'ప్రాణహిత'ను తరలిస్తే కేసీఆర్‌పై తిరుగుబాటే..! | Sakshi
Sakshi News home page

'ప్రాణహిత'ను తరలిస్తే కేసీఆర్‌పై తిరుగుబాటే..!

Published Tue, Jul 21 2015 12:11 PM

uttam kumar reddy fires on kcr regarding praanahitha shifting praposal

  •   ఏ ఒక్క వాగ్దానం అమలు చేయని సీఎం
  •   టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
  •   తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దే..
  • ఆదిలాబాద్(ఇంద్రవెల్లి): తెలంగాణను సస్యశ్యామలం చేసే ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరానికి తరలించే ప్రయత్నం చేస్తే సీఎం కేసీఆర్‌పై జిల్లా ప్రజలు తిరగబడడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తంకుమార్‌రెడ్డి హెచ్చరించారు. వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరుతున్న సందర్భంగా ఇంద్రవెల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సమావేశానికి ఉత్తం హాజరయ్యారు. ఈ మేరకు తొలుత నాయకులు స్వాగతం పలకగా ముత్నూర్ గ్రా మంలోని కొమురం భీం విగ్రహం, అమరవీరు ల స్తూపం, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి వద్ద నివాళులర్పించారు. ఆ తర్వాత అంబేద్కర్ చౌక్ నుండి వ్యవసాయ మార్కెట్ వరకు శోభాయాత్ర నిర్వహించారు. మధ్యలో పంచాయతీ కార్మికుల దీక్షా శిబిరాన్ని ఉత్తంకుమార్‌రెడ్డితో పాటు ఆ పార్టీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. అనంతరం మాజీ ఎంపీ పీ కనక తుకారంతో పాటు లీగల్ సెల్ చైర్మన్ సంజీవ్‌రెడ్డి, న్యాయవాదులు ఆశోక్, భవ్‌రావ్, విజయ్‌కుమార్ కాంగ్రెస్‌లో వారికి ఉత్తంకుమార్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
     తెలంగాణ ఇచ్చిన ఘనత మాదే..
     తెలంగాణ తెచ్చిన ఘనత తనదేనని సీఎం కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తంకుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని రాష్ర్టం లో ఎవరిని అడిగినా చెబుతారని తెలిపా రు. ఈ విషయాన్ని కేసీఆర్ గుర్తించాలని సూచించారు. ఎన్నికలకు ముందు 44 వాగ్దానాలు చేసిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన 14నెలల కాలంలో ఏ ఒక్కటి అమలుచేయలేదని విమర్శించారు. అప్పటి సీఎం రోశయ్య ప్రారంభించిన జైపూర్ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టునే మళ్లీ ప్రారంభించడం సిగ్గుచేటన్నారు. భూమి లేని గిరిజనులకు మూ డెకరాల భూమి ఇస్తానన్న హామీని నెరవేర్చకపోగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన లక్ష ఎకరాల భూమిని లాక్కునేందుకు కేసీఆర్ కుట్ర పన్నారని ఉత్తంకుమార్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణలో ఇప్పటి వరకు 900 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటే.. ఏ ఒక్క కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు. సమావేశంలో కాంగ్రె స్ జిల్లా అధ్యక్షుడు మహేశ్వరెడ్డి, మాజీ మంత్రి వినోద్, మాజీ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, నారాయణ్ పటేల్, వతో పాటు నాయకులు నరేష్ జాదవ్, హరినాయక్, భార్గవ్‌దేశ్ పాండే, గాం డ్రాత్ సుజాత, ప్రేమలత, మెస్రాం నాగ్‌నాథ్, జాదవ్ జమున,  సిడాం భీంరావ్, ఆర్క ఖమ్ము, గణేష్, మోహన్, వెంకట్ సోమసే, నాగోరావ్ పోమోరే, ఈర్శాద్, ఫరూఖ్ పాల్గొన్నారు.
     ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి
     ఇచ్చోడ : ఏడాది పాలనలో ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చని టీఆర్‌ఎస్ వైఫల్యాలను కాంగ్రెస్ నా యకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తంకూమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రానికి సోమవారం వచ్చి న ఆయన పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. అనంతరం మహిముద్ ఖాన్ ఆధ్వర్యంలో నాయకులు ఆయనను సన్మానించారు. ఆ తర్వాత ఉత్తంకుమార్‌రెడ్డి విలేకరులతో మా ట్లాడుతూ ఇరవై రోజులుగా గ్రామపంచాయతీ ఉద్యోగులు సమ్మె చేస్తున్నా పట్టించుకోకపోవ డం సరికాదన్నారు. ఈ సందర్భంగా వినతిపత్రం అందజేసిన కార్మికులతో ఆయన మాట్లాడుతూ పార్టీ తరఫున అండగా నిలుస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డితో పాటు రాంచంద్రారెడ్డి, గడ్డం వినోద్, నరేష్‌జాదవ్, నారాయణరావు పటేల్, అనిల్‌జాదవ్, కుంర కోటేశ్వర్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement