విజి‘లెన్స్‌’కు అవినీతి మరకలు | Sakshi
Sakshi News home page

విజి‘లెన్స్‌’కు అవినీతి మరకలు

Published Sat, Oct 21 2017 3:49 AM

The Vigilance system is merged with ACB

సాక్షి, హైదరాబాద్‌ :  అక్రమాలపై నిఘా పెట్టి ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన విజిలెన్స్‌ వ్యవస్థే చేను మేస్తోంది! జీహెచ్‌ఎంసీ, వాటర్‌ బోర్డు, ట్రాన్స్‌కో, హెచ్‌ఎండీఏ, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లోని విజిలెన్స్‌ అధికా రులు, వారి పనితీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా ‘బాబోయ్‌.. మాకొద్దు ఈ అధికారులు’ అంటూ పోలీస్‌ పెద్దలకు ఫిర్యాదులపై ఫిర్యాదులు అందుతున్నాయి.

ఈ విభా గాల్లోని విజిలెన్స్‌ వ్యవస్థలో కేవలం పోలీస్‌ అధికారులే విధులు నిర్వర్తిస్తున్నారు. వీటి ల్లో పనిచేసేందుకు చాలా పోటీ, డిమాండ్‌ ఉండటంతో అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు డిప్యూ టేషన్‌పై బదిలీ చేయించుకొని మరీ వెళ్తుంటారు. ఇటీవలే హెచ్‌ఎండీఏలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో ఉన్న ఓ పోలీస్‌ అధికారి చేసిన అవినీతి వెలుగులోకి రావడంతో అన్ని విభాగాల్లో ఉన్న విజిలెన్స్‌ అధికారులపై నిఘా వర్గాలు దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

కరెంట్‌ విజిలెన్స్‌ మస్తు
ట్రాన్స్‌కో విభాగంలోనూ విజిలెన్స్‌ వింగ్‌ ఉంది. ఈ విభాగానికి డిప్యుటేషన్‌పై వెళ్లడం అంత సులభం కాదు. కొందరికే ఈ అవకాశం వస్తుంది. పోలీస్‌ ఉద్యోగం వదిలి ట్రాన్స్‌కోలో విజిలెన్స్‌ అధికారులు, సిబ్బంది వెళ్లడంపై ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది.

ఏఈలు, డీఈలు, కింది స్థాయి సిబ్బందిపై వచ్చే అక్రమాల ఫిర్యాదుపై విచారణ జరిపి నివేదిక తయారు చేయా ల్సిన విజిలెన్స్‌ అధికారులు వారితోనే కుమ్మౖMð్క నివేదికలు మార్చిన ఘటనలు న్నాయని ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు చెబుతున్నారు. విద్యుత్‌ చౌర్యానికి సంబంధించి వచ్చే ఫిర్యాదులనూ  విజిలెన్స్‌ అధికారులు క్యాష్‌ చేసుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి. జీహెచ్‌ఎంసీలోని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌లోనూ ఇలాంటి వ్యవహారాలే బయటపడటంతో అక్కడ ఉన్నతాధికారులు ఇటీవలే పలువురిని పోలీస్‌ శాఖకు సరెండర్‌ చేశారు.

వ్యాపారులు గగ్గోలు
జీఎస్‌టీ వచ్చాక విజిలెన్స్‌ అధికారుల నుంచి తమకు వేధింపులు ఎక్కువ య్యాయని వ్యాపారులు కూడా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా రైస్‌మిల్లర్లు, ఇతరత్రా మధ్య తరహా వ్యాపారులు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారు లపై మంత్రులకు ఫిర్యాదు చేశారు. అక్రమ రవాణా, జీరో దందా, ట్యాక్స్‌ చెల్లించకుండా జరిగే వ్యాపారాలు తదితర వ్యవహారాలపై  దృష్టి సారించాల్సిన అధికారులు ఇష్టారాజ్యంగా కమీషన్లు దండుకుంటున్నట్టు సమాచారం.


విజిలెన్స్‌ ఎత్తేయండి
రాష్ట్రంలోని ప్రధాన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తోపాటు వివిధ విభాగాల్లోని విజిలెన్స్‌ వ్యవస్థను ఎత్తివేయాలని హోంశాఖ గతంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టింది. అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) కిందే ప్రధాన విజిలెన్స్‌ వ్యవస్థ పనిచేసేలా రూపకల్పన చేయాలని సూచించింది. విజిలెన్స్‌ వ్యవస్థకు బదులు సంబంధిత శాఖల్లోనే అంతర్గత విభాగాలు రూపొందించుకొని అక్కడి అధికారులనే నియమించుకుంటే బాగుంటుందన్న ఆలోచనను కూడా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సూచించినట్టు తెలుస్తోంది.


కాసులు కురిపించే అక్రమ కట్టడాలు
హెచ్‌ఎండీఏలోని విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌లో పనిచేసిన ఓ పోలీస్‌ అధికారిపై అక్కడి ఉన్నతాధికారులు పోలీస్‌ అధికారులకు ఓ లేఖ రాశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను అడ్డంపెట్టుకొని అతడు భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డట్టు అందులో పేర్కొన్నారు. ఇలాంటి అధికారితో తమ అధికారులు, సిబ్బంది కూడా అక్రమార్జనలో ఆరితేరిపోతున్నారని, అతడిని వెంటనే సరెండర్‌ చేస్తున్నామని లేఖలో స్పష్టంచేశారు.

ఈ అధికారికి ముందు పనిచేసిన మరో డీఎస్పీ ఏకంగా సస్పెన్షన్‌కు గురికావడం చూస్తే ఏ స్థాయిలో వసూళ్లకు పాల్పడ్డారో అర్థమవుతోంది. ఈ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం అధికారులు.. అక్రమ కట్టడాలు నిర్మించిన వారి నుంచి భారీ స్థాయిలో వసూళ్లు చేసి ప్లానింగ్‌ విభాగాల్లోని అధికారులతో కుమ్మక్కయ్యారని లేఖలో వివరించారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు వాటి రక్షణకు తీసుకోవాల్సిన చర్యల కన్నా సొంత ఆదాయం పెంచుకోవడంపైనే వీరు దృష్టి పెట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.


కాసులు కురిపించే నీళ్లు
వాటర్‌బోర్డులో విజిలెన్స్‌ విభాగం పోస్టింగ్‌ అంటే చాలు.. లకరాలు పలికినట్టే అన్న మాట పోలీస్‌ శాఖలో వినిపిస్తోంది. అక్రమ నీటి కనెక్షన్లు, వాటర్‌ ట్యాంకర్ల అక్రమాలు, నల్లా కనెక్షన్లకు మోటార్ల బిగింపు.. తదితర వ్యవహారాలు పర్యవేక్షించాల్సిన విజి లెన్స్‌ అధికారులు వీటిని అడ్డం పెట్టుకొని భారీగానే దండుకుంటున్నట్టు ఆరోప ణలు వినిపిస్తున్నాయి.

ఇంతటితో ఆగని కొంత మంది పోలీస్‌ అధికారులు ఏకంగా వాటర్‌బోర్డు ఆధ్వర్యంలో ఓ పోలీస్‌స్టేషన్‌ పెట్టి దందా నడిపించేందుకు సిద్ధమవడం ఉన్నతాధికారులనే కంగు తినిపించింది. ఇలాంటివేవీ ఇక్కడ చేయాల్సిన అవసరం లేదని ఉన్నతా ధికారులు పోలీస్‌ శాఖకు రాసిన లేఖలు తెగేసి చెప్పినట్టు సమాచారం.

Advertisement
Advertisement