Sakshi News home page

అయ్యో.. రైతన్నా..!

Published Fri, Apr 3 2015 4:41 AM

two farmers suicide

♦ పొలంలోనే నెలకొరిగారు
♦ జగిత్యాల మండలంలో ఇద్దరు రైతుల ఆత్మహత్య
♦ చల్‌గల్‌లో కోల నాగయ్య,బాలెపల్లిలో బేతి సుధాకర్‌రెడ్డి
♦ ఉసురుతీసిన పంటనష్టం, అప్పులబాధలు
♦ రూ.5లక్షల పరిహారం ఇవ్వాలి ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి డిమాండ్

 
వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయూరుు. వ్యవసాయ బావులు, బోర్లు అడుగంటిపోయూరుు. రబీలో సాగు చేసిన పంటలు నీళ్లందక కళ్లముందే ఎండిపోతున్నారుు. దిగుబడి చేతికొచ్చే పరిస్థితి లేదు. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక, కుటుంబాలను పోషించుకునే దారి కనపడక  జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పంటలకు వేసేందుకు తెచ్చిన క్రిమిసంహారక మందును తామే తాగి ప్రాణాలు తీసుకున్నారు. అన్నం పెడుతుందని ఆశించిన పొలంలోనే విగతజీవులుగా నేలకొరిగారు.

జగిత్యాల జోన్ : జగిత్యాల మండలానికి చెందిన ఇద్దరు రైతులు ఒకేరోజు, దాదాపుగా ఒకే సమయంలో, ఒకే తీరుగా బలవన్మరణాలకు పాల్పడడం విషాదాన్ని నింపింది. చల్‌గల్ గ్రామానికి చెందిన కోల నాగయ్య(48) అనే రైతు తనకున్న ఇరవై గుంటల భూమితో పాటు రెండు ఎకరాల భూమి కౌలుకు తీసుకొని వరి పంట సాగు చేశాడు.

పంట గింజ దశకు చేరుకున్న సమయంలో నీరు అడుగంటడంతో పొలం ఎండిపోరుుంది. పెట్టుబడులు, బిడ్డల పెళ్లిళ్ల కోసం రూ.5లక్షల దాకా అప్పు చేశాడు. పంట ఎండిపోవడంతో అప్పులు ఎలా తీర్చాలని మనస్తాపం చెందాడు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో పొలం వద్దకు వెళ్లి క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి భార్య లక్ష్మి, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

ఇదే మండలం బాలెపల్లికి చెందిన బేతి సుధాకర్‌రెడ్డి(40) నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాడు. ఇటీవల భూగర్భ జలాలు అడుగంటిపోయూరుు. కళ్లముందే పంట ఎండిపోతుండడంతో మనస్తాపం చెందాడు. ఇతడు సైతం బుధవారం రాత్రి మొక్కజొన్న చేను వద్దకు వెళ్లి క్రిమిసంహారక ముందు తాగి ప్రాణం విడిచాడు. అంతకుముందే బిడ్డ పెళ్లి చేయడం, ఇల్లు కట్టుకోవడం, పంట పెట్టుబడులు పెరగడం వంటి కారణాలతో దాదాపు రూ.10 లక్షలు అప్పు చేశాడు.

ఇతనికి భార్య రాజవ్వ, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. బాధిత కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం అదుకునేలా ప్రయత్నిస్తానని భరోసా ఇచ్చారు.

రూ.5లక్షల పరిహారం ఇవ్వాలి  

సారంగాపూర్: వ్యవసాయ రంగంలో ఏర్పడ్డ సంక్షోభం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని లక్ష్మీదేవిపల్లిలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. జగిత్యాల మండలంలో ఒకే రోజు ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకోవడం కలిచివేసిందన్నారు. గత కాంగ్రెస్ సర్కారు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.1.50 లక్షల ప్రత్యేక అందించి ఆదుకుందని గుర్తుచేశారు.

ప్రస్తుతం బాధిత కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 464 మండలాలకు 353 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, సాగు, తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కొల్ముల శారద, జెడ్పీటీసీ సభ్యురాలు భూక్య సరళ, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు కోండ్ర రాంచంద్రారెడ్డి, సర్పంచ్ కంచెర్ల శ్యామల, ఎంపీటీసీ సభ్యురాలు నల్ల సత్తెమ్మ, సింగిల్‌విండో చైర్మన్ ముప్పాల రాంచందర్‌రావు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement