భయం గుప్పిట్లో.. ఏడుగంటలు | Sakshi
Sakshi News home page

భయం గుప్పిట్లో.. ఏడుగంటలు

Published Sun, Jul 9 2017 1:37 AM

భయం గుప్పిట్లో.. ఏడుగంటలు - Sakshi

► డబ్బులిస్తానన్నా కొడుతూనే ఉన్నారు
► అదనంగా డబ్బులడగడంతో మెసేజ్‌ పంపే అవకాశమొచ్చింది
► కిడ్నాపర్ల చెర నుంచి విడుదలైన పశువైద్యుడు తిరుపతి


కాసిపేట(బెల్లంపల్లి): ‘ఆ ప్రాంతం తెలియదు.. వారి ఖాతాల్లో డబ్బులు వేయకుంటే చంపుతామని బెదిరిస్తూ వాహనంలో తిప్పుతూ కొట్టారు. డబ్బు లిప్పిస్తానని చెప్పినా కొడుతూనే ఉన్నారు. 7 గంటలు భయంగుప్పిట్లో గడిపినా అప్పుడు నా కుటుంబం గుర్తుకు వచ్చింది. డబ్బులిచ్చినా వదిలి పెడతారను కోలేదు’ మహా రాష్ట్రలో శుక్రవారం కిడ్నాపర్ల చెరలో ఏడుగంటలు గడిపి ఇంటికి చేరుకున్న మంచిర్యాల జిల్లా కాసిపేట మండల పశువైద్యాధికారి కుర్మ తిరుపతి అన్న మాటలివి.

కిడ్నాప్‌ వివరాలు ఆయన మాటల్లోనే..
గత నెల 29న ఎనిమిది మంది లబ్ధిదారులకు గొర్రెలు కోనుగోలు చేసేందుకు మహారాష్ట్రలోని సోలాపూర్‌కు వెళ్లాను.  30న సోలాపూర్‌ జిల్లాలోని సంగోల ప్రాంతంలో తిరిగినా గొర్రెలు దొరకలేదు. జూలై ఒకటిన పుణేకు సమీ పంలోని బిగ్‌ 1కు వెళ్లాం. ‘నావద్ద గొర్లున్నాయి’ చెబుతూ రాంచంద్ర మహదేవ్‌ కబడి అనే వ్యక్తి తమవెంట ఉండడంతో 3 యూనిట్లు కొనుగోలు చేశాం.  గొర్రెలను పరిశీలిస్తున్న క్రమంలోనే ఇతర లబ్ధిదారుల యూనిట్లకు సంబంధించిన డబ్బులు కూడా తమ ఖాతాల్లో వేస్తే వారికి ముట్టజెబు తామని కోరారు. అలా కుదరదు. సంబంధిత లబ్ధిదారుల ఖాతాలోనే జమ చేస్తామన్నా. అప్పటి నుంచి వారి వేధింపులు మొదలయ్యాయి.

అన్నం తింటూ లాడ్జిలో సొసైటీ సభ్యులతో మాట్లాడు తున్న. ఇంతలో గొర్రెలను పరిశీలిస్తున్న ఫొటోలు తీస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈనెల7న శుక్రవారం ఉదయం కాసిపేట మండలం ధర్మ రావుపేటకు చెందిన యాదవ సొసైటీ సభ్యులు రావడంతో వారితో గొర్రెల విషయమై లాడ్జి ముందు ఫోన్‌లో మాట్లాడుతున్న క్రమంలో  రాం చంద్ర మహదేవ్‌తోపాటు మరో నలుగురు తనను వాహనంలోకి ఎక్కించి కొట్టారు. వాహ నంలోనే తిప్పుతూ తమ ఖాతాల్లోకి రూ.10 లక్షలు పంపిం చాలన్నారు.  రోజువారీగా పంపి నట్లు తమ ఖాతా ల్లోకి డబ్బులు పంపాలని లేకుంటే చంపేస్తానని బెదిరించాడు.

ఓ ఇంట్లో పెట్టి కొడు తుండడంతో వీరి చెర నుంచి ఎలాగైనా బయట పడాలని తొమ్మిది యూనిట్లకు సంబంధిం చి రూ.9.90 లక్షలు పంపిస్తానని చెప్పి ఏడీకి ఫోన్‌ చేసిన. మూడు ఖాతా నంబర్లు ఇచ్చిన. దీంతో తెలుగులో మాట్లాడకుండా దగ్గరుండి హిందీలో మాట్లాడిం చారు. వారి ఖాతా నంబర్లు స్కాన్‌ చేసి ఏడీకి చెప్పగా, ఆయన పంపిస్తున్నట్లు చెప్పడంతో వారు  నమ్మారు.  నీ ఖాతా నుంచి రూ.లక్ష ట్రాన్స్‌ ఫర్‌ చేయాలని చెప్పడంతో తన దగ్గర అంత లేదని రూ.10 వేలు మాత్రమే ఉన్నట్లు తెలిపారు. అయితే, తనకు తెలిసిన ఇద్దరు, ముగ్గురు డాక్టర్లకు ఫోన్‌ చేయగా అందరూ డబ్బుల్లేవని చెప్పారు.

ఐయామ్‌ కిడ్నాప్డ్‌
బెల్లంపల్లి వైద్యుడు శంకర్‌లింగం రూ.30 వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు. వారి ఖాతా ల్లో జమ చేసేందుకు ఒప్పుకున్నారు. వారు ఫోన్‌లో మాట్లాడుతుండగా ఖాతా నంబర్‌ పంపి న వెంటనే కొంత సమయం దొరకడంతో ఐయా మ్‌ కిడ్నాప్‌డ్‌ అని మేసేజ్‌ పంపించాను. దీంతో విషయం అర్థం చేసుకున్న ఆ వైద్యుడు తన కిడ్నాప్‌ విషయాన్ని అధికారులకు చెప్పారు. డబ్బులు ఖాతాలకు ఇంకా వస్తా లేవు అంటూ  చెట్లు పుట్టల వెంబడి తిప్పారు. సోలాపూర్‌ కలె క్టర్, ఎస్పీలకు సంఘటన వివరాలు తెలియ డంతో ప్రత్యేక వాహనంలో వస్తున్న క్రమంలో గమనించి ఎక్తాపూర శివారులో 3 గంటలకు దింపేసి వెళ్లిపోయారని  తిరుపతి పేర్కొన్నారు.

Advertisement
Advertisement