కాగ్‌ నివేదికపై సమాధానమివ్వాలి: తమ్మినేని | Sakshi
Sakshi News home page

కాగ్‌ నివేదికపై సమాధానమివ్వాలి: తమ్మినేని

Published Wed, Mar 29 2017 3:18 AM

కాగ్‌ నివేదికపై సమాధానమివ్వాలి: తమ్మినేని - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: 2015–16 బడ్జెట్‌లో మిగులు నిధులున్నా యనే సీఎం ప్రచారం పచ్చి బూటకమని కాగ్‌ నివేదికతో రుజు వైందని సీపీఎం పేర్కొంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాల ఆధారంగా పరిపాలన సాగించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. 2014–16 వరకు కాగ్‌ నివేదిక బహిర్గతపరిచిన లోపాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.

2015–16 బడ్జెట్‌ను కాగ్‌ విశ్లేషించి 2021–23 మధ్య ఏటా రూ.17,800 కోట్లకు పైగా అప్పుల భారం పడుతుందని, ప్రస్తుతమున్న రుణాల చెల్లింపులతో పాటు కొత్త అప్పులు చేయాల్సి వస్తుందని హెచ్చరించిందన్నారు. బడ్జెటే తర, క్యాపిటల్‌ రుణాలను రెవెన్యూ ఆదాయంతో చూపడం ద్వారా 2015–16లో రూ.238 కోట్ల మిగులు కనబడిందని పేర్కొన్నారు. రుణాలు లభ్యం కాకపోతే అది లోటు బడ్జెట్‌ తప్ప మిగులు బడ్జెట్‌ కాదని కాగ్‌ స్పష్టం చేసిందన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement