కేసీఆర్‌వి దిగజారుడు మాటలు | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌వి దిగజారుడు మాటలు

Published Sun, May 8 2016 3:34 AM

కేసీఆర్‌వి దిగజారుడు మాటలు - Sakshi

వెంకటరెడ్డి మరణిస్తే అదృష్టం కలిసొచ్చినట్లా..?: ఉత్తమ్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘మానవత్వంతో పాలేరులో సుచరితారెడ్డిని ఏకగ్రీవం చేయాలని అన్ని పార్టీలను కోరాం. ఇందుకు వైఎస్సార్‌సీపీ, టీడీ పీ ముందుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. సంప్రదాయానికి తిలోదకాలిచ్చి ఎమ్మె ల్సీ, మంత్రిగా ఉన్న తుమ్మలను పోటీలోకి దించారు. కేసీఆర్, టీఆర్‌ఎస్ పెద్దలకు మానవత్వం లేదు. సీఎం ఖమ్మం సభలో మాట్లాడు తూ.. అదృష్టం కలిసొస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడన్నారు. అంటే 50 ఏళ్లకు పైగా ప్రజాజీవి తంలో ఉన్న వెంకటరెడ్డి కేన్సర్‌తో మరణిస్తే.. అదృష్టం కలిసొచ్చినట్లా?

ఇంత దిగజారుడుగా ముఖ్యమంత్రి మాట్లాడతారా?’ అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మంలోని డీసీసీ కార్యాలయంలో శని వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో  ఏ ప్రభుత్వం ఉన్నా ఎమ్మెల్యేలకు వైద్య చికిత్స కోసం రూ.లక్షలు, రూ.కోట్లలో రీయింబర్స్‌మెం ట్ చేశాయన్నారు. రాంరెడ్డి వెంకటరెడ్డి చికిత్స కోసం టీఆర్‌ఎస్ పార్టీ జేబు నుంచి డబ్బు ఇవ్వలేదన్నారు.

తాను సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నం దున హుజూర్‌నగర్‌లో పోటీ చేశానని అన్నారు.  తెలంగాణ ఉద్యమాన్ని, రాష్ట్రాన్ని వ్యతిరేకించిన తుమ్మలకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి.. మంత్రిని చేశారని, అయితే ఓడిపోయిన శ్రీకాం తాచారి తల్లికి పదవి ఎందుకు ఇవ్వలేదని ఉత్తమ్ ప్రశ్నిం చారు. సమావేశంలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement