నగర పీఠంపై నరేంద్రుడు | Sakshi
Sakshi News home page

నగర పీఠంపై నరేంద్రుడు

Published Wed, Mar 16 2016 2:21 AM

నగర పీఠంపై  నరేంద్రుడు - Sakshi

మేయర్‌గా ఏకగ్రీవ ఎన్నిక
{పతిపాదించిన కోరబోయిన సాంబయ్య
బలపరిచిన కేడల పద్మ
డిప్యూటీ మేయర్‌గా సిరాజొద్దిన్
సీపీఎం, బీజేపీ కార్పొరేటర్ల వాకౌట్

 
వరంగల్ : వరంగల్ మహా నగరపాలక సంస్థ ప్రథమ పౌరుడి(మేయర్)గా నన్నపునేని నరేందర్, డిప్యూటీ మేయర్‌గా ఖాజా సిరాజొద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వరంగల్‌లోని మహా నగరపాలక సంస్థ(జీడబ్ల్యూఎంసీ) కార్యాలయ ఆవరణలో మంగళవారం ఎన్నిక ప్రక్రియ జరిగింది. గ్రేటర్ వరంగల్ పాలకవర్గ ఎన్నిక కోసం ఇన్‌చార్జి కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ ప్రిసైడింగ్  అధికారిగా వ్యవహరించారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకా రం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ల కోసం జీడబ్ల్యూఎంసీ కమిషన్ సర్ఫరాజ్ అ హ్మద్ మంగళవారం ప్రత్యేకం గా సమావేశం ఏర్పాటుచేశారు. మొద ట 58మంది కార్పొరేటర్లు తెలుగు అక్షరాల వరుస ప్రకారం ప్రమాణ స్వీకా రం చేశారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ మొ దలైంది. ఈ ప్రక్రియ మొదలుకాగా నే బీజేపీ కార్పొరేటర్ చాడ స్వాతి(45వ డివిజన్), సీపీఎం కార్పొరేటర్ సోమిశెట్టి శ్రీలత(9వ డివిజన్)లు సమావేశం నుంచి వెళ్లిపోయారు. టీఆర్‌ఎస్ అధిష్టానం 19వ డివిజన్ కార్పొరేటర్ నన్నపునేని నరేందర్‌ను పార్టీ తరఫున మే యర్ అభ్యర్థిగా ఖరారు చేసింది.

వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 37వ డివిజన్ కార్పొరేటర్ కోరబోయిన సాం బయ్య మాట్లాడుతూ... నన్నపునేని నరేందర్‌ను మేయర్ అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని ఏడో డివిజన్ కార్పొరేటర్ కేడల పద్మ.. నరేందర్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నట్లు చెప్పా రు. ఇతరులు ఎవరూ మేయర్ పదవికి పోటీ చేయకపోవడంతో నన్నపునేని నరేందర్ మేయర్‌గా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రకటించారు. మేయర్ ఎన్నికకు సం బంధించిన ధ్రువీకరణ పత్రాన్ని నరేం దర్‌కు అందజేశారు. వెంటనే నన్నపునేని అనుచరులు కార్పొరేషన్ కార్యాలయం బయట భారీగా బాణా సంచా కాల్పి సంబరాలు చేశారు.
 
డిప్యూటీ మేయర్‌గా సిరాజొద్దీన్
మేయర్ ఎన్నిక తరహాలోనే డిప్యూటీ మేయర్ ఎన్నిక మొదలైంది. టీఆర్‌ఎస్ అధిష్టానం ఖరారు చేసిన 41 డివిజన్ కార్పొరేటర్ ఖాజాసిరాజొద్దీన్‌ను డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నట్లు 26వ డివిజన్ కార్పొరేటర్ ప్రకాశ్‌రావు చెప్పారు. 32వ డివిజన్ కార్పొరేటర్ అరుణ.. ఖాజా సిరాజొద్దీ న్ అభ్యర్థిత్వా న్ని బలపరిచారు. డిప్యూటీ మేయర్‌గా వేరొక అ భ్యర్థి ఎవరూ పోటీలో లేకపోవడంతో ఖాజా సిరాజొద్దీ న్ ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రశాంత్‌జీవన్ పా టి ల్ ప్రకటించారు. ఈ రెండు ఎన్నికలు పూర్తి కాగానే సమావేశం ముగిసినట్లుగా అధికారులు ప్రకటించారు. ఎన్నికల పరిశీలకుడిగా విజయ్‌కుమార్ వ్యవహరించారు.
 
అభినందనలు...

జీడబ్ల్యూఎంసీ మేయర్‌గా నన్నపునేని, డిప్యూటీ మే యర్‌గా ఖాజా సిరాజొద్దీన్ లు ఎన్నిక కాగానే ఉప ముఖ్యమంత్రి క డియం శ్రీహరి, ఎంపీలు పసునూరి ద యాకర్, గుండు సుధారాణి, ఎమ్మెల్యే లు వినయ్‌భాస్కర్, అరూరి రమేశ్, కొండా సురేఖ, చల్లా ధర్మారెడ్డి, టి.రాజయ్యలతో పాటు కార్పొరేటర్లు వీరిద్ద రిని అభినందించారు. అనంతరం మే యర్, డిప్యూటీ మేయర్ అనుచరులు విజయోత్సాహంతో ర్యాలీగా వెళ్లారు.  
 
 
కేసీఆర్‌కు ధన్యవాదాలు
సామాన్య కార్యకర్తగా ఉన్న నన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ నగర మేయర్ అయ్యేలా చేశారు. మేయర్ పదవితో గొప్ప అవకాశం ఇచ్చిన కేసీఆర్‌కు ధన్యవాదాలు. నా జీవితాంతం కేసీఆర్‌కు రుణపడి ఉంటా. కొత్త పాలకవర్గం ఆధ్వర్యంలో వరంగల్ నగర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తా. నీతి, నిజాయితీతో పాలన అందిస్తా. కార్పొరేటర్లతో సమన్వయం చేసుకుని నగర సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తా. నేను మేయర్‌గా ఎన్నిక అయ్యేందుకు సహకరించిన టీఆర్‌ఎస్ ముఖ్య నేతలు కె.టి.రామారావు, టి.హరీశ్‌రావుకు కృతజ్ఞతలు. జిల్లా ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ నాయకులకు ధన్యవాదాలు.
 
 - నన్నపునేని నరేందర్, మేయర్
 

Advertisement
Advertisement