యాప్తు చేస్తున్నారని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్‌మేన్ రంగన్న నలుగురి పేర్లు చెప్పినప్పటికీ, వారిని దర్యాప్తు అధికారి అరెస్టు చేయలేదని, కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపి వాస్తవాలు రాబట్టలేదని తెలిపారు. సునీత అప్పుడొకలా.. ఇప్పుడొకలా.. వివేకా హత్యపై నర్రెడ్డి సునీత మొదట్లో ఒకలా, ఇప్పుడు ఒకలా మాట్లాడుతున్నారని అవినాశ్ అన్నారు. ‘2020 జూలై 20న సీబీఐకి సునీత వాంగ్మూలమిస్తూ ఆమె భర్త సెల్ఫోన్లో వివేకా రాసిన డెత్ నోట్ ఫోటో చూపించారని, అందులో మా తండ్రి డ్రైవర్ ప్రసాద్‌ను డ్యూటీకి త్వరగా రమ్మన్నానని చచ్చేలా కొట్టాడని, ఈ లెటర్ రాసేందుకు చాలా కష్టపడ్డానని, డ్రైవర్ ప్రసాద్‌ను వదిలిపెట్టవద్దని రాసి ఉన్నట్లు చెప్పింది. 2020 ఆగస్టు 27న లెటర్ గురించి ఏమీ తెలియదని, ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ చూపించారని చెబుతోంది. ఇలా నెలలోనే ఎందుకు మాట మార్చింది? హత్య జరిగిన 10 రోజులకు నాన్నగారు అవినాశ్‌ను ఎంపీని చేసేందుకు, జగనన్నను సీఎంను చేసేందుకు ఏమేమి చేయాల్నో అంతా చేశారని సునీత చెప్పింది. ఈరోజు హత్యకు ఎంపీ టికెట్ మోటివ్ అని చెబుతున్నారు. నాలుగేళ్ల తర్వాత 2023 మే31న సీబీఐ దగ్గరికి వెళ్లి అప్పట్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా చెప్పమంటే అలా చెప్పానంది. అప్పటికే 13 సార్లు సీబీఐకి వాంగ్మూలం ఇచ్చిన సునీత ఏనాడూ ఈ విషయాన్ని చెప్పలేదు. అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పమంటే.. ఇప్పుడు చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణా చెప్పమంటే చెబుతున్నారా’ అని అన్నారు. శివప్రకాష్‌రెడ్డి ఫోన్ చేస్తేనే వెళ్లాను ‘ఆ రోజు జమ్మలమడుగు వెళ్తున్న నాకు వివేకా బావమరిది నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డి ఫోన్ చేశారు. వివేకా చనిపోయినట్లు చెప్పి విలపించారు. వెంటనే ఇంటికెళ్లమన్నారు. నేను వెళ్లి డెడ్‌బాడీని చూసి బయటకు వచ్చేశాను. సీఐకి ఫోన్ చేసి త్వరగా రమ్మన్నాను. డెత్ నోట్లో ఉన్న వాస్తవ విషయాన్ని చెప్పకుండా ఘటన స్థలంలోకి నన్ను వెళ్లమని ఎందుకు చెప్పారు? లెటర్లో ఉన్న విషయం తెలిసిన వెంటనే నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఎందుకు పోలీసులకు చెప్పలేదు? ఇంక థర్డ్ పర్సన్ ఫోన్‌కాల్ కోసం వెయిటింగ్ ఎక్కడ? శివప్రకాష్‌రెడ్డి థర్డ్ పర్సనా? వివేకా చివరి రెండేళ్లు డబ్బు కోసం చాలా ఇబ్బందులు పడ్డారని పని మనుషులు వాంగ్మూలమిచ్చారు. ఆస్తి ఆమ్మే అవకాశం లేదు. చెక్ పవర్ రద్దు చేశారు. రెండో భార్య షమీమ్, అమె కుమారుడి కోసం ఇబ్బందులు పడ్డారు. డబ్బు కోసం డైమండ్స్, సెటిల్మెంట్లు అంటూ తిరగడం ఆరంభించారు’ అని తెలిపారు. మా ఇద్దర్నీ గెలిపించాలని వివేకా పిలుపు ‘నేను చేసే ప్రతి కార్యక్రమాన్నీ వివేకా బలపర్చేవారు. 2014లో వేంపల్లెలో వీధి వీధీ తిరుగుతూ జగన్నను సీఎం చేయాలని, నన్ను ఎంపీగా గెలిపించాలని కోరారు. 2019ఎన్నికల్లో చివరిరోజు కూడా ఇంటింటా ప్రచారం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను ఓడించామని చెబుతున్నారు. 854 మంది ఓటర్లలో ఒక్కరినైనా సీబీఐ విచారించిందా? మీకంటే చిన్నోడినైన నాపైన ఎందుకింత ద్వేషం’ అని ప్రశ్నించారు. వాళ్లు చెబుతున్నవన్నీ అబద్దాలే ఆరోజు రాత్రి అంతా నేను ఫోన్ వాడినట్లు సునీత చెబుతోంది. నేను ఆరోజు ఉదయం 5 గంటలకు నిద్ర లేచాను. ఫోన్ నెట్ ఆన్‌లో ఉంటే మేసేజ్‌లు వస్తుంటాయి. నానుంచి ఎవరికీ మెసేజ్ కానీ, ఫోన్‌కాల్ కానీ వెళ్లలేదు. ఎర్ర గంగిరెడ్డి నుంచి నాకు ఎలాంటి మేసేజ్ రాలేదు. అంటే వాళ్లు చెబుతున్నవన్నీ అబద్దాలే. ఎవరెన్ని అబద్దాలు చెప్పినా న్యాయమే గెలుస్తుంది. సీబీఐ ఎప్పటికైనా లెంపలేసుకోక తప్పదు. నాకు న్యాయస్థానాలపై నమ్మకం, గౌరవం ఉంది. షర్మిల, సునీత ఆరోపణలను ప్రజలు విశ్వసించరు. తాను బీజేపీకిలోకి వెళ్తాననడం ‘జోక్ ఆఫ్ ది సెంచురీ’ అని ఓ విలేకరి ప్రశ్నకు సమా«ధానంగా అవినాశ్ రెడ్డి చెప్పారు. హార్ట్ ఎటాక్ అన్నది సునీత కుటుంబం చేసిన ప్రచారమే ‘హార్ట్ ఎటాక్ అన్న విషయం సునీత కుటుంబం నుంచే ప్రచారమైంది. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సైతం అదే రోజు మీడియాతో మాట్లాడుతూ హార్ట్ ఎటాక్‌తో వివేకానందరెడ్డి చనిపోయినట్లు శివప్రకాష్‌రెడ్డి చెప్పినట్లుగా తెలిపారు. అదే విషయాన్ని వీడియో ద్వారా వివరించారు. హార్ట్ ఎటాక్ అని ఫిర్యాదు చేయాలని పీఏ కృష్ణారెడ్డికి చెప్పినట్లు సునీత చెప్పారు. డెత్‌నోట్ చదివాక కూడా హార్ట్ ఎటాక్ అని ఎందుకు చెప్పారు’ అని ప్రశ్నించారు. -
Viveka case : ఇవిగో ఆధారాలు.. ఇప్పుడేం చెబుతావు సునీత? అవినాష్ ప్రశ్నలు
సాక్షి, కడప: వివేకా కూతురు సునీత ఏ రకంగా అబద్దాల ప్రచారం చేస్తుందో.. పూర్తి వివరాలు, ఆధారాలతో బయటపెట్టారు. ఇష్టానుసారంగా బురద జల్లి.. కేసు విచారణను పక్కదోవ పట్టించేలా సునీత ఏ రకంగా ప్రయత్నిస్తుందో కడప ఎంపీ అవినాష్ రెడ్డి వివరించారు. ఈ కేసులో మాట్లాడకూడదని భావించినా.. రోజురోజుకి పెరుగుతున్న అబద్దాలను, అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ వివరణ ఇస్తున్నట్టు వెల్లడించారు. ఆయన వెల్లడించిన అంశాల్లో అతి ముఖ్యమైన అంశాలు చూద్దాం. పాయింట్ 1 : పన్నింటి రాజశేఖర్‌ను బయటకెందుకు పంపించారు? వివేకా ఇంట్లో పని చేసే వ్యక్తి పన్నింటి రాజశేఖర్. హత్యకు ఒక రోజు ముందు పన్నింటి రాజశేఖర్‌కు సౌభాగ్యమ్మ ఫోన్ చేసింది. సిబిఐ విచారణలో పన్నింటి రాజశేఖర్‌ను సుదీర్ఘంగా విచారించారు. లిఖితపూర్వకంగా పన్నింటి ఇచ్చిన స్టేట్మెంట్ను అవినాష్ చదివి వినిపించారు. పన్నింటి రాజశేఖర్‌ను సిబిఐ వాళ్లు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు.. ప్రశ్న, సమాధానాలు ఇలా ఉన్నాయి సిబిఐ : నీకు సెలవు ఎవరు మంజూరు చేశారు? పన్నింటి రాజశేఖర్ : నాకు సౌభాగ్యమ్మ సెలవు ఇచ్చింది సిబిఐ : నీవు సెలవుపై వెళ్లాలని ఎవరైనా ఒత్తిడి తెచ్చారా? పన్నింటి రాజశేఖర్ : నాకు రెండు, మూడు సార్లు సౌభాగ్యమ్మ, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఫోన్ చేశారు, తక్షణం నువ్వు కాణిపాకం వెళ్లాలని ఒత్తిడి తెచ్చారు. సరేనని నేను సెలవు తీసుకున్నా.. పన్నింటి రాజశేఖర్ : సునీల్ యాదవ్, ఉమా శంకర్, గంగిరెడ్డి ముగ్గురు కూడా వివేకానందరెడ్డికి చాలా క్లోజ్. చనిపోక ముందు వివేకాతో కలిసి ప్రయాణాలు చేసేవారు. వాళ్లకు వివేకాతో ఎంత సాన్నిహిత్యం ఉందంటే.. అంతా కలిసి తరచుగా అంటే రెండు మూడు రోజులకోసారి టేబుల్ మీద కూర్చుని భోజనాలు చేసేవారు. రెండు రోజుల ముందు కూడా వివేకాతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. అవినాష్ అభ్యంతరం : ఇంట్లో ఉన్న పన్నింటి రాజశేఖర్‌ను నర్రెడ్డి రాజశేఖర్, సౌభాగ్యమ్మ (తమ్ముడు, అక్క) ఎందుకు బయటకు పంపించారు? కాణిపాకం వెళ్లమని ఎందుకు ఒత్తిడి తెచ్చారు? వివేకానందరెడ్డికి సునీల్ యాదవ్, ఉమాశంకర్, గంగిరెడ్డి తెలియదని సునీత ఎందుకు ప్రకటనలు చేస్తోంది? ఇంట్లో కలిసి కూర్చుని బ్రేక్ ఫాస్ట్ చేసే సాన్నిహిత్యం ఉందని పని వాళ్లంతా చెబుతుండగా.. సునీత ఎందుకు మాట మారుస్తోంది? --- పాయింట్ 2 : గుండెపోటు థియరీ ఎక్కడినుంచి వచ్చింది? గుండెపోటు థియరీ గురించి సునీతతో చాలా మాట్లాడుతోంది. అసలు ఈ థియరీ ఎక్కడి నుంచి మొదలయింది. దీని గురించి వివరంగా మాట్లాడుదాం. సిట్‌కు సునీత ఇచ్చిన స్టేట్మెంట్లో స్పష్టంగా ఏమని పేర్కొన్నారంటే..! "మాకు ఉదయం కృష్ణారెడ్డి ఫోన్ చేశాడు, ఇంట్లోకి వెళ్లగానే ఏం జరిగిందో చెప్పాడు. మా నాన్న డెడ్‌బాడీ బాత్రూంలో పడి ఉంది. మా నాన్న ఒంటిపై గాయాలున్నాయని చెప్పాడు, అయితే మా నాన్నకు గతంలో గుండె సమస్య ఉంది, బహుశా గుండె పోటు వచ్చి బాత్రూంలో కింద పడి మా నాన్నకు గాయాలయ్యాయేమో అని ఊహించి ఆ విధంగా ఫిర్యాదు చేయమని కృష్ణారెడ్డికి మేం సూచించాం" అని నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి తాము ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొన్నారు. ఇది నేను చెప్పిన విషయం కాదు. సిట్‌కు సునీత ఇచ్చిన స్టేట్మెంట్. అంటే కృష్ణారెడ్డితో ఏమేం మాట్లాడారో సునీత ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే పూర్తిగా అర్థమవుతుంది. పైగా ఘటన జరిగిన వారంలోపు అంటే.. ఆలస్యం కాకుండా బయటికొచ్చే విషయాలు పక్కగా ఉంటాయని ఢిల్లీలో ప్రెస్ మీట్లో చెప్పింది సునీత. అవినాష్ పాయింట్ : గుండెపోటు కాదు, శరీరం మీద గాయాలున్నాయన్న విషయం సునీతకు అందరికంటే ముందే.. కృష్ణారెడ్డి ఫోన్ చేయగానే తెలిసింది. అయినా సునీత మధ్యాహ్నం వరకు ఈ విషయాన్ని బయటపెట్టలేదు. హైదరాబాద్ నుంచి సునీత, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, సౌభాగ్యమ్మ.. అంతా బయల్దేరి కలిసి వచ్చారు. అక్కడ లెటర్ ఉందని తెలిసి, దాన్ని దాచి పెట్టమని చెప్పి, వివేక హత్యకు గురయ్యాడన్న విసయాన్ని దాచిపెట్టింది సునీత. అందరికంటే ముందు డెడ్‌బాడీ ఫోటోలు కూడా తెప్పించుకున్నారు, అయినా పోలీసులకు చెప్పలేదు. ఉద్దేశపూర్వకంగా అసలు నిజాలను దాచిపెట్టింది సునీత, ఆమె భర్త. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం.. ఏంటంటే.. నన్ను ఇరికించే కుట్ర జరిగిందని. శివప్రకాష్ రెడ్డి..అంటే వివేకా సొంత బావమరింది నేను ఉదయం లేచి రాజకీయ పర్యటన కోసం బయటకు వెళ్తోంటే.. నాకు ఫోన్ చేసి ఏం చెప్పినాడంటే.. "బావ చనిపోయాడు.. అర్జంటుగా ఇంటికి వెళ్లాలని చెప్పాడు". అదే విషయం నేను నా వాంగ్మూలంలో చెప్పాను. నేను అదుర్తాతో వివేకానంద ఇంటికి వెళ్లగానే అక్కడ తేడా ఉందన్న విషయాన్ని గమనించి పోలీసులకు ఫోన్ చేసి చెప్పాను. అనుమానం ఉందని చెప్పాను. మరి ఉదయమే హత్య అని తెలిసినా.. సునీత గానీ, నర్రెడ్డి గానీ, శివప్రకాష్ రెడ్డి గానీ.. పోలీసులకు ఎందుకు చెప్పలేదు? పైగా ఏమి తెలియనట్టు నాకు ఫోన్ చేసి ఇంటికి వెళ్లాలని ఎందుకు చెప్పినట్టు? మీరు ఇదే అంశంలో టిడిపి నేత ఆదినారాయణ రెడ్డి ఇచ్చిన ప్రకటన చూడాలి (వీడియో క్లిప్ ప్లే చేసి వినిపించారు) సిట్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఆదినారాయణ ఏమన్నాడంటే... "మార్చి 15 నాడు నేను విజయవాడలో ఉన్నప్పుడు వివేకానందరెడ్డి బావమరిది శివప్రకాష్‌రెడ్డి ఫోన్ చేసినాడు, గుండెపోటుతో చనిపోయాడని నాకు చెప్పినాడు, ఆ రోజు మా కజిన్, కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి కూడా నాతో ఉన్నాడు. ఎందుకని నేను అడిగినప్పుడు.. ఎక్కువగా సిగరేట్లు తాగుతాడని, గుండె పోటు వచ్చి స్టంట్ కూడా వేశారని చెప్పాడు. అదే విషయాన్ని నేను మీడియాకు చెప్పాను. నన్ను దర్యాప్తులో నీకు పరమేశ్వర్ రెడ్డి తెలుసా? అంటూ రకరకాల ప్రశ్నలు వేశారు." అవినాష్ పాయింట్ : గుండెపోటు అన్న తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించిందెవరు? ఎక్కడి నుంచి మొదలయ్యిందో ఈ ఆధారాలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. --- పాయింట్ 3 : ఎంపీ టికెట్ కోసం హత్య చేశారని తప్పుడు ప్రచారం అటు సునీత, ఇటు షర్మిల.. హఠాత్తుగా రాజకీయాలను తీసుకొచ్చారు. ఏంటంటే.. కడప ఎంపీ టికెట్ కోసం హత్య జరిగిందట. ఎంపీ టికెట్ మోటివ్ అన్న దాంట్లో నిజమెంత? ఒక్కసారి జరిగిన ఘటనలను మీరే చూడండి. "తాను చనిపోయే చివరి క్షణం వరకు నా కోసం ప్రచారం చేశారు, మూడు గంటల ర్యాలీ సభలో వివేకా మాట్లాడారు. అవినాష్‌ను గెలిపించమని పది సార్లు చెప్పారు. అంతెందుకు సునీత కూడా ఢిల్లీలో ఏం మాట్లాడారు..? అవినాష్ గెలుపు కోసం వివేకా ప్రచారం చేశాడని చెప్పింది." మరి.. అప్పటికే ఎంపీ టికెట్‌ను నాకు కేటాయించారు. 2019 టికెట్ ఒక్కటే కాదు.. 2014లోనూ నేను ఎంపీగా గెలిచాను. నా కోసం వివేకానంద ప్రచారం కూడా చేశారు. మరి ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం హత్య జరిగింది అని ఎలా చెబుతారు? పైగా అప్పుడు మీ నాన్నకు ప్రత్యర్థి బీటెక్ రవి ఇప్పుడు మీకు సన్నిహితుడు అవుతాడా? మీ నాన్న మీద అక్రమంగా, అనైతికంగా గెలిచిన బీటెక్ రవి కాకుండా.. మా మీద బురద వేస్తున్నారా? కనీసం అవగాహనతో మాట్లాడుతున్నారా? మీ కోసం ఎన్నో ఎన్నికల్లో కష్టపడితే మాపై ఆరోపణలు చేస్తారా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లేసిన ఏ ఒక్కరినీ సిబిఐ ఎందుకు ప్రశ్నించలేదు? సిబిఐ దర్యాప్తులో ఇన్ని లోపాలుంటాయా? ఇక సునీత, సిబిఐ చాలా మందితో తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించారు. ఇంకా చాలా ప్రయత్నాలు జరిగాయి. లక్ష్మీదేవమ్మ, జగదీష్ రెడ్డి, లక్ష్మీ దేవి కొడుకుతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించే ప్రయత్నాలు చేశారు. శశికళ & కోతో కూడా తప్పుడు వాంగ్మూలాలు తీసుకునే ప్రయత్నాలు చేశారు. అవినాష్ రెడ్డి పేరు చెప్పాలని ఒత్తిడి తెచ్చారు. ఆ రోజు గేటు దగ్గర ఇప్పకుంట్ల వాసి ఒకరు ఉంటే.. ఆయన ఇంటికి సునీత, రాజశేఖర్ వెళ్లారు. "మా నాన్న దగ్గరి వాడివి, సిబిఐ దగ్గర వాంగ్మూలం ఇవ్వాలి, మేం చెప్పినట్టు మాత్రమే నువ్వు చెప్పాలంటూ ఒత్తిడి తెచ్చారు, ఏం చెప్పారంటే.. అవినాష్ గుండెపోటు అని చెప్పమన్నాడని నువ్వు చెప్పాలి" అని ఒత్తిడి తెచ్చారు. అవినాష్ పాయింట్ : సునీత లాంటి వాళ్లు దస్తగిరి లాంటి వారిని కూడా అప్రూవర్‌గా చేయగలరు, ఇందులో చంద్రబాబు కుట్ర, కుతంత్రాలు కావొచ్చు, అందులో భాగంగానే పస లేని విమర్శలు, కనికట్టు చేసే అబద్దాలు ఉన్నాయి. రాజకీయంగా దీన్ని ముడిపెట్టి అవినాష్‌ను లక్ష్యంగా చేసుకునేందుకు ఇంత కుట్ర చేస్తారా? గుండెపోటు అని ప్రచారం మొదలెట్టిన వాళ్లు... దాన్ని నా మీద రుద్దుతారా? పైగా ఇంటింటికి వెళ్లి నేను చెప్పమన్నారంటూ ఒత్తిడి తెస్తారా? ఈ కేసులో కోర్టులమీద నమ్మకం ఉందని, చంద్రబాబు, బీజేపీలోని టిడిపి పెద్దలు దీని వెనక ఉన్నారని విమర్శించారు అవినాష్. చంద్రబాబు చేతిలో పావులుగా మారి నన్ను, మా నాన్నను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీన్విచ్ మీన్టైంకు ఇండియన్ స్టాండర్డ్ టైంకు తేడా లేకుండా తప్పుడు ప్రకటనలు చేసిన సిబిఐ.. తర్వాత నాలుక కర్చుకుని హైకోర్టులో కౌంటర్ వేసిన విషయాన్ని గుర్తు చేశారు. READ THIS ARTICLE IN ENGLISH : YS Avinash Reddy’s Sensational Comments on Sunitha in YS Viveka’s Murder ఎంపీ అవినాష్ ప్రెస్మీట్లో ముఖ్యాంశాలు
Related News by category
-
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో కేసులో మే 1న విచారణకు రావాలని ఆదేశించింది. తన వెంట గ్యాడ్జెట్స్ తీసుకురావాలని తెలిపింది.కాగా రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా పేరుతో ఫేక్ వీడియోను కాంగ్రెస్ వైరల్ చేసింది. దీనిపై బీజేపీ, హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు చేయగా.. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేక్ వీడియో ఎవరు తయారు చేశారన్న దానిపైన స్పెషల్ సెల్ ఇంటెలిజెన్స్(IFSO) దర్యాప్తు చేస్తోంది.అయితే తెలంగాణ పీసీసీ అధికారిక ట్విటర్ హ్యాండీలో అమిత్ షా వీడియో పోస్టు చేశారు. దీంతో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌కు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఎంతోపాటు తెలంగాణ డీజీపీ, సీఎస్‌కు కూడా ఢిల్లీ నోటీసులు జారీ అయ్యాయి.కాగా దేవంతో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేయడం గురించి అమిత్ షా కామెంట్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా మాట్లాడినట్టుగా ఉంది. అయితే, అసలు వీడియోలో తెలంగాణలో ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను తొలగించాలని మాత్రమే అమిత్ షా మాట్లాడినట్టు బీజేపీ స్పష్టం చేసింది. అలాగే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయడంపై అమిత్ షా ఏమీ మాట్లాడలేదని బీజేపీ తెలిపింది -
కలిసుంటే కలదు సుఖం
పదేళ్లు కలిసి కాపురం చేసిన ఫతేనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నివాసం ఉండే శ్రీలత (పేరు మార్చాం), మురళి(పేరు మార్చాం) దంపతులు ఇటీవల కాపురంలో కలహాలు పెరగడంతో విడాకుల కోసం పోలీసులను ఆశ్రయించారు. ముగ్గుaరు పిల్లల తర్వాత భర్త మద్యానికి బానిసై, మానసికంగా శారీరకంగా హింసిస్తుండడంతో శ్రీలత భర్త నుంచి విడాకులు తీసుకోవాలని ధృడంగా నిశ్చయించుకుంది.దంపతులిద్దరికీ జీడిమెట్లలోని సీడీఈడబ్ల్యూ (సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్) సెంటర్లో అధికారులు కౌన్సిలింగ్ చేశారు. పలు దఫాల్లో సర్థిచెప్పిన తర్వాత వారి మధ్య సయోధ్య కుదిరింది. మురళిలోనూ మార్పు వచ్చింది. వారిప్పుడు సంతోషంగా కలిసి ఉంటున్నారు. లక్డీకపూల్‌లోని నీలోఫర్ ఆసుపత్రి సమీపంలో నివాసం ఉండే 43 ఏళ్ల ముంతాజ్ బేగం (పేరు మార్చాం) 2013 వరకు సెక్యూరిటీ గార్డుగా పనిచేసి ఉద్యోగం మానేశారు. 63 ఏళ్ల రిటైర్డ్ ఇంజినీర్ ఖలీల్ (పేరు మార్చాం)ను రెండో వివాహం చేసుకున్నారు. లాక్డౌన్ ముందు వరకు ముంతాజ్‌ను బాగానే చూసుకున్న ఖలీల్ ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో ఆమెను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెట్టడం మొద లు పెట్టాడు. తన బతుకుతెరువుకు సైతం డబ్బు ఇవ్వకపోవడంతో బషీర్‌బాగ్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు నాంపల్లి సీడీఈడబ్ల్యూ సెంటర్లో దంపతులకు కౌన్సిలింగ్ చేయడంతో ఖలీల్‌లో మార్పు వచ్చింది. ఇప్పుడు వారిద్దరూ కలిసి ఉంటున్నారు. కొద్దిపాటి మనస్పర్థలు కాపురాలు కూల్చేస్తున్నాయి. ఇక మద్యం మహమ్మారి దంపతుల మధ్య గొడవలకు మరింత ఆజ్యం పోస్తోంది. దంపతుల్లో ఒకరిపై ఒకరికి నమ్మకం సన్నగిల్లడంతో అనుమానం పెనుభూతమవుతోంది. దీంతో వివాహబంధాన్ని తెంచుకోవాలన్న కఠిన నిర్ణయానికి వస్తున్నారు. విడాకుల కోసం కోర్టు మెట్లు తొక్కుతూ ఏళ్లపాటు వ్యక్తిగత జీవితాలు బలిపెట్టుకుంటున్నారు కొందరు. ఈ నేపథ్యంలో బలమైన కారణం లేకుండానే వివాహ బంధాలను బలి చేసుకోకుండా, కొద్దిపాటి సర్దుబాట్లతో కాపురం తిరిగి కాపురాలు నిలబడేలా తెలంగాణ పోలీసులు ప్రయvస్తున్నారు. కుటుంబ కలహాలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే జంటలకు ప్రాథమికంగా కౌన్సెలింగ్ ఇచ్చేందుకు దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీస్‌శాఖలోని మహిళా భద్రత విభాగం అధికారులు సీడీఈడబ్ల్యూ సెంటర్లు అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో కలిపి మొత్తం 27 కౌన్సిలింగ్ సెంటర్లను నెలకొల్పారు. 2023 ఫిబ్రవరి నుంచి ఈ సెంటర్లు పనిచేస్తున్నాయి. వీటిల్లో గృహహింస కేసుల్లో బాధిత మహిళలు, వారి భర్తలు, అవసరం మేరకు ఇతర కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తూ సమస్యల పరిష్కారానికి బాటలు వేస్తున్నారు. ఇలా పోలీసులను ఆశ్రయించిన జంటల్లో 42 శాతం మందిని తిరిగి కలిపినట్టు మహిళా భద్రత విభాగం ఉన్నతాధికారులు తెలిపారు. మరో 29 శాతం మంది మాత్రం విడాకులు తీసుకునేందుకే నిశ్చయించుకున్నారు. 2023 ఫిబ్రవరి నుంచి 27 కౌన్సిలింగ్ సెంటర్ల పరిధిలో ఏప్రిల్ 26 నాటికి మొత్తం 7,474 ఫిర్యాదులు నమోదైనట్టు వారు వెల్లడించారు. మొత్తం అందిన ఫిర్యాదుల్లో 853 మంది బాధితుల్లో ఆత్మహత్యలు చేసుకునే మానసిక స్థితి ఉండడంతో వారిని మానసిక నిపుణులైన కౌన్సిలర్ల వద్దకు పంపి వారిలో తిరిగి స్థైర్యాన్ని నింపేలా కౌన్సిలింగ్ ఇప్పించినట్టు అధికారులు తెలిపారు. మొత్తం అందిన 7,474 ఫిర్యాదుల్లో 6,600 కేసులలో పరిష్కారం లభించినట్టు తెలిపారు.ఏమిటీ సీడీఈడబ్ల్యూ సెంటర్లుగృహ హింస కేసుల్లో దంపతులు విడాకులు తీసుకోకుండా, సమస్యను గుర్తించి.. వారికి అర్థమయ్యేలా సర్దుబాటు చేసి తిరిగి కలిపేందుకు తెలంగాణ పోలీస్‌శాఖ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో సేఫ్ సిటీ ప్రాజెక్టు నిధులతో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇందులో ఒక మహిళా కౌన్సెలర్, మహిళా సిబ్బంది ఉంటారు. వీరు గృహహింసకు సంబంధించి వివిధ పోలీస్ స్టేషన్లకు వచ్చే జంటలకు, అవసరం మేరకు వారి కుటుంబ సభ్యులకు పలు దశల్లో కౌన్సిలింగ్ నిర్వహించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. - సాక్షి, హైదరాబాద్ -
అసమానతలు తొలగేదాకా రిజర్వేషన్లు
బడంగ్పేట్: సమాజంలో అసమానతలు ఉన్నంతకాలం రిజర్వేషన్లు యథావిధిగా ఉంటాయని ఆర్ఎస్ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. మొదటి నుంచీ రిజర్వేషన్లకు సంఘ్ అనుకూలంగా ఉందని వెల్లడించారు. తమ సంస్థ రిజర్వేషన్లకు వ్యతిరేకమంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని... అందులో ఏమాత్రం వాస్తవం లేదని ప్రకటించారు. తాను ఓ సమావేశంలో ఆ వ్యాఖ్యలు చేసినట్లు వీడియోను ప్రచారం చేస్తున్నారని.. కానీ అసలు అలాంటి సమావేశం ఏదీ జరగలేదని వివరించారు. ప్రస్తుతమున్న సాంకేతికత, కృత్రిమ మేథ (ఏఐ) ద్వారా జరగని దాన్ని కూడా జరిగినట్లు చూపించడం సాధమవుతోందని వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గుల్లో ఏర్పాటు చేసిన విద్యాభారతి విజ్ఞాన కేంద్ర పాఠశాల (సరస్వతి విద్యాపీఠం అనుబంధ సంస్థ)ను ఆదివారం ఆయన చినజీయర్ స్వామితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహన్ భాగవత్ మాట్లాడారు. ప్రపంచాన్ని తెలుసుకొనే మార్గంగా విద్యను ఆయన అభివరి్ణంచారు. 1952లో సరస్వతీ శిశుమందిర్ చిన్న గదిలో ప్రారంభమైందని.. నేడు దేశవ్యాప్తంగా వేలాది పాఠ శాలలు నడుస్తున్నాయని చెప్పా రు. దేశభక్తి విలువలతో కూడిన విద్యకు తాము పెద్దపీట వేస్తున్నామన్నారు. మనమంతా రాముడి బాటలో నడవాలన్నారు. సోషల్ మీడియాను మంచి కోసం ఉపయోగించాలని సూచించారు. స్వయం సేవక్‌లు చివరి శ్వాస దాకా సమాజం కోసం పనిచేస్తారని మోహన్ భాగవత్ తెలిపారు. మోదీ కృషి అభినందనీయం: చినజీయర్ దేశం సమస్యల్లో ఉన్నప్పుడు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారని చినజియర్ స్వామి కొనియాడారు. భారత్‌ను విశ్వగురువుగా మార్చేందుకు ఆయన ఎనలేని కృషి చేస్తున్నారని ప్రశంసించారు. తాను రాజకీయ నాయకుడిని కాదని.. కేవలం భారతీయుడిగా తన వాదన వినిపిస్తున్నానని చెప్పారు. విద్య అనేది పొట్టకూటి కోసం కాదని.. సక్రమమైన పౌరులుగా తయారయ్యేందుకేనని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్, క్షేత్ర ప్రచారక్ సు«దీర్, సహ ప్రచారక్ భరత్, ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్, విద్యాభారతి క్షేత్ర అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, సంఘటన కార్యదర్శి లింగం సు«ధాకర్‌రెడ్డి, శ్రీనివాస్, రమే‹Ùగుప్తా, విష్ణువర్దన్రాజు తదితరులు పాల్గొన్నారు. -
నిప్పులు కక్కుతున్న సూరీడు
సాక్షి, హైదరాబాద్: సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. ఆదివారం రాష్ట్రంలో చాలాచోట్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఆదివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. భద్రాచలంలో గరిష్టంగా 43.8 డిగ్రీల సెల్సియస్, మెదక్‌లో 24.5 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 41.5 డిగ్రీల సెల్సియస్‌కు మించి నమోదయ్యాయి. ఖమ్మంలో సాధారణం కంటే 4.6 డిగ్రీల సెల్సియస్, భద్రాచలంలో 3.7 డిగ్రీల సెల్సియస్ అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, మిగతా ప్రాంతాల్లో 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రజలు బయటకు రాకపోవడమే మంచిదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సూచనలు జారీ చేసింది. రాష్ట్రంలో రానున్న రెండురోజులు పలుచోట్ల వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట్లకు ఈనెల 29 నుంచి మే 1వ తేదీ వరకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. ఆయా జిల్లాల్లోని పలుప్రాంతాల్లో వడగాల్పులు తీవ్రస్థాయిలో ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రణాళికా శాఖ ప్రకారం 45 డిగ్రీలపైనే.. ప్రణాళికా శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని చాలాచోట్ల ఉష్ణోగ్రతలు అత్యధికంగానే నమోదయ్యాయి. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లిలో 45.4, ములుగు జిల్లా మంగపేటలో 45.3, భద్రాద్రి కొత్తగుడెం జిల్లా అశ్వాపురంలో 45.2 డిగ్రీల సెల్సియస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. -
ఇంటర్సిటీల మధ్య వందే మెట్రోలు!
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ మార్గాల్లోనే!హైదరాబాద్ నుంచి నల్లగొండ మీదుగా గుంటూరు, సికింద్రాబాద్ నుంచి పెద్దపల్లి మీదుగా కరీంనగర్, సికింద్రాబాద్–కర్నూలు, కాచిగూడ–కర్నూలు, సికింద్రాబాద్–నాందేడ్, సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్, సికింద్రాబాద్ నుంచి వికారాబాద్ మీదుగా రాయచూర్ తదితర ప్రాంతాలకు ఈ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మొదట ప్రయాణికుల రద్దీ అత్యధికంగా ఉన్న సికింద్రాబాద్–గుంటూరు, సికింద్రాబాద్–విజయవాడ వంటి రూట్లలో వందే మెట్రోలను ప్రవేశపెట్టొచ్చు. అనంతరం దశలవారీగా ఇతర మార్గాలకు విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యమైన స్టేషన్లలోనే హాల్టింగ్.. వందే మెట్రో రైళ్లు ప్రస్తుతం హైదరాబాద్‌లో నడుస్తున్న మెట్రో రైళ్ల తరహాలోనే ఉంటాయి. మొదట 12 కోచ్‌లతో ప్రారంభించి డిమాండ్‌కు అనుగుణంగా ఆ తరువాత 16 కోచ్‌ల వరకు పెంచనున్నారు. మెట్రో రైళ్ల తరహాలోనే పూర్తిగా ఏసీ సదుపాయం, ఆటోమేటిక్‌గా తలుపులు తెరుచుకొని మూసుకొనే ఏర్పాటు ఉంటుంది. ప్రారంభ స్టేషన్ నుంచి గమ్యస్థానం వరకు ముఖ్యమైన స్టేషన్లలోనే ఈ రైళ్లకు హాల్టింగ్ సదుపాయం ఉండనుంది. ప్రస్తుతం పుష్పుల్ రైళ్లకు ఉన్నట్లుగానే ముందు, వెనుక రెండు ఇంజన్లు ఉంటాయి. దీంతో ఈ రైళ్లను ప్రత్యేకంగా పిట్ లైన్లకు తరలించాల్సిన అవసరంలేదు. తక్కువ సమయంలోనే తిరుగు ప్రయాణ సేవలను అందించే అవకాశం ఉంటుంది. రిజర్వేషన్లు ఉండవు... ఈ రైళ్లన్నీ సాధారణ రైళ్ల తరహాలోనే సేవలు అందిస్తాయి. దీంతో ప్రయాణికులు అప్పటికప్పుడు టికెట్లు కొనుక్కొని బయలుదేరొచ్చు. కూర్చొని ప్రయాణం చేసేందుకు వీలుగా సీట్లు ఉంటాయి. అయితే ప్రస్తుతం ఉన్న రైళ్ల కంటే వీటిలో కొద్దిగా టికెట్ ధరలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకోవాలనుకొనే వారికి ఈ రైళ్లలో ప్రయాణం లాభదాయకం. వివిధ మార్గాల్లో నడిచే ఇంటర్ సిటీ రైళ్ల స్థానంలోనే వందే మెట్రోలు రానున్నాయి. అయితే ప్రస్తుతం సికింద్రాబాద్–విజయవాడ మధ్య నడుస్తున్న ఇంటర్సిటీ ట్రైన్ యథాతథంగా సేవలను కొనసాగించనుంది.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
శబరి మూవీ.. వరలక్ష్మి శరత్‌కుమార్‌పై డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్!
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్‌కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్‌నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement