నీటా.. అధికరణం 371–డీనా? | Sakshi
Sakshi News home page

నీటా.. అధికరణం 371–డీనా?

Published Thu, Aug 24 2017 1:21 AM

verdict on article 371D quota seats today

హెల్త్‌ వర్సిటీల సూపర్‌ స్పెషాలిటీ సీట్ల భర్తీపై నేడు హైకోర్టు తీర్పు
సాక్షి, హైదరాబాద్‌: కాళోజీ నారాయణరావు, ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయాల పరిధిలోని డీఎం, ఎంసీహెచ్‌ సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల సీట్ల భర్తీపై దాఖలైన కేసులో హైకోర్టు తన తీర్పును గురువారం నాటికి వాయిదా వేసింది. నీట్‌ సీట్ల భర్తీపై సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నందు న ఈ అంశంపై గురువారం తమ తీర్పును వెల్లడిస్తామని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్ర మణియన్, జస్టిస్‌ టి.రజనీలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది.

371–డి అధికరణ ప్రకారం 85 శాతం సీట్లను రాష్ట్ర అభ్యర్థుల (స్థానికుల)తో భర్తీ చేయాలని ఉండగా.. కేంద్ర ప్రభుత్వం జాతీయ కౌన్సెలింగ్‌ ద్వారా సీట్లను భర్తీ చేయాలని ఉత్తర్వు లిచ్చింది. అయితే దీనిని వ్యతి రేకిస్తూ వైద్యుడు బి.సతీశ్‌ కుమార్, మరో 12 మంది రిట్‌ పిటిషన్లు దాఖలు చేశారు.  ఏపీ, తెలంగాణ అభ్యర్థులకు నీట్‌ కింద కేటాయించిన సీట్లను ఇతర రాష్ట్రాలు ఇవ్వకపోవడంపై కూడా మరికొందరు విద్యార్థులు పిటిషన్లు దాఖలు చేశారు. 85% సీట్లను స్థానికులతో భర్తీ చేయాలని, మిగిలిన 15% సీట్లను ఇతర అభ్యర్థులతో భర్తీ చేయవచ్చునన్న వెసులుబాటు తెలుగు రాష్ట్రాలకు ఇవ్వడం చెల్లదని సీనియర్‌ న్యాయవాదులు ఎస్‌.రామచంద్రరావు, సీవీ మోహన్‌రెడ్డి, డీవీ సీతారాం మూర్తి, రవిచందర్‌ నీట్‌ తరఫున వాదించారు.

Advertisement
Advertisement